ఇటీవలే అబుదాబిలో జరిగిన ఐఫా అవార్డుల వేడుకకు దగ్గుబాటి రానా, తేజ సజ్జ యాంకర్లుగా వ్యవహరించారు. ఇది ఛానల్స్ లో వచ్చే లైవ్ ఈవెంట్ కాకపోవడంతో ప్రత్యక్షంగా వెళ్లిన వాళ్లకు తప్ప ఇండియాలో ఉన్న అభిమానులు చూసే ఛాన్స్ దక్కలేదు. కొన్ని సెల్ ఫోన్ తో తీసిన వీడియోలు చక్కర్లు కొట్టాయి కానీ చాలా సంగతులు బయట పడలేదు. తాజాగా యూట్యూబ్ లో స్ట్రీమింగ్ కు వచ్చాక ఆ విశేషాలన్నీ చూసే ఛాన్స్ దక్కింది. అయితే బాలీవుడ్ స్టైల్ ని అనుకరించబోయి రానా, తేజలు చేసిన సెటైరిక్ కామెడీ ఇతర హీరోల అభిమానుల్లో నిరసన కలిగేలా చేసిందని ఎక్స్ చూస్తే అర్థమైపోతోంది.
ఆహుతులను నవ్వించడంలో భాగంగా తేజ, రానాలు కొన్ని జోకులు వేశారు. వాటిలో సంక్రాంతికి తలపడిన హనుమాన్ – గుంటూరు కారం క్లాష్ గురించి ఉంది. ఇప్పుడు మహేష్ బాబుని ఏమి అనకపోయినా గతంలో పండగ విజేతగా తేజ గురించి కొందరు చేసిన ప్రచారం సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి ఆగ్రహం కలిగించిన సంగతి తెలిసిందే. ఆదిపురుష్ థియేటర్లలో హనుమంతుడి కోసం ఒక సీట్ వదిలేస్తే ఆయన ఓటిటి కోసం వదిలేశాడని చెప్పడం ప్రభాస్ ఫ్యాన్స్ కి ఆగ్రహం కలిగించింది. బాలయ్యకు రానా చేసిన ఫోన్ కాల్ లాంటివి సరదాగా అనిపించినా మిగిలినవి కొంచెం మిస్ ఫైర్ అయిన మాట వాస్తవం. మిస్టర్ బచ్చన్ ని ఉద్దేశించి కూడా పంచ్ వేశారు.
ఈ తరహా ఎంటర్ టైనింగ్ యాంకరింగ్ బాలీవుడ్ లో సర్వసాధారణం. షారుఖ్ ఖాన్ నుంచి పంకజ్ త్రిపాఠి దాకా అందరి మీద పంచులు వేసినా ఎవరేం ఫీల్ కారు. కానీ మనకీ పోకడ కొత్త. అందుకే రానా, తేజ సరదా సంభాషణను కొందరు తేలిగ్గా తీసుకోలేకపోతున్నారు. నిజానికి అక్కడ ఫీలవ్వాల్సింది ఏమి లేదనే కామెంట్స్ లోనూ నిజముంది కానీ అలవాటయ్యే దాకా ఇలాంటివివి కొత్తగా వింతగా ఉంటాయి. దీని పుణ్యమాని ఓ మోస్తరు వ్యూస్ వచ్చే ఇలాంటి అవార్డుల వీడియోలు ఇప్పుడు మిలియన్లు దాటేస్తున్నాయి. ఏది ఏమైనా మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రం ఆగ్రహంగా ఉన్న వైనం కనిపిస్తోంది.
This post was last modified on November 6, 2024 11:19 am
సౌత్ దర్శకుల్లో రాజమౌళి, సుకుమార్, త్రివిక్రమ్ తర్వాత అంతకన్నా తక్కువో ఎక్కువో స్టార్ డం తెచ్చుకున్న వాళ్లలో లోకేష్ కనగరాజ్…
ఇటీవలే జరిగిన ఒక ఈవెంట్ లో అమీర్ ఖాన్ మాట్లాడుతూ థియేటర్ ఓటిటి మధ్య ఇప్పుడున్న గ్యాప్ సరిపోదని నాలుగు…
రాష్ట్రంలోని 25 పార్లమెంటు నియోజకవర్గాల ఇంచార్జ్‌లను మార్చనున్నట్లు వైసీపీ అధినేత జగన్ చెప్పారు. అయితే దీనికి కొంత సమయం పడుతుందన్నారు.…
పహల్ గాం ఉగ్రవాద దాడి తదనంతర పరిణామాల్లో భాగంగా మంగళవార తెల్లవారుజామున భారత త్రివిధ దళాలు పాకిస్తాన్ భూభాగంలోని ఆ దేశ…
టాలీవుడ్లో ఒకప్పుడు టాప్-4 హీరోల్లో ఒకడిగా ఒక వెలుగు వెలిగిన హీరో.. అక్కినేని నాగార్జున. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్‌లతో పోటాపోటీగా…
పహల్గామ్లో ఉగ్రదాడి అనంతరం.. భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య తలెత్తిన ఉద్రిక్తతల నేపథ్యంలో ఎప్పుడు ఎలాంటి పరిస్థితి ఎదురైనా దేశ ప్రజలు…