ఎన్ని రకాల కామెంట్స్ వచ్చినా కూడా మెగా కాంపౌండ్ లో బాండింగ్స్ అనేవి చాలా స్ట్రాంగ్ గా ఉంటాయని చెప్పవచ్చు. ఇక రేణుదేశాయ్ కోసం ఇప్పుడు ఉపాసన తీసుకున్న నిర్ణయం హాట్ టాపిక్ గా మారింది.
మూగ జీవాల సంరక్షణకు కృషి చేస్తూ రేణుదేశాయ్ స్థాపించిన శ్రీ ఆద్య యానిమల్ షెల్టర్‌కి సినీ నటుడు రామ్‌చరణ్ భార్య ఉపాసన తన మద్దతు అందించారు. రేణుదేశాయ్ ఈ విషయాన్ని తన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.
మూగ జీవాల సహాయార్థం ఓ అంబులెన్స్‌ను కొనుగోలు చేసినట్లు రేణు వివరించారు. ఈ ప్రయత్నంలో ఉపాసన తన వంతు విరాళాన్ని అందించారని, రామ్‌చరణ్ పెంపుడు కుక్క రైమీ పేరుతో ఆ సాయం అందిందని రేణు తెలిపారు. “రైమీ, మీ మద్దతుకు ధన్యవాదాలు” అని రేణు పేర్కొంటూ ఉపాసనను ట్యాగ్ చేశారు. తన స్వచ్ఛంద సంస్థ కార్యకలాపాలకు విరాళాలు అందించాలని రేణుదేశాయ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో విజ్ఞప్తి చేశారు.
ఎవరైనా ప్రతి నెల కనీసం రూ.100 విరాళం ఇస్తే, అది మూగ జీవాల సంరక్షణకు ఉపయోగపడుతుందని ఆమె చెప్పారు. ఇది పూర్తిగా స్వచ్ఛంద సేవకు సంబంధించినదని, తన వ్యక్తిగత అవసరాల కోసం కాదని స్పష్టం చేశారు.
మూగ జీవాల కోసం చిన్నప్పటి నుంచి తనలో సంతోషంగా ఉన్న కోరికను రేణుదేశాయ్ ఇప్పుడు శ్రీ ఆద్య యానిమల్ షెల్టర్ ద్వారా సాకారం చేసుకుంటున్నారు. విరాళాలు అందిస్తే మరిన్ని సేవలు చేయడం వీలవుతుందని, అందరి సహకారం తోడ్పాటుతోనే ఈ ప్రయత్నం విజయవంతమవుతుందని రేణు అభిప్రాయపడ్డారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates