కెజిఎఫ్, కాంతార, సలార్ లాంటి ప్యాన్ ఇండియా బ్లాక్ బస్టర్లు తీసిన నిర్మాణ సంస్థ హోంబాలే ఫిలింస్ ట్రిపుల్ జాక్ పాట్ కొట్టేసింది. ప్రభాస్ తో ఒక సినిమా చేస్తేనే అదో అచీవ్ మెంట్ లా భావించే ట్రెండ్ లో ఏకంగా మూడు చిత్రాలకు ఒప్పందాలు చేసుకోవడం అరుదైన మైలురాయిగా చెప్పుకోవచ్చు. దీని గురించి ప్రచారం గత రెండు మూడు రోజుల నుంచి జరుగుతున్నప్పటికీ ఇవాళ అధికారిక ముద్ర వచ్చింది. 2026, 2027, 2028 వరసగా మూడు సంవత్సరాలు డార్లింగ్ తో తమ అనుబంధం ఉంటుందని, సంవత్సరానికి ఒక భారీ గ్రాండియర్ ని చూడొచ్చని, సలార్ 2 శౌర్యంగపర్వంతో మొదలవుతుందని చెప్పేసింది.
సౌత్ లోనే అతి పెద్ద కొలాబరేషన్ గా దీన్ని చెప్పుకోవచ్చు. సలార్ 2 దర్శకుడు ప్రశాంత్ నీల్ కాబట్టి పెద్ద సస్పెన్స్ లేదు కానీ మిగిలిన రెండు ఎవరనే డౌట్ వస్తోంది కదూ. అంతర్గతంగా వినిపిస్తున్న లీక్స్ ప్రకారం వాళ్ళు ప్రశాంత్ వర్మ, లోకేష్ కనగరాజ్. వీటికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇవ్వకపోయినా ప్రాధమిక ఒప్పందం అయితే జరిగిందని అంటున్నారు. ప్రస్తుతం హోంబాలే దృష్టి తొలుత సలార్ 2 మీద ఉండబోతోంది. నీల్ ముందు జూనియర్ ఎన్టీఆర్ సినిమాని పూర్తి చేసి 2026 సంక్రాంతి విడుదలకు సిద్ధం చేయాలి. ఈలోగానే ప్రభాస్ తో కలిసి సలార్ 2 మొదలుపెట్టే అవకాశముంది.
మొత్తానికి ఇదో బ్లాస్టింగ్ సెన్సేషనని చెప్పొచ్చు. ఒక టాప్ మోస్ట్ బ్యానర్ కి ప్రభాస్ లాంటి హీరో ఒకేసారి మూడు కమిట్ మెంట్లు ఇవ్వడం అది కూడా వరసగా అంటే విశేషమే. ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీతో పాటు మారుతి ది రాజా సాబ్ రెండు సమాంతరంగా పూర్తి చేయడంలో బిజీగా ఉన్న ప్రభాస్ ఆ తర్వాత స్పిరిట్, సలార్ 2 సెట్స్ లో అడుగు పెట్టొచ్చు. కల్కి 2కి సంబంధించిన అప్డేట్ ఇంకా రావాలి. ఒకటి మాత్రం నిజం. టయర్ 1 హీరోలకు అందనంత ఎత్తులో ప్రభాస్ చూపిస్తున్న స్పీడ్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా అందరికీ స్ఫూర్తే. ఫాలో అయితే ఎంత బాగుంటుందో.
This post was last modified on November 8, 2024 2:22 pm
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు మరో బీసీ మంత్రాన్ని పఠిస్తున్నారు. వారికి ఇప్పటికే.. సరైన సముచిత ప్రాధాన్యం కల్పించిన…
‘పవర్’ లాంటి సూపర్ హిట్ మూవీతో దర్శకుడిగా పరిచయమైన బాబీ.. ఆ తర్వాత ‘సర్దార్ గబ్బర్ సింగ్’తో ఎదురు దెబ్బ…
అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమైన డొనాల్డ్ ట్రంప్ మరణశిక్ష అమలుపై తన కఠినమైన వైఖరిని వ్యక్తం చేశారు.…
మాములుగా ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా సరే రెండు వారాల తర్వాత బాగా నెమ్మదించిపోతుంది. మొదటి పది…
పెద్ద అంచనాలతో బాలీవుడ్ మూవీ బేబీ జాన్ రిలీజయ్యింది. విజయ్ బ్లాక్ బస్టర్ తెరీ రీమేక్ గా అట్లీ నిర్మాణంలో…