Movie News

థియేటర్లలో ఫ్లాప్.. ఓటీటీలో వెర్రెత్తిపోతున్నారు

కొన్ని సినిమాలు థియేటర్లలో పెద్దగా ఆడవు. కానీ ఓటీటీలో రిలీజయ్యాక ఇలాంటి సినిమా ఎందుకు ఫెయిలైందని డిజిటల్ ఆడియన్స్ ఆశ్చర్యపోతుంటారు. ఆ సినిమాలకు సోషల్ మీడియాలో ఒక రేంజిలో ఎలివేషన్లు వస్తుంటాయి. ఈ కోవలో ‘అంటే సుందరానికి..’ సహా చాలా చిత్రాలను చెప్పుకోవచ్చు. ఈ జాబితాలోకి చేరుకున్న కొత్త చిత్రం.. స్వాగ్.

శ్రీ విష్ణు హీరోగా ‘రాజ రాజ చోర’ దర్శకుడు హాసిత్ గోలి రూపొందించిన చిత్రమిది. పీపుల్స్ మీడియా సంస్థ దీన్ని నిర్మించింది. ఈ నెల 5న ‘స్వాగ్’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఈ చిత్రానికి రివ్యూలు చాలా వరకు నెగెటివ్‌గానే వచ్చాయి. ప్రేక్షకాదరణ కూడా అందుకు తగ్గట్లే వచ్చింది. సరైన వసూళ్లు లేక థియేటర్లలో ఈ సినిమా ఫ్లాప్‌గా మిగిలింది. ఐతే ఈ చిత్రాన్ని రిలీజైన మూడు వారాలకే ఓటీటీలోకి తెచ్చేశారు. అమేజాన్ ప్రైమ్ ద్వారా ఈ చిత్రం స్ట్రీమ్ అవుతోంది.

ఐతే ‘స్వాగ్’ సినిమా డిజిటల్‌గా రిలీజ్ కావడం ఆలస్యం.. దాని మీద నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇందులోని అనేక సన్నివేశాలకు సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సమకాలీన రాజకీయ, సామాజిక పరిస్థితులను ఉద్దేశించి ఇందులో వేసిన కౌంటర్ల మీద ఎక్కువ చర్చ జరుగుతోంది. ట్రెండీగా సాగిన అనేక సన్నివేశాలు, డైలాగుల గురించి నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

ఏపీలో ప్రభుత్వం మారిన నేపథ్యంలో వైసీపీ మీద అనేక కౌంటర్లు పడ్డాయి. హైదరాబాద్‌లో చర్చనీయాంశంగా మారిన హైడ్రా మీద కూడా కొన్ని డైలాగులు పెట్టడం విశేషం. ఇందులో శ్రీ విష్ణు పోషించిన అనేక పాత్రలు.. ముఖ్యంగా ట్రాన్స్‌జెండర్ పాత్ర గురించి అందరూ గొప్పగా మాట్లాడుతున్నారు. ద్వితీయార్ధంలో ఎమోషనల్ సీన్లకు ప్రశంసలు లభిస్తున్నాయి. శ్రీ విష్ణు ‘స్వాగ్’ గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టాడు. థియేటర్లలో మిస్ అయిన వాళ్లు ఓటీటీలో చూసి కల్ట్ మూవీ అంటూ కొనియాడండి అంటూ ఇప్పటి ట్రెండుకు తగ్గట్లు కామెంట్ చేశాడు శ్రీ విష్ణు. ఎప్పట్లాగే ‘టీఎఫ్ఐ ఫెయిల్డ్ హియర్’ అనే హ్యాష్ ట్యాగ్ కూడా ‘స్వాగ్’కు మూవీకి పెడుతున్నారు నెటిజన్లు.

This post was last modified on October 28, 2024 8:45 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

లేడీ డాన్లకు వార్నింగ్ ఇచ్చిన సీఎం

ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…

48 minutes ago

మాయమైన నందమూరి హీరో రీ ఎంట్రీ

ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…

1 hour ago

దృశ్యం పాయింటుతో సిరీస్ తీశారు

శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…

2 hours ago

శివన్న డెడికేషనే వేరు

తెలంగాణ‌కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…

3 hours ago

పర్ఫెక్షన్లో రాక్షసుడు జక్కన్న

బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…

3 hours ago

కర్ణాటకలో తెలుగు కనపడకూడదా?

కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…

6 hours ago