బాలీవుడ్లో పెద్ద ఫ్యామిలీకి కోడలిగా వెళ్లిన మలైకా అరోరా.. తర్వాత వైవాహిక బంధానికి తెర దించి ఓ కుర్ర హీరోతో సహజీవనం చేయడం ఎంత సంచలనం రేపిందో తెలిసిందే. సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్‌ను పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు తల్లి అయిన మలైకా.. ఆ పిల్లలు యుక్త వయసుకు వస్తున్న దశలో అర్బాజ్ నుంచి విడిపోయి, అర్జున్ కపూర్‌తో రిలేషన్‌షిప్‌లోకి వెళ్లింది.
అర్జున్ కంటే 12 ఏళ్లు పెద్దదైన మలైకా.. అతడితో సహజీవనం చేయడం ఏంటో ఎవ్వరికీ అర్థం కాలేదు. వీళ్లిద్దరి బంధం మీద చాలా విమర్శలు వచ్చినా ఆ జంట పట్టించుకోలేదు. ఇద్దరూ కలిసి ఓ ఇల్లు కొనుక్కుని అందులో కలిసి ఉన్నారు. మొదట్లో తమ బంధాన్ని దాచడానికి ప్రయత్నించిన ఈ జంట.. తర్వాత ఓపెన్ అయిపోయింది. చెట్టాపట్టాలేసుకుని తిరిగింది. కొన్నేళ్ల రిలేషన్‌షిప్ తర్వాత వీళ్లిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి.
కానీ మధ్యలో ఏమైందో ఏమో.. ఇద్దరి మధ్య దూరం పెరిగింది. వీళ్లిద్దరూ విడిపోతున్నట్లు, విడిపోయినట్లు వార్తలు వచ్చాయి. ఈ మధ్య అయితే ఇద్దరూ కలిసి కనిపించడం లేదు. మరి అర్జున్, మలైకా నిజంగా విడిపోయారా లేదా అనే విషయంలో స్పష్టత లేకపోయింది. ఇప్పుడు అర్జున్ దీనిపై క్లారిటీ ఇచ్చేశాడు. మలైకా నుంచి విడిపోయినట్లు చెప్పకనే చెప్పేశాడు. తాజాగా ఓ కార్యక్రమం సందర్భంగా ఓ మీడియా ప్రతినిధి.. మీరు రిలేషన్‌షిప్‌లో ఉన్నారా అని అడగ్గా.. “లేదు. నేను సింగిల్‌గా ఉన్నా. అంతే కాదు చాలా సంతోషంగా కూడా ఉన్నా” అని అర్జున్ బదులిచ్చాడు.
దీంతో మలైకా నుంచి అర్జున్ విడిపోయాడని.. కొత్తగా మరే బంధంలోకి కూడా వెళ్లలేదని కన్ఫమ్ అయింది. ఇదిలా ఉండగా అర్జున్ కెరీర్ ఈ మధ్య ఏమంత బాగా లేదు. హీరోగా వరుసగా డిజాస్టర్లు ఎదుర్కొంటున్నాడు. ఇప్పుడతను విలన్ పాత్ర పోషించిన ‘సింగమ్ అగైన్’ దీపావళి కానుకగా నవంబరు 1న రిలీజవుతుంది.
This post was last modified on October 29, 2024 3:59 pm
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…