ఒకప్పుడు కొత్త సినిమా అంటే థియేటర్లలో మాత్రమే రిలీజయ్యేది. కానీ ఇప్పుడు నేరుగా మన ఇంట్లోని టీవీలో విడుదలైపోతోంది. ఈ విప్లవానికి కారణం ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్. ఇంతకుముందు ఇవి కొత్త సినిమాలు రిలీజైన నెల నుంచి రెండు మూడు నెలల మధ్య కొత్త సినిమాలను విడుదల చేసేవి. కానీ కరోనా ధాటికి థియేటర్లు మూతపడ్డ గత ఆరేడు నెలల్లో కొత్త సినిమాలను నేరుగా రిలీజ్ చేసి ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచాయి. ఈ క్రమంలో వీటికి అనూహ్యమైన ఆదరణ లభించింది. సబ్‌స్క్రైబర్లు భారీగా పెరిగారు.
ఆహా లాంటి లోకల్ యాప్ సైతం సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ క్రమంలో ఇండియాలో అత్యధికంగా ఆదరణ పొందుతున్న ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఏది.. దేనికి అధిక స్థాయిలో సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.. వీటిలో ఏది నంబర్ వన్ అన్న ప్రశ్నలు తలెత్తడం సహజం.
ఒక బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ ట్విట్టర్ ద్వారా ఈ విషయమై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఆయన సమాచారం ప్రకారం ఇండియాలో నంబర్‌వన్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్.. డిస్నీ+హాట్‌స్టార్. ఆ సంస్థకు ఇండియాలో ప్రస్తుతం 2.05 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ముందు నుంచి ఎక్స్‌క్లూజివ్ స్పోర్స్స్ కంటెంట్‌తో భారీగా ఫాలోవర్లను సంపాదించుకున్న ఈ సంస్థ.. గత కొన్ని నెలల్లో పెద్ద ఎత్తున కొత్త కంటెంట్ పెంచి సబ్‌స్క్రైబర్లను పెంచుకుంది. ప్రస్తుతం నడుస్తున్న ఐపీఎల్‌తో దీనికి ఆదరణ ఇంకా పెరిగింది.
ఇక ఇండియన్ ఫిలిం, వెబ్ కంటెంట్‌ను గత కొన్నేళ్లలో భారీగా పెంచిన అమేజాన్ ప్రైమ్.. 82 లక్షల మంది సబ్‌స్క్రైబర్లతో రెండో స్థానంలో ఉంది. హిందీ సినిమాలు, సీరియళ్లతో పాటు లోకల్ కంటెంట్ బాగా అందుబాటులోకి తెచ్చిన జీ5 49 లక్షల సబ్‌స్క్రిప్షన్లతో మూడో స్థానంలో ఉంది. తర్వాతి స్థానంలో ఏక్తా కపూర్‌కు చెందిన ఏఎల్టీ బాలాజీ సంస్థ ఉండటం విశేషం. దాని సబ్‌స్క్రైబర్లు 40 లక్షలు. ఇక ఇంటర్నేషనల్ కంటెంట్‌ను భారీ స్థాయిలో అందిస్తూ ప్రపంచంలోనే నంబర్ వన్ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌గా ఉన్న నెట్‌ఫ్లిక్స్‌కు ఇండియాలో ఐదో స్థానానికి పరిమితమైంది. దాని సబ్‌స్క్రైబర్ల సంఖ్య 31 లక్షలట. దాని సబ్‌స్క్రిప్షన్ ధర ఎక్కువుండటం, లోకల్ కంటెంట్ తక్కువుండటం ఇందుక్కారణం కావచ్చు.
This post was last modified on October 3, 2020 10:41 am
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…
గల్లా జయదేవ్.. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంతూరు చంద్రగిరికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తగానే కాకుండా… గుంటూరు…
దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సమావేశం ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లోని పాలకులు, వ్యాపారవర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న సంగతి…
తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై జరుగుతున్న విచారణలో రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి.ప్రకాశ్ కీలక సమాచారాన్ని…