డిజాస్టర్ స్ట్రీక్‌కు తెరదించుతూ ‘క’ మూవీతో మంచి హిట్టే కొట్టాడు యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం. మీటర్, రూల్స్ రంజన్ లాంటి సినిమాలతో తన జడ్జిమెంట్ మీద అనేక సందేహాలు రేకెత్తించిన కిరణ్.. ఏడాదికి పైగా గ్యాప్ తీసుకుని ‘క’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇంతకుముందు కొన్ని తప్పులు చేశానని.. ‘క’ మాత్రం మనసుపెట్టి, కష్టపడి చేసిన సినిమా అని.. ఇది కచ్చితంగా ప్రేక్షకులను మెప్పిస్తుందని ధీమా వ్యక్తం చేసిన అతను.. చెప్పినట్లే మంచి సినిమా డెలివర్ చేశాడు.
దీపావళి కానుకగా విడుదలైన ఈ చిత్రం వచ్చిన టాక్‌ను మించి బాక్సాఫీస్ దగ్గర ఘనవిజయం సాధించింది. రెండో వారంలోనూ వసూళ్లు స్టడీగా ఉన్నాయి. తమిళం, మలయాళం, హిందీ భాషల్లోనూ ఈ చిత్రం విడుదలవుతోంది. ఈ సినిమాతో పోయిన క్రేజ్, మార్కెట్‌ను కిరణ్ తిరిగి సంపాదించుకున్నట్లే కనిపిస్తున్నాడు.
ఈ ఉత్సాహంలో మరో సినిమాను విడుదలకు సిద్ధం చేస్తున్నాడు కిరణ్. ఆ సినిమా పేరు.. దిల్ రుబా. కిరణ్ సరసన రుక్సర్ థిల్లాన్ ఈ చిత్రంలో కథానాయికగా నటించింది. విశ్వ కరుణ్ అనే కొత్త దర్శకుడు ఈ ప్రేమకథా చిత్రాన్ని రూపొందించాడు. నిజానికి ‘క’ కంటే ముందు ఇదే విడుదల కావాల్సింది.
ఈ సినిమా ‘క’ కంటే ముందే మొదలై, పూర్తయింది కూడా. కానీ కిరణ్ సినిమాలు వరుసగా డిజాస్టర్లు కావడంతో ఈ సినిమాను హోల్డ్‌లో పెట్టాడు. ఇది ఒక సగటు ప్రేమకథా చిత్రం కావడంతో దీన్ని రిలీజ్ చేస్తే ప్రేక్షకులు పట్టించుకోరని ఆగాడు. బిజినెస్ కూడా కష్టమవుతుందని భావించాడు. ‘క’ సినిమా రిలీజైతే మళ్లీ ప్రేక్షకులకు తన మీద గురి కుదురుతుందని.. ఆ తర్వాత ‘దిల్ రుబా’ రిలీజ్ చేయాలని ఆలోచించాడు. అతడి అంచనాలకు తగ్గట్లే ‘క’ సక్సెస్ అయింది. ఈ ఊపులో ‘దిల్ రుబా’కు మంచి బిజినెస్ జరిగే అవకాశముంది. సినిమాలో విషయం ఉంటే బాగా ఆడుతుంది కూడా. బిజినెస్ అంతా ఓకే అనుకున్నాక సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయబోతున్నారు.
This post was last modified on November 8, 2024 6:49 pm
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…
టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…
గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…
ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…
రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…