ఏళ్ళ నిరీక్షణకు శుభం కార్డు వేస్తూ జనవరి 10 విడుదల కాబోతున్న గేమ్ ఛేంజర్ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతగా తపించిపోతున్నారో తెలిసిందే. ఆర్ఆర్ఆర్ తో ప్యాన్ ఇండియా ఇమేజ్ వచ్చాక రామ్ చరణ్ క్యామియో చేసిన ఆచార్య దారుణంగా పోయింది. అయినా సరే అతిథి పాత్ర కాబట్టి అభిమానులు దాన్ని పరిగణనలోకి తీసుకోరు కనక ఇప్పుడు దర్శకుడు శంకర్ మీదే భారం మొత్తం వేసి ఎదురు చూస్తున్నారు. ఎల్లుండి లక్నోలో జరిగే గ్రాండ్ ఈవెంట్ కు టాలీవుడ్ మీడియా కూడా హాజరు కానుండగా చరణ్, శంకర్, ఎస్జె సూర్య, శ్రీకాంత్ తో పాటు ప్రధాన క్యాస్ట్ అండ్ క్రూ పాల్గొనబోతోంది.
డేట్ ఇష్యూ వల్ల కియారా అద్వానీ రాకపోవచ్చని టాక్. ఇక టీజర్ కు సంబంధించిన కొన్ని ముఖ్యమైన లీక్స్ ఆసక్తిని రెట్టింపు చేసేలా ఉన్నాయి. 91 సెకండ్ల పాటు నడిచే వీడియోలో ముందు క్రూరంగా నవ్వే ఎస్జె సూర్య ఇంట్రోతో మొదలై రామ్ చరణ్ ఎలివేషన్ షాట్లు, ట్రైన్ ఎపిసోడ్ విజువల్స్, అప్పన్న గెటప్ తాలూకు చిన్న అవుట్ లుక్ ఇలా సీన్లతోనే నడిపించి చివర్లో చరణ్ నోటివెంట అన్ ప్రిడిక్టబుల్ అనే మాటతో ముగిస్తారని తెలిసింది. ఒక్క చిన్న డైలాగు తప్ప వీడియో మొత్తం మాటలు ఉండవట. కానీ పదే పదే చూసేలా ఎడిటింగ్ చేయించిన తీరు అంచనాలు పెంచేలా ఉందని చూసినవాళ్లు చెబుతున్న మాట.
ఇప్పుడీ చిన్న టీజరే గేమ్ మొత్తాన్ని మార్చబోతోందని సమాచారం. నిర్మాత దిల్ రాజు ఇంకా బిజినెస్ డీల్స్ పూర్తి స్థాయిలో క్లోజ్ చేయలేదు. థర్డ్ పార్ట్ ఇస్తున్న రేట్లు టీజర్ వచ్చాక పెరుగుతాయని ఆశిస్తున్నారు. ఈ కారణంగానే డిస్ట్రిబ్యూటర్లు సైతం ఈ వేడుక పట్ల ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు. ఇండియన్ 2 తాలూకు ప్రభావం ఉంటుందని తొలుత భావించినప్పటికీ శంకర్ బ్రాండ్ కన్నా ఇది రామ్ చరణ్ మూవీగా ఎక్కువ పబ్లిసిటీ చేసుకోవడంతో క్రమంగా హైప్ ఎక్కడికో వెళ్లేలా ఉంది. సంక్రాంతి బరిలో ఉన్న సినిమాల్లో ఫుల్ లెన్త్ టీజర్ వదలుతున్న మొదటి సినిమా గేమ్ ఛేంజరే.
This post was last modified on %s = human-readable time difference 10:09 am
ప్రసిద్ధ జ్యోతిష్యుడు వేణుస్వామి ఇటీవల నాగచైతన్య, శోభిత ధూళిపాళ వివాహ బంధం గురించి చేసిన కామెంట్స్ వివాదస్పదమైన విషయం తెలిసిందే.…
కంగువతో వరుణ్ తేజ్ మట్కా క్లాష్ అవుతుంటేనే అవసరమా అంటూ మెగా ఫ్యాన్స్ లోనే సవాలక్ష సందేహాలున్నాయి. కానీ టీమ్…
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో ఉన్న భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో…
ప్రభాస్ ఏదైనా ప్యాన్ ఇండియా సినిమాతో వస్తున్నాడంటే దానికి ముందు వెనుకా పోటీ పడేందుకు నిర్మాతలు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు.…
టాలీవుడ్లో మరోసారి చిన్న సినిమాల జాతరకు రంగం సిద్ధమైంది. ఈ శుక్రవారం ఏకంగా అరడజనుకు పైగా సినిమాలు రిలీజవుతున్నాయి. అందులో…
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనేది సంగతి తెలిసిందే. అలాగే రాజకీయాలో హుందాతనం, గౌరవం కాపాడుకునే ప్రవర్తన కూడా…