టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కెరీర్లలో అతి పెద్ద డిజాస్టర్లలో ‘ఖలేజా’ ఒకటి. కానీ ఆయన అభిమానులకు అత్యంత నచ్చిన చిత్రాల్లో అదొకటి. థియేటర్లలో సరిగా ఆడలేకపోయిన ఈ చిత్రం టీవీల్లో, ఆన్ లైన్లో కల్ట్ స్టేటస్ తెచ్చుకుంది. ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టని కామెడీతో ఆ చిత్రం ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. ఈ సినిమా అంటే పడిచచ్చే అభిమానుల్లో తాను కూడా ఒకడిని అంటున్నాడు యంగ్ హీరో విజయ్ దేవరకొండ.
త్రివిక్రమ్ కూడా పాల్గొన్న ‘లక్కీ భాస్కర్’ ప్రి రిలీజ్ ఈవెంట్లో త్రివిక్రమ్ మీద తన అభిమానాన్ని చాటుకున్నాడు విజయ్. ‘పెళ్ళిచూపులు’ సినిమాకు గాను తన తొలి పారితోషకం తాలూకు చెక్‌ను సితార ఎంటర్టైన్మెంట్స్ ఆఫీసులో త్రివిక్రమ్ చేతుల మీదుగానే అందుకున్నట్లు విజయ్ గుర్తు చేసుకున్నాడు.
తన తరం కుర్రాళ్లందరికీ త్రివిక్రమ్ ఫేవరెట్ డైరెక్టర్ అని.. జల్సా, అతడు, ఖలేజా ఇలా ఆయన సినిమాలను ఎంతో ఇష్టపడ్డామని.. తానైతే ‘ఖలేజా’ సినిమా బాలేదని ఎవరైనా అంటే గొడవ పడేవాడినని విజయ్ గుర్తు చేసుకున్నాడు. ఖలేజాతో పాటు అతడు తనకు మోస్ట్ ఫేవరెట్ అని విజయ్ చెప్పాడు. త్రివిక్రమ్ నుంచి తొలి చెక్ అందుకున్నపుడు ఆయనతో మాట్లాడ్డం గొప్ప అనుభూతిని ఇచ్చిందని.. ఆ తర్వాత పలు సందర్భాల్లో ఆయనతో మాట్లాడానని.. సినిమాల గురించి కాసేపే తమ చర్చ ఉండేదని.. వ్యక్తిగత విషయాలు, బంధాల గురించి మాట్లాడేవాళ్లమని.. ఇంకా రామాయణం, మహా భారతం గురించి ఆయన ఎన్నో విషయాలు చెప్పేవారని విజయ్ తెలిపాడు.
ఇక దుల్కర్ సల్మాన్ గురించి విజయ్ మాట్లాడుతూ.. తాను సినిమాల్లోకి రాకముందు టొరెంట్స్ ద్వారా డౌన్లోడ్ చేసి తన సినిమాలను చూసేవాడనని చెప్పాడు. అతణ్ని ఒక సోదరుడిలా భావిస్తానని.. ఒక దర్శకుడు తమ ఇద్దరి కాంబినేషన్లో మల్టీస్టారర్ తీయడం కోసం కలిసే ఏర్పాటు చేశాడని.. చెన్నైలో కలిశామని.. అప్పుడే తామిద్దరం క్లోజ్ అయ్యామని చెప్పాడు.
This post was last modified on October 28, 2024 10:18 am
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…