ఇండియన్ సినీ సెలబ్రిటీల జీవితాలను, కెరీర్లను డాక్యుమెంటరీ రూపంలో తెరకెక్కించి క్యాష్ చేసుకునే పనిలో నెట్ ఫ్లిక్స్ బిజీగా ఉంది. ఆ మధ్య రాజమౌళిది విపరీతమైన అంచనాల మధ్య స్ట్రీమింగ్ జరుపుకున్న సంగతి తెలిసిందే. స్పందన బాగానే వచ్చింది కానీ ఆశించిన స్థాయిలో అద్భుతాలు చేయలేకపోయింది. ఇప్పుడు నయనతార వంతు వచ్చింది. బియాండ్ ది ఫెయిరీ టైల్ పేరుతో నవంబర్ 18న ఒక స్పెషల్ ఎపిసోడ్ ని విడుదల చేయనుంది. అభిమానులకే కాదు సగటు ప్రేక్షకులకూ దీని మీద విపరీతమైన ఆసక్తి కలిగే అవకాశాలు బోలెడున్నాయి. అదెలాగో చూద్దాం.
నయనతార ఇండస్ట్రీకి వచ్చి రెండు దశాబ్దాలు గడిచిపోయాయి. 2003లో మల్లువుడ్ ల్లో ఎంట్రీ జరిగాక తొలి బ్రేక్ చంద్రముఖి రూపంలో దక్కింది. గజిని నుంచి వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం పడలేదు. తెలుగులోనూ లక్ష్మి, దుబాయ్ శీను, తులసి లాంటి సూపర్ హిట్స్ ఎన్నో పడ్డాయి. మాములుగా ఇరవై సంవత్సరాల తర్వాత అంటే ఏ హీరోయిన్ అయినా క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిపోతుంది. కానీ నయన్ ఇప్పటికీ టాప్ డిమాండ్ లో ఉంది. గతంలో శింబు, ప్రభుదేవాతో ప్రేమ వ్యవహారాలకు సంబంధించి బోలెడు కథనాలు వచ్చాయి. వాటి గురించి ఈ ఫెయిరీ టైల్ లో ఏమైనా చెబుతారేమో చూడాలి.
కోట్ల పారితోషికం తీసుకున్నా తాను నటించే సినిమా ప్రమోషన్లకు అరిచి గీ పెట్టినా రాదని నయనతార మీద ఎప్పటి నుంచో కామెంట్స్ ఉన్నాయి. అవి నిజం కూడా. దానికి సరైన కారణమేంటో స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విగ్నేష్ శివన్ తో ప్రేమకథ, అటుపై పెళ్ళికి దారి తీసిన పరిణామాలు, సరోగసి పిల్లలు ఇలా పంచుకునే విషయాలు బోలెడు ఉంటాయి. మరి ఏ మేరకు నిజాలు ఉంటాయనేది ప్రస్తుతానికి సస్పెన్స్. గతంలో సన్నీ లియోన్ మీద ఏకంగా వెబ్ సిరీస్ వచ్చింది కానీ ఇప్పుడు నయనతారది కేవలం సింగల్ డాక్యుమెంటరీ మాత్రమే. ఏమేం చెబుతారో లెట్ వెయిట్ అండ్ సీ.
This post was last modified on October 30, 2024 12:31 pm
వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…
వైసీపీ అధినేత జగన్పై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనతో రాష్ట్రం పూర్తిగా విధ్వంసమైందని అన్నారు.…
అమరావతి రాజధానిపై వైసీపీ అధినేతగా జగన్ చేసిన తాజా వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై మరోసారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజధాని విషయంలో…
వైసీపీ అధినేత జగన్ హయాంలో ఓ కుటుంబం రోడ్డున పడింది. కేవలం మాస్క్ అడిగిన పాపానికి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించి…
కోనసీమ జిల్లా వాసులు ఎంతో పవిత్రంగా, ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకునే పండుగ జగ్గన్నతోట ప్రభల తీర్థం. ఇది తరతరాలుగా సంప్రదాయబద్ధంగా కొనసాగుతూ…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. వైసీపీ నేతలకు, కార్యకర్తలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పిఠాపురం నియోజకవర్గంలో పిచ్చి పిచ్చి…