ఈ ఏడాది తెలుగులో పెద్ద పెద్ద పండుగలేవీ ఆశించిన స్థాయిలో వినోదం పంచలేకపోయాయి. సంక్రాంతికి ‘హనుమాన్’ బాగా ఆడినా పెద్ద సినిమా ‘గుంటూరు కారం’ నిరాశపరిచింది. ‘సైంధవ్’ డిజాస్టర్ అయింది. ‘నా సామిరంగ’ ఓ మోస్తరుగా ఆడింది. దసరాకు నాలుగు సినిమాలు రిలీజ్ కాగా.. ఒక్కటీ మెప్పించలేకపోయాయి. ఇప్పుడిక దీపావళి వినోదానికి రంగం సిద్ధమైంది.
మామూలుగా దీపావళికి తెలుగు నుంచి పేరున్న సినిమాలు రావు. కానీ ఈసారి ‘లక్కీ భాస్కర్’, ‘క’ రూపంలో రెండు క్రేజీ మూవీస్ రిలీజవుతున్నాయి. తమిళం నుంచి ‘అమరన్’, కన్నడ నుంచి ‘బఘీర’ కూడా రేసులో నిలిచాయి. ఈ చిత్రాలన్నింటికీ పాజిటివ్ బజ్ కనిపిస్తోంది. అన్నీ కంటెంట్ రిచ్ సినిమాల్లాగే కనిపిస్తుండడంతో ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది.
టాలీవుడ్‌కు అమావాస్య విషయంలో నెగెటివ్ ఫీలింగ్ ఉంది. అందుకే ‘లక్కీ భాస్కర్’, ‘క’ చిత్రాలకు ముందు రోజే పెయిడ్ ప్రిమియర్స్ వేస్తున్నారు. ఒక రకంగా ముందు రోజు సాయంత్రమే ఈ సినిమాలు రిలీజవుతున్నట్లు. ‘లక్కీ భాస్కర్’కు ఏకంగా 150 పెయిడ్ ప్రిమియర్స్ పడుతుండడం విశేషం. ముందు వంద అనుకున్న ప్రిమియర్స్ సంఖ్య.. ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ చూసి ఇంకా పెరిగింది. ఇప్పటిదాకా ఏ చిత్రానికీ 150 పెయిడ్ ప్రిమియర్స్ పడలేదు. ఇది టాలీవుడ్ రికార్డు కావడం విశేషం. చాలా వరకు సినిమాలు సోల్డ్ ఔట్ అయ్యాయి. సినిమా హౌస్ ఫుల్స్‌తో రన్ కాబోతోంది బుధవారం రాత్రి.
మరోవైపు ‘క’ సినిమాకు పడుతున్న ప్రిమియర్స్‌కు కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. కిరణ్ అబ్బవరం గత చిత్రాలు తీవ్ర నిరాశకు గురి చేసినా.. ఆ ఎఫెక్ట్ దీనిపై పడలేదు. క్రేజీ ట్రైలర్ సినిమాకు కలిసొచ్చింది. మరోవైపు సాయిపల్లవి ఫ్యాక్టర్ వర్కవుట్ అయి ‘అమరన్’ బుకింగ్స్ కూడా అదిరిపోతున్నాయి. ఈ చిత్రానికి గురువారం పొద్దుపొద్దునే షోలు పడుతున్నాయి. అవన్నీ సోల్డ్ ఔట్ దశలో ఉన్నాయి. ఇక ‘బఘీర’కు కొంచెం బజ్ తక్కువే కానీ.. ప్రశాంత్ నీల్ కథ అందించడం, మంచి కమర్షియల్ సినిమాలా కనిపిస్తుండడంతో టాక్ బాగుంటే ఇది కూడా పుంజుకునే సంకేతాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి దీపావళికి బాక్సాఫీస్ దగ్గర పాజిటివ్ వైబ్స్ కనిపిస్తుండడం విశేషం.
This post was last modified on October 31, 2024 7:06 am
ఖేల్ రత్న అవార్డులు: గుకేశ్, మను బాకర్ సహా నలుగురికి గౌరవం భారత ప్రభుత్వం 2024 సంవత్సరానికి గాను మేజర్…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. తన అభిమానులకు అద్భుత సందేశం ఇచ్చారు. తనను అభిమానిం చేవారు... తప్పకుండా పాటించాలని…
ఇండియాస్ హైయెస్ట్ బడ్జెట్, మోస్ట్ హైప్డ్ మూవీకి ఈ రోజే ముహూర్త వేడుక ముగిసింది. సూపర్ స్టార్ మహేష్ బాబు…
ఇప్పుడంతా ఇంటర్ నెట్ ప్రపంచం. కొన్ని నిముషాలు మొబైల్ డేటా లేకపోయినా, ఇంట్లో వైఫై పనిచేయకపోయినా ఏదో భూమి బద్దలైపోయి…
ఈ సోషల్ మీడియా కాలంలో పెద్ద పెద్ద సినిమాలకు సంబంధించి కూడా ఆన్ లొకేషన్ ఫొటోలు, వీడియోలు లీక్ అయిపోతుంటాయి.…