వరస వైఫల్యాల తర్వాత వరుణ్ తేజ్ ఈ నెల 14న మట్కాతో ప్రేక్షకులను పలరించబోతున్నాడు. కంగువ లాంటి తీవ్రమైన పోటీ ఉన్నా సరే ఖచ్చితంగా మెప్పిస్తామనే నమ్మకంతో నిర్మాతలు సవాల్ కి సై అన్నారు. కరుణ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ గ్యాంగ్ స్టర్ డ్రామాలో వరుణ్ నాలుగు విభిన్న వయసులలో ఒక డాన్ గా ఎలా ఎదిగాడనే క్రమాన్ని చూపించబోతున్నారు. ట్రైలర్ కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. లక్కీ భాస్కర్ తో లక్కీ హీరోయిన్ గా మారిన మీనాక్షి చౌదరితో పాటు అదే సినిమాకు సంగీతం సమకూర్చిన జివి ప్రకాష్ కుమార్ మట్కాకు పని చేయడం పాజిటివ్ సెంటిమెంట్ గా ఫ్యాన్స్ భావిస్తున్నారు.
దీని సంగతి ఒకే కానీ వరుణ్ తేజ్ మట్కా తర్వాత ఎవరితో చేస్తాడనే దానికి సమాధానం దాదాపు దొరికినట్టే. దర్శకుడు మేర్లపాక గాంధీ చెప్పిన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాక్. ఈ కాంబో ఉంటుందని గతంలో లీక్ వచ్చింది కానీ ఫైనల్ వెర్షన్ సంతృప్తికరంగా రావడంతో ప్రాజెక్టు లాక్ చేసుకున్నారని తాజా వార్త. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో హారర్, కామెడీ రెండు మిక్స్ చేసిన వెరైటీ సబ్జెక్టుని సిద్ధం చేశారట. కెరీర్ లో తొలి రెండు సినిమాలు వేంకటాద్రి ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్ రాజా తర్వాత మేర్లపాక గాంధీకి సక్సెస్ లేదు. కృష్ణార్జున యుద్ధం, మాస్ట్రో, లైక్ షేర్ సబ్స్క్రైబ్ నిరాశపరిచాయి. ఏక్ మినీ కథ ఓటిటిలో హిట్టయ్యింది.
అయినా సరే గాంధీకి వరుణ్ తేజ్ ఆఫర్ ఇచ్చాడంటే స్టోరీ ఏదో బాగా వచ్చినట్టు ఉంది. మట్కా నుంచి బౌన్స్ బ్యాక్ అవుతానని మెగా ప్రిన్స్ బలంగా నమ్ముతున్నాడు. ముఖ్యంగా గద్దలకొండ గణేష్ తో దగ్గరైన మాస్ తర్వాత తాను చేసిన ప్రయోగాల వల్ల దూరమయ్యారని భావించి మట్కాని ఒప్పుకున్నాడు. దీనికి ముందు కరుణ కుమార్ సైతం ఫ్లాపులతో సతమతమవుతున్నవాడే. ఇప్పుడిది హిట్ అయితే తిరిగి హీరో, దర్శకుడు ఇద్దరూ పుంజుకోవచ్చు. లావణ్య త్రిపాఠిని పెళ్లాడాక మొగుడు పోస్టుని తెచ్చుకున్న వరుణ్ తేజ్ మట్కాతో విజయం సాధిస్తే భార్య వచ్చాక కొత్తగా లక్కు కూడా తోడైనట్టు అనుకోవాలి.
This post was last modified on November 7, 2024 11:45 am
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…