మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టిలో సాఫ్ట్ గా వంటలు చేసుకునే ఫైవ్ స్టార్ చెఫ్ గా కనిపించిన స్వీటీ అనుష్క ఒక్కసారిగా ఊర మాస్ ఘాటీగా మారిపోయింది. క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ గ్యాంగ్ స్టర్ డ్రామా షూటింగ్ పూర్తి చేసుకోవడానికి దగ్గరలో ఉంది. ఈ రోజు అనుష్క పుట్టినరోజు సందర్భంగా టీజర్ రిలీజ్ చేశారు. మాములుగా నిమిషంలోపు నిడివి ఉండే ఇలాంటి వీడియోలని బట్టి కంటెంట్ అంచనా వేయడం కష్టం కానీ క్రిష్ మాత్రం తాను జేజమ్మని ఎంత వయొలెంట్ గా చూపించబోతున్నారో చిన్న శాంపిల్ ఇచ్చారు. విజువల్స్ చాలా ఇంటెన్స్ గా అంచనాలు పెంచేలా ఉన్నాయి.
కథ చెప్పలేదు కానీ కొన్ని క్లూస్ అయితే ఇచ్చారు. అడవి, సముద్రం, చెరువుల గుండా అక్రమ రవాణా జరిగే నేర సామ్రాజ్యంలో ఘాటీ మాములు అమ్మాయి స్థాయి నుంచి మహారాణిగా అందరిని శాసించే స్థాయికి ఎదుగుతుంది. ఈ క్రమంలో బస్సును ఆపి శత్రువు తలను నరికేసి దర్జాగా దాన్ని బయటికి తీసుకొచ్చేంత ధైర్యం తనది. ఇంత హింసాత్మకంగా తనెందుకు మారిందనేది తెరమీద చూడాలి. నాగవెల్లి విద్యాసాగర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, మనోజ్ రెడ్డి కాటసాని ఛాయాగ్రహణం మంచి స్టాండర్ లో ఉన్నాయి. సాయి మాధవ్ బుర్రా సంభాషణలు వినిపించే ఛాన్స్ ఇవ్వలేదు. మ్యూజిక్ తో సరిపెట్టారు.
ఇప్పటినుంచి ఘాటీ లెక్కలు మారనున్నాయి. అరుంధతి తర్వాత మళ్ళీ అంత డెప్త్ ఉన్న పాత్రను ఘాటీలో అనుష్క పోషించింది. ఇతర తారాగణం తదితర వివరాలు బయట పెట్టలేదు కానీ క్యాస్టింగ్ పెద్దదే ఉండబోతోంది. విడుదల తేదీ మాత్రం ఇంకా సస్పెన్స్ లో ఉంచారు. ఈ ఏడాదిలో నవంబర్ మినహాయిస్తే ఇంకొక్క నెల బ్యాలన్స్ ఉంది కాబట్టి 2025లోనే ఘాటీ థియేటర్లలో అడుగు పెడుతుంది. హరిహర వీరమల్లు నుంచి తప్పుకుని ఈ సినిమా చేసిన దర్శకుడు క్రిష్ ఈ ప్రాజెక్టు మీద చాలా కష్టపడ్డాడు. ఎన్టీఆర్ బయోపిక్, కొండపొలం వైఫల్యం, పవన్ సినిమా ఆలస్యం ఇవన్నీ మరిపించేలా హిట్టు కొట్టాలి మరి.
This post was last modified on November 7, 2024 4:50 pm
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…