ప్రభాస్ ప్రస్తుతం ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్ మాత్రమే కాదు.. బిజీయెస్ట్ స్టార్ కూడా. అతను చేసే ప్రతి చిత్రం భారీ స్థాయిదే. అయినా మల్టిపుల్ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉంటున్నాడు ప్రభాస్. ఏడు నెలల వ్యవధిలో సలార్, కల్కి లాంటి భారీ చిత్రాలను అతను రిలీజ్ చేశాడు. ఇంకో ఐదు నెలల్లో ‘రాజా సాబ్’ ప్రేక్షకులను పలకరించబోతోంది.
ప్రస్తుతం ప్రభాస్ ‘రాజా సాబ్’తో పాటుగా హను రాఘవపూడి చిత్రం షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. ప్రభాస్ స్థాయి హీరో ఒకేసారి రెండు చిత్రాల షూటింగ్‌లో పాల్గొనడమే విశేషం. కానీ ఇప్పుడు తన జాబితాలోకి మరో సినిమా చేరబోతోంది. అదే.. స్పిరిట్. ప్రభాస్ ఏడాది కిందటే కమిటైన మూవీ ఇది.
అర్జున్ రెడ్డి, యానిమల్ చిత్రాల దర్శకుడు సందీప్ రెడ్డి వంగ దీనికి దర్శకుడు. ఈ కాంబినేషన్లో సినిమా అనగానే అభిమానులు వెర్రెత్తిపోయారు. ఐతే ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్లడానికి చాలా సమయం పడుతుందని అంతా అనుకున్నారు.కానీ ఈ మూవీ డిసెంబరులోనే షూటింగ్‌లోకి వెళ్లబోతోందన్న సమాచారం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
‘స్పిరిట్’ నిర్మాత భూషణ్ కుమార్ స్వయంగా షూటింగ్ అప్‌డేట్ ఇచ్చాడు. డిసెంబరు చివర్లో చిత్రీకరణ మొదలుపెడతామని చెప్పాడు. ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతోందని వెల్లడించాడు. సందీప్ రెడ్డి వంగ స్క్రిప్టు, షూటింగ్ విషయంలో హడావుడి పడే రకం కాదు. అతను షూట్‌కు ఇంకా చాలా టైం తీసుకుంటాడని అంతా అనుకున్నారు.
కానీ అతను అనుకున్న దాని కంటే ముందే షూట్‌కు వెళ్లిపోనున్నాడు. ఐతే ఓవైపు రాజా సాబ్, ఇంకోవైపు ఫౌజీ (వర్కింగ్ టైటిల్) చిత్రీకరణలో బిజీగా ఉన్న ప్రభాస్‌కు ఇప్పుడే ‘స్పిరిట్’ చిత్రీకరణలో పాల్గొనేంత ఖాళీ ఎక్కడ ఉంది అన్నది సందేహం. మూడు చిత్రాలకు ప్రభాస్ వేర్వేరు లుక్స్ కూడా మెయింటైన్ చేయాల్సి ఉంది.
‘స్పిరిట్’ కోసం పూర్తిగా అవతారం మార్చబోతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. మరి ఒకేసారి మూడు చిత్రాల షూట్‌ను ఎలా మేనేజ్ చేస్తాడో చూడాలి. బహుశా ముందు వేరే నటీనటులతో చిత్రీకరణ మొదలుపెడితే.. కొంచెం లేటుగా ప్రభాస్ అందుకుంటాడేమో. ప్రభాస్ ఇంకా సలార్-2, కల్కి-2 చిత్రాల్లోనూ నటించాల్సి ఉన్న సంగతి తెలిసిందే.
This post was last modified on November 8, 2024 10:35 am
ఇండియన్ క్రికెట్లో మీడియా దృష్టిని బాగా ఆకర్షించిన జంటల్లో ఒకటనదగ్గ యుజ్వేంద్ర చాహల్-ధనశ్రీ విడిపోవడం ఇటీవల చర్చనీయాంశం అయిన సంగతి…
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ తో టీడీపీ అధినేత, ఏపీ సీఎం…
గత ఏడాది మలయాళం బ్లాక్ బస్టర్ ప్రేమలు తెలుగులోనూ మంచి విజయం నమోదు చేసుకుంది. ఎస్ఎస్ కార్తికేయ తీసుకున్న ప్రత్యేక…
అంతరిక్షం నుంచి భూమికి తిరిగొచ్చిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ త్వరలోనే భారత్‌కు రానున్నారని సమాచారం. తొమ్మిది నెలల…
ఐపీఎల్ 2025 సీజన్లో అందరి దృష్టి ఒక చిన్న కుర్రాడిపై నిలిచింది. కేవలం 13 ఏళ్ల వయసులో ఐపీఎల్లో అడుగుపెడుతున్న…
సినిమాలు తగ్గించినా సరే దేవిశ్రీ ప్రసాద్ సంగీతానికి ఉన్న ఫాలోయింగ్ చాలా ప్రత్యేకం. డిసెంబర్లో పుష్ప 2 ది రూల్…