డిసెంబర్ మొదటి వారంలో పుష్ప 2 ది రూల్ తో పోటీ పడేందుకు సిద్ధపడిన బాలీవుడ్ ప్యాన్ ఇండియా మూవీ చావా వాయిదా పడటం దాదాపు ఖరారైనట్టే. ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినా ఇప్పటిదాకా ప్రమోషన్లు మొదలుపెట్టకపోవడంతో పోస్ట్ పోన్ జస్ట్ లాంఛనమేనని చెప్పాలి. ముందు చెప్పిన ప్రకారమైతే ఆ నెల 6 విడుదల కావాలి. అయితే పుష్ప 2 క్లాష్ వల్ల ఓపెనింగ్స్ దెబ్బ తింటాయని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. మరాఠా వీరుడు శంభాజీ బయోపిక్ గా రూపొందిన ఈ చారిత్రక డ్రామాలో రష్మిక మందన్ననే హీరోయిన్ కావడం గమనార్షం. ఇప్పుడు అసలు ట్విస్టు చూద్దాం.
అల్లు అర్జున్ తో క్లాష్ వద్దనుకున్న చావా ఇప్పుడు రామ్ చరణ్ తో పోటీకి సిద్ధపడుతోంది. కొత్త డేట్ గా జనవరి 10 లాక్ చేయబోతున్నట్టు ముంబై మీడియా టాక్. నిజానికి డిసెంబర్ 20 ఆప్షన్ పరిగణనలోకి తీసుకున్నారు. కానీ అదే రోజు ముఫాసా లయన్ కింగ్ ని ఇండియాలో పెద్ద ఎత్తున తీసుకొస్తున్నారు. గత భాగం మన దేశంలో నూటా ఎనభై కోట్లకు పైగా వసూలు చేసిన నేపథ్యంలో ఇప్పుడు కొత్త మృగరాజుని తక్కువంచనా వేయడానికి లేదు. పైగా తెలుగు, తమిళంలో చెప్పుకోదగ్గ నోటెడ్ రిలీజులు చాలానే ఉన్నాయి. దానికన్నా కీలకమైన సంక్రాంతికి షిఫ్ట్ అయిపోతే ఏ గొడవా లేకుండా మంచి కలెక్షన్లు చూడొచ్చు.
సో పుష్ప 2తో తలపడటం కన్నా గేమ్ చేంజర్ ని ఢీ కొట్టడమే సేఫని చావా టీమ్ భావించింది. రామ్ చరణ్ కు ఉత్తరాదిలో ఇమేజ్ ఉంది కానీ దర్శకుడు శంకర్ బ్రాండ్ అక్కడ మరీ తీవ్రంగా లేదు. సో పెద్దగా ఇబ్బంది ఉండదు. ఇంకో రెండు మూడు రోజుల్లో చావాకు సంబంధించిన అధికారిక ప్రకటన రాబోతోంది. విక్కీ కౌశల్ టైటిల్ రోల్ పోషించిన చావా మీద రెండు వందల కోట్లకు పైగానే బడ్జెట్ పెట్టారట. మహారాష్ట్ర, ఢిల్లీ, బెంగాల్ తదితర రాష్ట్రాల్లో ప్రత్యేకంగా పన్ను రాయితీలు ఇవ్వబోతున్నారని సమాచారం. దీని గురించి చరణ్ ఫ్యాన్స్ టెన్షన్ పడాల్సిన పని లేదు. చావా ప్రభావం ఉత్తరాదికే ఎక్కువగా పరిమితమవుతుంది.
This post was last modified on November 9, 2024 12:27 pm
బాలీవుడ్ డెబ్యూ స్పెషల్ గా ఉండాలని ఎవరైనా కోరుకుంటారు. ఎందుకంటే అదిచ్చే ఫలితాన్ని బట్టే మార్కెట్ తో పాటు అవకాశాలు…
ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ లో నటించాక ఏ హీరోయిన్ కైనా ఆఫర్ల వర్షం కురుస్తుంది. కానీ కెజిఎఫ్ రెండు భాగాల్లో…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకటి రెండు పెద్ద సినిమాలు సెట్స్ మీదుంచి వాటిని బ్యాలన్స్ చేయడం ఎంతటి అగ్ర నిర్మాతలకైనా సరే…
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నగరి నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకున్న గాలి భానుప్రకాష్ నాయుడు.. దూకుడు ప్రదర్శిస్తున్నారు. యువ ఎమ్మెల్యేగా…
ఈ ఏడాది జరిగిన ఏపీ ఎన్నికల సమయంలోనూ.. తర్వాత కూడా.. కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఓ ప్రశ్న…
ఈ టాపిక్ అల్లు అర్జున్ కోర్టు కేసు, బెయిలు గురించి కాదులెండి. ఆ వ్యవహారం న్యాయస్థానంలో జరుగుతోంది కాబట్టి దాని…