ఓటీటీల్లో కొత్త సినిమాలు రిలీజవుతున్న ఉత్సాహం బాగానే ఉంది కానీ.. వాటిలో ప్రేక్షకులను మెప్పిస్తున్నవి చాలా తక్కువ. అందులోనూ ఇండియాలో మంచి ఆదరణ ఉన్న ఓటీటీల్లో ఒకటైన అమేజాన్ ప్రైమ్‌లోకి వస్తున్న కొత్త సినిమాలైతే తీవ్ర నిరాశను మిగులుస్తున్నాయి. అత్యంత దూకుడుగా, అత్యధిక పెట్టుబడి పెట్టి కొత్త సినిమాలను ఈ సంస్థ కొంటోంది కానీ.. అవేవీ ఆశించిన ఫలితాన్నందుకోవట్లేదు.
లాక్ డౌన్ మొదలయ్యాక ఈ సంస్థ రెండంకెల సంఖ్యలో కొత్త చిత్రాలు విడుదల చేసింది. కానీ అందులో ఒక్కటి కూడా పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకోలేదు. దీంతో ప్రైమ్‌ను కేరాఫ్ డిజాస్టర్స్ అంటూ ఎద్దేవా చేసేవాళ్లు కొందరైతే.. అంతంత రేటు పెట్టి సినిమాలు కొని ఈ సంస్థ అన్యాయం అయిపోతోందే అని సానుభూతి వ్యక్తం చేసేవాళ్లు కొందరు.
థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి ఓటీటీల్లో కొత్త సినిమాలు రిలీజ్ చేయడం అన్న ఆలోచనే ఇంతకుముందు ఉండేది కాదు. విడుదల తర్వాత నెలా నెలన్నరకు కొత్త సినిమాలను ఓటీటీల్లో రిలీజ్ చేసేవాళ్లు. ఇండియాలో ఈ విషయంలో బాగా దూకుడు చూపించి పెద్ద ఎత్తున కొత్త సినిమాలను దక్కించుకుంది ప్రైమ్. ఈ క్రమంలోనే ఆ సంస్థకు భారీగా సబ్‌స్క్రైబర్లు సమకూరారు. వీళ్లను ఎంగేజ్ చేయడం కోసం కరోనా టైంలో కొత్త సినిమాలను మంచి రేటు పెట్టి కొని నేరుగా రిలీజ్ చేయడం మొదలుపెట్టింది ప్రైమ్.
ఈ క్రమంలోనే హిందీలో అమితాబ్ బచ్చన్-ఆయుష్మాన్ ఖురానాల ‘గులాబో సితాబో’తో పాటు ‘శకుంతలా దేవి’.. బహుభాషా చిత్రం ‘పెంగ్విన్’, తమిళ సినిమా ‘పొన్ మగల్ వందాల్’.. మలయాళ చిత్రం ‘సుజాతయుం సూఫియుం’ లాంటి సినిమాలను వరుసబెట్టి రిలీజ్ చేసింది ప్రైమ్.
కానీ అవేవీ కూడా ప్రేక్షకుల నుంచి పూర్తి ఆమోదం పొందలేకపోయాయి. ఉన్నంతలో ‘శకుంతలా దేవి’ కొంచెం బెటర్. మిగతావన్నీ తేలిపోయాయి. గత నెలలో తెలుగు నుంచి ‘వి’ లాంటి పెద్ద సినిమా ప్రైమ్‌లోకి వచ్చింది. దానికి పూర్తి నెగెటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. ఇప్పుడు మరో మోస్ట్ అవైటెడ్ మూవీ ‘నిశ్శబ్దం’ను మూడు భాషల్లో రిలీజ్ చేసింది ప్రైమ్. అన్ని చోట్లా ఫీడ్ బ్యాక్ ఏమీ బాగాలేదు. ఈ క్రమంలోనే అమేజాన్ వాళ్లు ఏరి కోరి డిజాస్టర్లను కొంటున్నారంటూ నెటిజన్లు కౌంటర్లు వేస్తున్నారు. అలాగే ఆ సంస్థ పట్ల సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.
This post was last modified on October 2, 2020 4:11 pm
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…
మలయాళంలో దృశ్యం 3 షూటింగ్ అయిపోయింది. మోహన్ లాల్ సహకారంతో దర్శకుడు జీతూ జోసెఫ్ చాలా వేగంగా పూర్తి చేసి…