అందరి నోటా ఒకటే మాట సినిమా చాలా బాగుంది. కొత్త నేపథ్యం. ఆసక్తి గొలిపే కథాంశం. ఒక పెళ్లి చేయబోయే తండ్రి, పెళ్లి కాబోయే అమ్మాయి, సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఒక ఎన్నారై, ఒక వ్యవసాయదారుడు, ఇలా ఇంటిల్లిపాది చూడవలసిన చిత్రమని ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయి. చూసిన ప్రతి ఒక్కరు లాస్ట్ 40నిమిషాలు కంటిన్యూగా ఏడుస్తూనే ఉన్నాం. క్లైమాక్స్ అదిరిపోయింది.
ఫీల్ గుడ్ మూవీ అంటూ కాల్స్, మెసేజ్లు చేస్తున్నారు. ఈ రోజుల్లో ప్రేక్షకులు సినిమా బాగుంది అనడం చాలా పెద్ద విషయం. అలాంటిది అన్ని చోట్ల నుంచి మంచి టాక్ రావడం ఆనందంగా ఉంది. ఒక మంచి సినిమా తీశాను. దాన్ని ప్రజల ముందు ఉంచాను. ఇక జయాపజయాలు దైవ దినం అని నమ్ముతాను. ఇది నా కెరియర్ బెస్ట్ ఫిలిం.
ఈ సినిమా నిర్మించిన నిర్మాత సుబిషి ఎంటర్టైన్మెంట్స్ వేణుగోపాల్ రెడ్డి గారికి నా కృతజ్ఞతలు. సినిమా నిర్మాణంలో నిర్మాత ప్రోత్సాహం మర్చిపోలేనిది. వేణుగోపాల్ రెడ్డి గారు విలువలు ఉన్న మనిషి. ఈరోజు ఇంత మంచి టాక్ రావడం వెనుక నాతో పాటు కలిసి నడిచిన నా టీం అందరికీ కృతజ్ఞతలు.
ప్రేక్షకులకు నా విజ్ఞప్తి సినిమా మీ అభిమాన థియేటర్లో నడుస్తోంది మీరు మీ కుటుంబంతో వెళ్లి చూడండి. ఒక చక్కని అనుభూతికిలోనవుతారు. పదిమందికి చెప్తారు.
“లగ్గం” ఇది కేవలం చిత్రం అయితే కాదు!!!
ఎన్నో సంఘర్షణల నిర్ణయం ఒక లగ్గం జరపడం. ప్రతి కంటతడి వెనక ఓ కారణం, ఓ కథ ఉంటుంది.ఈ లగ్గం ప్రతి నాన్న తాలూకు బాధ్యత!! ఈ లగ్గం ప్రతి కూతురి ప్రేమ లగ్గం.
మర్చిపోని, చెరగని ముద్రగా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయే చిత్రం లగ్గం.
ఇండస్ట్రీ ప్రముఖులు ఫోన్ చేసి “సినిమా అంటే ఇది అనేలా ఉంది ఈ సినిమా, మనల్ని మనకే కొత్తగా పరిచయం చేసింది ఈ సినిమా…” అంటూ ఒకరు
“నన్ను మా ఊరు తీసుకెళ్ళింది, చిన్ననాటి స్మృతులని గుర్తు చేయించింది, ఫ్యామిలీ బంధాలలోని తియ్యదనం రుచి చూపించింది, బాధల్ని మరిపించింది, బాధ్యతల్ని గుర్తుచేస్తుంది, మొత్తంగా మనం మనుషులం అని గుర్తు చేస్తుంది ఈ సినిమా…” అన్నారు ప్రముఖ నిర్మాత.
కొందరు “మనం సినిమా చేద్దాం” అని అడగడం కూడా ఆనందం వేసింది. నేను ప్రాణం పెట్టి చేసిన లగ్గం సినిమాకు ఇంత అప్లాజ్ రావడం. అది మీతో పంచుకోవడం సంతోషంగా ఉంది. అందరికీ పేరుపేరునా నా కృతజ్ఞతలు.
ఈ చిత్రానికి కథ – మాటలు – స్క్రీన్ ప్లే- దర్శకత్వం రమేశ్ చెప్పాల, నిర్మాత: వేణుగోపాల్ రెడ్డి, నేపధ్య సంగీతం: మణిశర్మ, కెమెరామెన్: బాల్ రెడ్డి. ఎడిటర్: బొంతల నాగేశ్వర రెడ్డి.