చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో ‘చెక్’ సినిమా షూటింగ్ నితిన్ ఏనాడో మొదలు పెట్టాడు కానీ దానిపై ఎందుకో అంత ఆసక్తి చూపించలేదు. ‘భీష్మ’ తర్వాత ‘రంగ్ దే’పైనే నితిన్ ఫోకస్ పెట్టాడు. ఆ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత ‘అంధాధూన్’ రీమేక్ పనులకు నితిన్ సమాయత్తమవుతున్నాడు. ఇంతలో మీడియా ఏలేటి సినిమాను గుర్తు చేసి నితిన్ ఆ సినిమాను అటకెక్కించేసినట్టున్నాడంటూ కథనాలు రాసింది. దాంతో ఆ సినిమా నిర్మాతలు నితిన్‍పై ఒత్తిడి తెచ్చారు.
తమ సినిమాను పక్కనపెట్టి వేరేది చేస్తే కనుక దీనిని మీడియా పూర్తిగా ‘రైట్ ఆఫ్’ చేసేస్తుందని, తర్వాత ఈ సినిమా న్యూస్‍లోకి వచ్చినా కానీ అవుట్ డేటెడ్ అనిపిస్తుందని మీడియా రిపోర్టులు చూపించి నితిన్‍ని కార్నర్ చేసారు. దీంతో సదరు సినిమా టైటిల్ సడన్‍గా అనౌన్స్ చేసారు.
చెక్ అనే టైటిల్ చాలా కాలంగా మీడియాలో నానుతున్నా కానీ దానినిప్పుడు ఖరారు చేసారు. ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చిందని చెబుతున్నారు కానీ బ్యాలెన్స్ వర్క్ చాలానే వుందట. నితిన్ ఈ సినిమా పూర్తి చేసి కానీ అంధాదూన్ రీమేక్ మొదలు పెట్టే వీల్లేకుండా టైటిల్ అనౌన్స్మెంట్‍తో అతడిని లాక్ చేసి అలాగే ఈ సినిమా ఆగిపోయిందనే రూమర్లకు కూడా చెక్ పెట్టేసారు.
This post was last modified on October 2, 2020 4:31 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…