Movie News

ప్రీమియర్ వార్ – కిరణ్ VS దుల్కర్

దీపావళి పండగ ముందు రోజు బాక్సాఫీస్ వద్ద ప్రీమియర్ వార్ జరగనుంది. విడుదల తేదీ రేపే అయినప్పటికీ ముందు రోజు సాయంత్రం నుంచే రెండు సినిమాలు పోటాపోటీ ప్రీమియర్లకు సిద్ధపడటం ఇటు మీడియా అటు ప్రేక్షకుల్లోనూ ఆసక్తిని పెంచుతోంది. దుల్కర్ సల్మాన్ తన మార్కెట్ తెలుగులో విస్తరించుకునే ఉద్దేశంతో చాలా సమయం వెచ్చింది లక్కీ భాస్కర్ చేశాడు. ధనుష్ తో హిట్ కొట్టాక దర్శకుడు వెంకీ అట్లూరి సైతం ఎక్కువ సమయం వెచ్చించి పూర్తి చేశాడు. ఈ కాంబో మీద నమ్మకంతోనే సితార సంస్థ నాగవంశీ అనుకున్న దానికన్నా ఎక్కువ బడ్జెటే ఖర్చు పెట్టినట్టు ట్రైలర్ లో కనిపించింది.

రిట్రో సెటప్, మీనాక్షి చౌదరి, జివి ప్రకాష్ కుమార్ సంగీతం లాంటి అట్రాక్షన్లు బోలెడున్నాయి. సాయంత్రం 7 నుంచే షోలు మొదలు కాబోతున్నాయి. ఇక ‘క’ది ఇంచుమించు ఇదే పరిస్థితి. కిరణ్ అబ్బవరం మీద ఏకంగా పదిహేను కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీశారు. అంత బిజినెస్ జరిగినా జరగకపోయినా హక్కుల ద్వారానే మొత్తం రికవర్ అవుతుందనే నమ్మకం మేకర్స్ లో ఉంది. ప్రమోషన్లు, నాగ చైతన్య అతిధిగా ఈవెంట్, ట్రైలర్ ఇవన్నీ హైప్ తీసుకొచ్చేందుకు దోహదపడ్డాయి. అయితే మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్స్ మరీ జోరుగా లేవు. టాక్ కోసం ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు కాబట్టి ఇవాళ షోలు కీలకం.

క, లక్కీ భాస్కర్ రెండు సినిమాలకు ఒక సారూప్యత ఉంది. ఇవి వర్తమానంలో జరిగే కథలు కాదు. పీరియాడిక్ డ్రామాలు. ఇద్దరు దర్శకులు ఎనభై, తొంభై దశకాన్ని తీసుకున్నారు. సో వీటి కాన్సెప్ట్ కనెక్ట్ కావడం చాలా ముఖ్యం. మ్యూజిక్ పరంగా స్పందన కూడా ఒకేలా రావడం గమనార్హం. మంచి పాటలనే ఫీడ్ బ్యాక్ వచ్చింది కానీ ఛార్ట్ బస్టర్స్ కాలేదు. రేపు వీటితో పాటు డబ్బింగ్ సినిమాలు అమరన్, బఘీరాలు ఉన్నప్పటికీ జనం దృష్టిలో ప్రాధాన్యత పరంగా ముందు వరసలో ఉన్నది కిరణ్, దుల్కర్ లే. మరి ఈ ప్రీమియర్ల వార్ లో ఇద్దరూ సంయుక్త విజేతలుగా నిలవాలని ట్రేడ్ కోరుకుంటోంది. చూడాలి ఏం జరుగుతుందో .

This post was last modified on October 30, 2024 11:23 am

Share

Recent Posts

దాయ్‌రాగా మారిన దిశా… బాగా లేటయ్యింది

ఎనిమిదేళ్ల క్రితం 2019లో తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన సంఘటన దిశాపై జరిగిన అఘాయిత్యం. ఒక వైద్య విదార్థినిని నలుగురు కరుడు…

4 hours ago

షర్మిల కూతురి పెళ్ళికి జగన్ డుమ్మా ?

వైయస్ కుటుంబంలో ఆస్తి తగాదాలు ఇంకా సమసిపోయినట్లు కనిపించడం లేదు. అన్నా చెల్లెళ్ళ మధ్య దూరం తరిగిన సూచనలు కానరావడం…

4 hours ago

ప్యారడైజ్ పోటీ నుండి తప్పుకున్న కీర్తి సురేష్

ప్యారడైజ్ మీద ఉన్న క్రేజ్ దృష్ట్యా దానికి పోటీగా నిలబడేందుకు పెద్ద సినిమాలు సాహసం చేయడం లేదు. అనుమాన పక్షి…

5 hours ago

టార్గెట్ గ‌జ్వేల్‌.. కాంగ్రెస్ వ్యూహం ఇదీ!

గ‌జ్వేల్ నియోజ‌క‌వ‌ర్గం.. తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ కంచుకోట‌. అయితే.. ఇక్క‌డే పాగా వేయాల‌ని.. వ‌చ్చే…

5 hours ago

మొహమాట పడితే ఎలాగయ్యా సట్టపులి

తమిళంలో డెబ్యూతోనే సూపర్ హిట్ అందుకున్న సుహాస్ గురించి చెన్నై మండాడి సక్సెస్ మీట్ లో దర్శకుడు చేసిన కామెంట్స్…

6 hours ago

సిగ్మా సౌండ్ సరిపోతుందంటారా

అక్టోబర్ 2 ఆదర్శ కుటుంబం ఏకె 47 వస్తుందో లేదో ఖచ్చితంగా చెప్పలేం కానీ సందీప్ కిషన్ సిగ్మా రిలీజవుతోంది.…

12 hours ago