మొన్న వెంకటేష్ 76 సినిమాకు సంక్రాంతికి వస్తున్నాం టైటిల్ తో పాటు సంక్రాంతి విడుదలని ప్రకటించడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ చిత్రం నిర్మిస్తున్న దిల్ రాజు బ్యానర్ నుంచే వస్తున్న గేమ్ ఛేంజర్ కోసం విశ్వంభరని వాయిదా వేసుకున్నప్పుడు వెంకీకి ఆ సూత్రం వర్తించదా అంటూ మెగా ఫ్యాన్స్ నుంచి ఎదురవుతున్న ప్రశ్న. టైటిల్ లోనే పండగను పెట్టుకుని వేరే సీజన్ కు వస్తే భావ్యం కాదనేది దర్శకుడు అనిల్ రావిపూడి వెర్షనట. అసలు ఈ సీజన్ లో ఖచ్చితంగా రావాలనే ఉద్దేశంతోనే ఆ పేరు పెట్టి ఉంటారనే కామెంట్స్ కూడా లేకపోలేదు. దేన్నీ కొట్టిపారేయలేని పరిస్థితి నెలకొంది.
అందరి మెదళ్లను తొలుస్తున్న ప్రశ్న ఒకటే. చిరంజీవి రిక్వెస్ట్ చేసి వాయిదా వేయించినప్పుడు తమ బ్యానర్ హీరో వెంకటేష్ ని ఎందుకు అడగలేకపోయారని. కానీ ఇక్కడ కొన్ని విషయాలున్నాయి. వెంకీ-రావిపూడి ప్రాజెక్టు అనౌన్స్ చేసిన టైంలోనే సంక్రాంతికి విడుదలని స్పష్టంగా ప్రీ లుక్ పోస్టర్స్ లో చెప్పారు. ఆ సమయానికి గేమ్ ఛేంజర్ డేట్ ఇంకా ఖరారు కాలేదు. డిసెంబర్ లో వస్తుందనే ప్రచారమే జరిగింది. దిల్ రాజు కూడా క్రిస్మస్ కానుకంటూ చెప్పుకుంటూ వచ్చారు. హఠాత్తుగా నిర్ణయం మార్చుకుని జనవరి 10కి వెళ్లిపోవడంతో అదే స్లాట్ ని ప్లాన్ చేసుకున్న సంక్రాంతికి వస్తున్నాంకి చిక్కొచ్చి పడింది.
నిజానికి విశ్వంభర బ్యాలన్స్ కి జనవరి 10 విడుదల సాధ్యం కాదు కాబట్టే గేమ్ చేంజర్ కి ఆ తేదీ ఇవ్వడం సులువయ్యిందనే వెర్షన్ మరొకటి ఉంది. ఏది ఏమైనా రామ్ చరణ్, వెంకటేష్ లకు వీలైనన్ని థియేటర్లు వచ్చేలా చేయడంలో దిల్ రాజు పెద్ద ప్లానింగే చేయాల్సి ఉంటుంది. వీటికి తోడు బాలయ్య 109, అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ పోటీని తట్టుకోవాలి. సంక్రాంతికి వస్తున్నాం కనక కొంచెం వాయిదా పడి ఉంటే బాగుండేది కానీ ఆ ఛాన్స్ లేనందువల్లే ఇప్పుడీ ఇరకాటం పడింది. ట్విస్ట్ ఏంటంటే గతంలో ఏఎన్ఆర్ కృష్ణల ఊరంతా సంక్రాంతి (1983), వెంకటేష్ సంక్రాంతి (2005) రెండూ ఫిబ్రవరిలో రిలీజయ్యాయి.
This post was last modified on November 2, 2024 2:50 pm
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…