Movie News

మూడు పరీక్షలు గెలవాల్సిన ‘క’

ఎల్లుండి విడుదల కాబోతున్న ‘క’ ఫలితం గురించి కిరణ్ అబ్బవరం టీమ్ చాలా ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తోంది. రిస్క్ అని తెలిసినా రేపు సాయంత్రమే ప్రీమియర్లకు సిద్ధపడటం కాన్ఫిడెన్స్ ని చూపిస్తోంది. క్లైమాక్స్ నచ్చకపోతే ఏకంగా సినిమాలే మానేస్తానని హీరో చెప్పడం ఈ మధ్య కాలంలో జరగలేదు. అందులోనూ సాఫ్ట్ గా బ్యాలన్స్ గా మాట్లాడే కిరణ్ ఒక్కసారిగా ఈ స్టేట్ మెంట్ ఇవ్వడంతో అంచనాలు పెరిగాయి. ఇక నెగ్గాల్సిన మూడు పరీక్షలేంటో చూద్దాం. మొదటిది బ్రేక్ ఈవెన్. సుమారు 12 కోట్లకు థియేట్రికల్ బిజినెస్ జరిగిందని ట్రేడ్ టాక్. ఇంత మొత్తం షేర్ రావాలంటే బ్లాక్ బస్టర్ టాక్ వస్తేనే సాధ్యమవుతుంది.

రెండో పరీక్ష నాన్ థియేట్రికల్ డీల్. ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఓటిటి అమ్మకం ఇంకా జరగలేదు. నిర్మాతలు ఆశిస్తున్న మొత్తానికి ప్రైమ్ లాంటి పెద్ద కంపెనీలు చెబుతున్న అమౌంట్ కి వ్యత్యాసం ఉండటం వల్ల రిలీజయ్యాక మాట్లాడుకుందామని పెండింగ్ పెట్టారట. హిట్ అయితే ఎవరైనా తీసుకుంటారనే నమ్మకంతోనే ఇలా నిర్ణయించుకున్నారని వినికిడి. ఇక మూడో పరీక్ష పోటీ. లక్కీ భాస్కర్ ని సితార సంస్థ భారీ ఎత్తున రిలీజ్ చేస్తోంది. అమరన్ కు సురేష్ – ఏషియన్ అండదండలున్నాయి. బఘీరాకు ప్రశాంత్ నీల్ బ్రాండింగ్ వాడుతున్నారు. మల్టీప్లెక్సుల్లో సింగం అగైన్, భూల్ భూలయ్యా 3లు కవ్విస్తున్నాయి.

వీటిని తట్టుకుని ‘క’ కనక విజయం సాధిస్తే కిరణ్ అబ్బవరం మళ్ళీ ట్రాక్ లోకి వచ్చేస్తాడు. నేను మీకు బాగా కావలసినవాడిని, మీటర్, రూల్స్ రంజన్ పరాజయాలు మార్కెట్ ని బాగా ప్రభావితం చేశాయి. వినరో భాగ్యము విష్ణు కథ ఒక్కటే పర్వాలేదనిపించింది తప్ప మరీ సూపర్ డూపర్ హిట్ అనిపించుకోలేదు. అందుకే ‘క’ని కసి మీద చేశాడు. బ్రేక్ ఈవెన్ లక్ష్యం మరీ పెద్దది కాదు కాబట్టి పాజిటివ్ టాక్ వస్తే దాన్ని అందుకోవడం కష్టం కాదు. అందులోనూ సుదీర్ఘమైన వీకెండ్ బాగా కలిసి వస్తుంది. సుజీత్ – సందీప్ జంట దర్శకత్వం వహించిన ‘క’కు సామ్ సిఎస్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సెకండాఫ్ ట్విస్టులు హైలైటట.

This post was last modified on October 29, 2024 5:26 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రష్యా అధ్యక్షుడికి గోంగూర, ఆవకాయ తినిపించిన మోదీ

వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…

21 minutes ago

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

1 hour ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

2 hours ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

3 hours ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

5 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

8 hours ago