వంద రోజులకు పైగా కారాగారంలో మగ్గుతున్న కన్నడ స్టార్ హీరో దర్శన్ కు ఎట్టకేలకు బెయిల్ దొరికింది. ఆరోగ్యపరమైన కారణాలు చూపిస్తూ సర్జరి అవసరమని లాయర్ అభ్యర్థించడంతో ఆరు వారాల ఇంటెరిమ్ బెయిల్ మంజూరు చేస్తూ న్యాయమూర్తి ఎస్ విశ్వజిత్ శెట్టి దర్శన్ కుటుంబానికి, అనుచరులకు రిలీఫ్ ఇచ్చారు. స్వంత అభిమాని రేణుక స్వామిని దారుణంగా చిత్ర హింసకు గురి చేసి హత్య చేసిన కేసులో ఈ హీరో మీద తీవ్ర నేరారోపణలు ఉన్నాయి. బలమైన సాక్ష్యాలు పోలీసులు సేకరించారు. నిందితుల్లో ఏ1గా ఉన్న దర్శన్ స్నేహితురాలు పవిత్ర గౌడ ప్రోత్సాహంతోనే ఇది జరిగిందని ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు.
ఇక్కడి దాకా బాగానే ఉంది కానీ దర్శన్ కు బెయిల్ రావడం ఆలస్యం నిమిషాల వ్యవధిలో ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హంగామా మొదలుపెట్టారు. బాజ్ ఈజ్ బ్యాక్ అంటూ అప్పుడే ట్రెండింగ్ చేస్తున్నారు. నిజానికి అతను నిర్దోషని రుజువు కాలేదు. కేవలం షరతులతో కూడిన బెయిలు వచ్చిందంతే. గడువు ముగిశాక మళ్ళీ జైలుకు వెళ్ళాలి. నేరం నిజమని తేలితే కఠినమైన శిక్ష పడుతుంది. ఇదంతా మర్చిపోయి ఏదో ఘనకార్యం చేసి వచ్చినట్టు అభిమానులు సెలెబ్రేట్ చేసుకోవడం గురించి ఆందోళన వ్యక్తమవుతోంది. చంపింది తమ సాటివాడినేనని గుర్తించలేని అమాయకత్వాన్ని ఏమనాలి.
ఇంకా దర్శన్ దోషిగా నిర్ధారణ కాకపోయినా జరిగిన దాంట్లో భాగం ఉంది కాబట్టి ఇప్పటికిప్పుడు స్వాతిముత్యం రేంజ్ లో ఫ్యాన్స్ బిల్డప్ ఇవ్వడం మారుతున్న సామజిక ధోరణికి అద్దం పడుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ట్విస్ట్ ఏంటంటే దర్శన్ జైల్లో ఉన్నప్పుడు కొన్ని పాత సినిమాలు రీ రిలీజ్ చేస్తే వాటిని మంచి వసూళ్లు వచ్చాయి. త్వరలో క్రాంతివీర సంగోళి రాయణ్ణ (2012) భారీ ఎత్తున పునఃవిడుదల చేయబోతున్నారు. కాకపోతే ఆగిపోయిన డెవిల్ షూటింగ్ ని కొనసాగించడానికీ మాత్రం దర్శన్ కు అనుమతి లేదు. కేవలం ఆపరేషన్ కారణం చూపించారు కాబట్టి అది మాత్రమే పూర్తి చేసుకోవాలి.
This post was last modified on October 30, 2024 12:27 pm
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…