టాలీవుడ్లో మోస్ట్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్లలో దిల్ రాజు ఒకడు. నిర్మాతగా తొలి చిత్రం ‘దిల్’తో మొదలుపెడితే ఒకప్పుడు వరుసగా బ్లాక్ బస్టర్లు ఇచ్చి సూపర్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్‌గా పేరు తెచ్చుకున్నారు. కానీ ఈ మధ్య దిల్ రాజుకు బాక్సాఫీస్ దగ్గర పెద్దగా కలిసి రావడం లేదు. ఎ
ఫ్-3, థ్యాంక్యూ, శాకుంతలం, లవ్ మి, ఫ్యామిలీ స్టార్.. ఇలా వరుసగా ఫెయిల్యూర్లు ఎదుర్కొన్నాడు. ఇప్పుడు ఆయన ఆశలు గేమ్ చేంజర్ మీదే ఉన్నాయి. ఈ సంగతి పక్కన పెడితే తాను సరైన సినిమాలు చేయని విషయాన్ని తాజాగా దిల్ రాజు అంగీకరించాడు. ‘లక్కీ భాస్కర్’ సక్సెస్ మీట్‌కు అతిథిగా హాజరైన రాజు.. తాను ట్రాక్ తప్పానని వ్యాఖ్యానించడం గమనార్హం.
సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీలో తనను తాను చూసుకుంటున్నానని రాజు పేర్కొన్నాడు. ఈ మాట ఎందుకు అన్నానో చెబుతూ.. తాను ఒకప్పుడు చిన్న, మిడ్ రేంజ్ సినిమాలతో మంచి సక్సెస్‌లు అందుకున్నానని.. కానీ తర్వాత ట్రాక్ తప్పానని రాజు వ్యాఖ్యానించాడు. కానీ వంశీ ఇప్పుడు అలాంటి సినిమాలతోనే విజయాలు అందుకుంటున్నాడని చెప్పాడు. ‘లక్కీ భాస్కర్’ కమర్షియల్‌గా ఏ స్థాయి సక్సెస్ సాధిస్తుంది, దాని రెవెన్యూ ఎంత అన్నది తర్వాత తెలుస్తుందని.. కానీ ఇదొక క్లాసిక్ ఫిలిం అని రాజు పేర్కొన్నాడు.
దర్శకుడు వెంకీ అట్లూరితో తనది లాంగ్ జర్నీ అని.. తన బేనర్లో ‘తొలి ప్రేమ’ తీశాడని.. ‘లక్కీ భాస్కర్’ అతడి బెస్ట్ ఫిలిం అని.. ఈ చిత్రంలో కథను, క్యారెక్టర్లను హ్యాండిల్ చేసిన విధానం.. డైలాగ్స్ రాసిన తీరు చాలా బాగుందని రాజు వ్యాఖ్యానించాడు. మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్ చిత్రాలతో దుల్కర్ సల్మాన్ తెలుగులో క్లాసిక్ హిట్లు ఇచ్చాడని.. తనతో తర్వాతి సినిమా చేసేవాళ్లు జాగ్రత్తగా ఉండాలని రాజు నవ్వుతూ హెచ్చరించాడు.
This post was last modified on November 4, 2024 10:12 am
జాతీయ పురాతన పార్టీ కాంగ్రెస్‌లో అంతర్గతంగా భారీ కలకలం రేగినట్టు తెలుస్తోంది. ఇద్దరు కీలక నాయకుల మధ్య వివాదాలు తారస్థాయికి…
గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై…
దిగ్గజ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె మీద సినిమాలు, వెబ్ సిరీస్‌లు తీయడానికి ఒక సమయంలో ఫిలిం…
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…