ఇప్పుడున్న పోటీ వాతావరణంలో హీరోయిన్లు అవకాశాలు ఎన్నయినా పట్టొచ్చు కానీ వరసగా హిట్లు కొట్టడం మాత్రం అరుదైన ఫీట్. అందులోనూ స్టార్లు లేని, బడ్జెట్ పెద్దగా ఖర్చు పెట్టని సినిమాల్లో నటించినప్పుడు గుర్తింపు, ఫేమ్ రెండు నెమ్మదిగా వస్తాయి. ఇప్పుడు నయన్ సారిక ఈ కోవలోకే చేరుతోంది. ఇటీవల కిరణ్ అబ్బవరం ‘క’లో మెప్పించింది ఈ బ్యూటీనే. పల్లెటూరిలో జరిగే క్రైమ్ థ్రిల్లరే అయినప్పటికీ దర్శకులు సుజిత్ – సందీప్ చేసిన పాత్ర డిజైన్ వల్ల నయన్ సారికకు మంచి గుర్తింపుతో పాటు చక్కని పాటలు పడ్డాయి. ఫ్లాపులతో సతమతమవుతున్న కిరణ్ అబ్బవరం సూపర్ హిట్లో భాగం పంచుకుంది.
కొన్ని నెలల క్రితం వెనక్కు ‘ఆయ్’లో నితిన్ నార్నె సరసన మురిపించింది కూడా ఈ నయన్ సారికే. మ్యాడ్ తో వచ్చిన గుర్తింపుని ఈ కుర్రాడు స్టాండర్డ్ చేసుకుంది ఆయ్ తోనే. అగ్ర కులానికి చెందిన చలాకి అమ్మాయి పల్లవిగా అందులో నయన్ చూపించిన పెర్ఫార్మన్స్ ప్రశంసలు దక్కించుకుంది. రెండు బ్యాక్ టు బ్యాక్ హిట్ల దెబ్బకు అమ్మడికి మీడియం నిర్మాతల నుంచి వరస కాల్స్ వస్తున్నాయట. నిజానికి దీనికన్నా ముందు తను ఆనంద్ దేవరకొండ ‘గంగం గణేశా’లో చేసింది. అదే డెబ్యూ. కానీ ఫ్లాప్ కావడంతో పాటు అందులో ప్రాధాన్యత ఏమంత లేకపోవడంతో ఆడియన్స్ అంతగా పట్టించుకోలేదు.
ఇప్పుడు ఆయ్, క అంటూ చిన్న అక్షరాలా టైటిల్స్ పెట్టుకున్న సినిమాలతో నయన్ సారిక అందుకుంటున్న హిట్లు చూస్తే మెల్లగా సెటిలైపోయేలా ఉంది. హైదరాబాద్ కే చెందిన ఈ తెలుగమ్మాయి ఇన్స్ టాలో మూడు లక్షలకు పైగా ఫాలోయర్లు ఉన్నారు. ఇప్పుడు వచ్చిన ఫేమ్ పుణ్యమాని ఆ నెంబర్ అంతకంత పెరుగుతోంది. బెంచ్ లైఫ్ వెబ్ సిరీస్ లోనూ నటించిన నయన్ ఇకపై సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తానంటోంది. ఇతర రాష్ట్రాల నుంచి హీరోయిన్లను తెచ్చుకోవాల్సిన పరిస్థితిలో నయన్ సారిక లాంటి వాళ్లకు మరిన్ని ఆవకాశాలు దక్కితే స్టార్లతో జోడీకట్టే రోజులు ఎంతో దూరంలో లేవు.
This post was last modified on November 5, 2024 12:39 pm
ఇటీవలే కంగువ ఇచ్చిన షాక్ నుంచి సూర్య కోలుకున్నాడో లేదో కానీ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో చేసిన సినిమాని వీలైనంత…
అదేంటి.. అనుకుంటున్నారా? ప్రపంచం మొత్తం ముందుకు సాగుతుంటే చంద్రబాబు వెనక్కి తీసుకువె ళ్లడం ఏంటి? అని విస్మయం వ్యక్తం చేస్తున్నారా?…
ఈ రోజుల్లో సినిమా తీయడం కంటే దాన్ని సరిగ్గా ప్రమోట్ చేసి ప్రేక్షకులకు చేరువ చేయడమే పెద్ద టాస్క్ అయిపోయింది.…
వైసీపీ హయాంలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలపై సినీ నటుడు,వైసీపీ నేత పోసాని కృష్ణ ముురళి సంచలన వ్యాఖ్యలు చేసిన…
భారతీయ సంగీతాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్. స్లమ్ డాగ్ మిలియనీర్ చిత్రానికి గాను ఉత్తమ…