ఈ దీపావళికి టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడిపోయింది. మంచి కంటెంట్ ఉన్న సినిమాలు పడ్డాయి. వాటికి మంచి వసూళ్లు కూడా వచ్చాయి. కన్నడ అనువాదం ‘బఘీర’ను పక్కన పెడితే.. లక్కీ భాస్కర్, క, అమరన్ మంచి టాక్ తెచ్చుకున్నాయి. వాటికి ఓపెనింగ్స్ పరంగానూ ఢోకా లేకపోయింది. ఇవి మూడూ బాక్సాఫీస్ విన్నర్లే అయినా.. అన్నింట్లోకి రియల్ విన్నర్ మాత్రం ‘క’ అనే చెప్పాలి.
లక్కీ భాస్కర్‌కు వసూళ్లు వచ్చాయి కానీ.. దానికి వచ్చిన టాక్‌కు తగ్గట్లు అయితే కాదు. రివ్యూలు, టాక్ ప్రకారం చూస్తే అది బ్లాక్ బస్టర్ కావాలి. కానీ బాక్సాఫీస్ నంబర్లు చూస్తే అది జస్ట్ హిట్ అనిపించుకునేలా ఉంది. వరల్డ్ వైడ్ రూ.30 కోట్ల బిజినెస్ చేసిన ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే ఇంకా మూణ్నాలుగు కోట్లు వెనక్కి తేవాల్సి ఉంది. ‘అమరన్’ డబ్బింగ్ మూవీ అయినప్పటికీ దాని స్థాయిలో ఓ మోస్తరు వసూళ్లు రాబట్టి సక్సెస్ ఫుల్ అనిపించుకుంది.
కానీ ‘క’ మాత్రం అందరి అంచనాలను మించిపోయింది. మిగతా రెండు చిత్రాలతో పోలిస్తే దీనికి టాక్, రివ్యూలు కొంచెం తక్కువగా వచ్చాయి. ఎబోవ్ యావరేజ్ అన్నట్లు మాట్లాడుకున్నారు అందరూ. కానీ ఇది ఆరంభం నుంచి మంచి వసూళ్లతో సాగింది. బి, సి సెంటర్లలో ఇది మిగతా రెండు చిత్రాల మీద పూర్తి ఆధిపత్యం చలాయించింది. ఎ సెంటర్లలో మిగతా చిత్రాలకు దీటుగా నిలిచింది. దీని మీద బయ్యర్లు తక్కువ పెట్టుబడులు పెట్టారు. రూ.10 కోట్లకు బిజినెస్ జరిగింది. వరల్డ్ వైడ్ ఈ సినిమా మీద పెట్టుబడి పెట్టిన ప్రతి ఒక్కరూ ఆల్రెడీ లాభాల బాట పట్టేశారు. నాలుగు రోజులకే అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అయిపోయింది.
ఇప్పటికే ‘క’ షేర్ రూ.13 కోట్లను దాటేసింది. రెండో వీకెండ్ అయ్యేసరికి ఈ సినిమా పెట్టుబడి మీద రెట్టింపు ఆదాయాన్ని తెచ్చి పెట్టే సంకేతాలు కనిపిస్తున్నాయి. దీన్ని బట్టి సినిమా ఎంత పెద్ద హిట్టో అంచనా వేయొచ్చు. వరుస డిజాస్టర్ల తర్వాత గ్యాప్ తీసుకుని శ్రద్ధగా ఈ సినిమా చేసిన కిరణ్ అబ్బవరం మంచి ఫలితాన్నే అందుకుంటున్నాడు.
This post was last modified on %s = human-readable time difference 5:04 pm
దేశంలో రిజర్వేషన్ల పరిమితి 50 శాతంగా ఉన్న విషయం తెలిసిందే. ఏ రిజర్వేషన్ అయినా.. 50 శాతానికి మించి ఇవ్వడానికి…
తండేల్ విడుదల తేదీ ప్రకటన కోసం నిర్వహించిన ప్రెస్ మీట్లో సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు టీమ్ పంచుకుంది.…
మరో వారంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఇవి పూర్తిగా బడ్జెట్ సమావేశాలేనని కూటమి సర్కారు చెబుతోంది. వచ్చే మార్చి…
దసరా బ్లాక్ బస్టర్ తో నానికి మొదటి వంద కోట్ల గ్రాసర్ ఇచ్చిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల రెండోసారి న్యాచురల్…
ఖైదీ, మాస్టర్, విక్రమ్, లియో చిత్రాలతో లోకేష్ కనకరాజ్ ఎంత క్రేజ్ సంపాదించుకున్నాడో తెలిసిందే. అతడి వల్లే సినిమాటిక్ యూనివర్శ్…
దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. గత కొన్నాళ్లుగా…