Movie News

బాలయ్య 111 కాంబినేషన్ సిద్ధం ?

బాలకృష్ణకు భగవంత్ కేసరి లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు అనిల్ రావిపూడి మరోసారి బాలయ్యతో జట్టు కట్టబోతున్నట్టు లేటెస్ట్ అప్డేట్. ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు కానీ ప్రాథమికంగా కథకు సంబంధించిన అంగీకారం గతంలోనే జరిగిపోయిందట. అయితే వెంకటేష్ 76లో బిజీగా ఉన్న రావిపూడి డిసెంబర్ చివరివారంలోగా ఫ్రీ అవుతాడు. ప్రమోషన్ల కోసం ఇంకో నెల రోజులు అనుకున్నా ఫిబ్రవరి నుంచి స్క్రిప్ట్ పనుల మీద ఉండొచ్చు. ప్రస్తుతం బాబీ డైరెక్షన్లో తన 109వ సినిమా చేస్తున్న బాలయ్య 110గా బోయపాటి శీనుతో అఖండ 2 తాండవం మొదలుపెట్టిన సంగతి తెలిసిందే.

నిజానికి అనిల్ రావిపూడి చిరంజీవితో సినిమా కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాడు కానీ కథ విషయంలో ఊగిసలాట వల్ల పెండింగ్ పడుతూ వస్తోందట. షైన్ స్క్రీన్స్ ఈ కాంబోని సెట్ చేయడానికి ట్రై చేస్తోంది కానీ పనవ్వడం లేదని ఫిలిం నగర్ టాక్. ఓకే అయితే తప్ప అధికారికంగా ఏదీ చెప్పలేరు కాబట్టి ప్రస్తుతానికి గాసిప్ గానే చూడాలి. భగవంత్ కేసరిలో వయసుకు తగ్గ మాస్ పాత్రను డిజైన్ చేసి ప్రశంసలు దక్కించుకున్న అనిల్ రావిపూడి దానికి అవార్డులు కూడా సాధించాడు. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ రాజకీయ ప్రవేశానికి ముందు చేస్తున్న చివరి సినిమా కూడా దీని రీమేకేననే ప్రచారం ఉంది.

గ్యాప్ లేకుండా వరసగా సినిమాలు చేసుకుంటున్న బాలకృష్ణ వచ్చే ఏడాది ఎన్బికె 109తో పాటు ఏడాది చివర్లో అఖండ 2 రిలీజ్ ఉండేలా చూసుకుంటున్నారు. ఒకవేళ బోయపాటి కనక ఏమైనా ఆలస్యం చేస్తే 2026 సంక్రాంతి బరిలో ఉండొచ్చు. ప్రస్తుతం అన్ స్టాపబుల్ సీజన్ 4 షూటింగ్ తో పాటు బాబీ సినిమా చివరి దశ చిత్రీకరణలో బిజీగా ఉన్న బాలయ్య ఇవి కాకుండా ఇంకెవరికి కమిట్ మెంట్స్ ఇవ్వలేదు. కొన్ని కథలు చర్చల దశలో ఉన్నాయి. మోక్షజ్ఞ తెరంగేట్రం చేయబోతున్న చిత్రం డిసెంబర్ నుంచి రెగ్యులర్ సెట్స్ మీదకు వెళ్లబోతోందని సమాచారం. ఇందులో బాలకృష్ణ క్యామియో ఉండొచ్చని టాక్.

This post was last modified on October 29, 2024 3:20 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రష్యా vs ఉక్రెయిన్ – ఇండియా ఎవరివైపో చెప్పిన మోడీ

ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…

19 minutes ago

హై కోర్టుకు సారీ చెప్పిన హైడ్రా, ఏం జరిగింది?

`సారీ మైలార్డ్‌.. ఇక‌పై అలాంటి త‌ప్పులు జ‌ర‌గ‌వు`` - అని తెలంగాణ హైకోర్టుకు హైడ్రా క‌మిష‌న‌ర్‌, ఐపీఎస్ అధికారి రంగ‌నాథ్…

1 hour ago

నా పేరెంట్స్ మీటింగ్ కోసం మా నాన్న ఎప్పుడూ రాలేదు – లోకేష్

పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ…

2 hours ago

అఖండ అనుభవం.. అలెర్ట్ అవ్వాలి

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా.. అఖండ-2. అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈపాటికి ఈ…

2 hours ago

ఐదుగురికి కమిట్మెంట్ అడిగారు.. నో చెప్పా

సినీ రంగంలో మహిళలకు లైంగిక వేధింపులు ఎదురవడం గురించి దశాబ్దాలుగా ఎన్నో అనుభవాలు వింటూనే ఉన్నాం. ఐతే ఒకప్పటితో పోలిస్తే…

2 hours ago

నందమూరి ఫ్యాన్స్ బాధ వర్ణనాతీతం

‘నరసింహనాయుడు’ తర్వాత చాలా ఏళ్ల పాటు పెద్ద స్లంప్ చూశాడు నందమూరి బాలకృష్ణ. కానీ ‘సింహా’తో తిరిగి హిట్ ట్రాక్…

3 hours ago