వసూళ్ల పరంగానే కాక రలీజ్ విషయంలోనూ ‘బాహుబలి: ది కంక్లూజన్’ అనేక రికార్డులను బద్దలు కొట్టింది. అప్పటిదాకా ఏ సినిమా రిలీజ్ కానన్ని థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేశారు. ఏకంగా పది వేల థియేటర్లకు పైగానే ఆ చిత్రాన్ని ప్రదర్శించాయి. ‘బాహుబలి’ తర్వాత మరే ఇండియన్ మూవీ కూడా అన్ని థియేటర్లలో రిలీజ్ కాలేదు.
‘ఆర్ఆర్ఆర్’ సైతం ఆ రికార్డును కొట్టలేకపోయింది. ఐతే ఇప్పుడు ‘పుష్ప-2’.. బాహుబలి-2 రికార్డును కొట్టబోతున్నట్లు సమాచారం. ‘బాహుబలి’ లాంటి ఈవెంట్ ఫిలిం కాకపోయినా దీనికి పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ వచ్చింది. సీక్వెల్ కోసం దేశవ్యాప్తంగా ప్రేక్షకులు అమితాసక్తితో ఎదురు చూస్తున్నారు. ఈ క్రేజ్‌ను ఉపయోగించుకుని భారీ ఓపెనింగ్స్ రాబట్టే దిశగా ‘పుష్ప-2’ను భారీగా రిలీజ్ చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
‘పుష్ప-2’ వరల్డ్ వైడ్ ఏకంగా 11,500 స్క్రీన్లలో రిలీజ్ కాబోతోందట. అందుటో ఇండియా వరకే 6500 స్క్రీన్లలో విడుదలవుతుంది. విదేశాల్లో 5 వేల స్క్రీన్లలో సినిమా ప్రదర్శితం కానుంది. ఇప్పటిదాకా ఏ ఇండియన్ మూవీ కూడా ఈ స్థాయిలో రిలీజ్ కాలేదు. ‘పుష్ప: ది రైజ్’ రిలీజ్‌కు ముందు దాని మీద పాన్ ఇండియా స్థాయిలో పెద్దగా అంచనాల్లేవు.
తెలుగు వరకు మాత్రమే హైప్ ఉంది. కానీ రిలీజ్ తర్వాత నార్త్ ఇండియన్స్ ఈ సినిమా చూసి ఊగిపోయారు. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో కూడా సినిమా బాగా ఆడింది. దీంతో సీక్వెల్ మీద పాన్ ఇండియా స్థాయిలో భారీగా అంచనాలు పెరిగిపోయాయి.
తెలుగు సినిమాలను పెద్దగా పట్టించుకోని పశ్చిమ బెంగాల్ లాంటి ప్రాంతాల్లో కూడా ‘పుష్ప-2’కు మామూలు హైప్ లేదు. ఈ నేపథ్యంలోనే సినిమాను కనీ వినీ ఎరుగని స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు. డిసెంబరు 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
This post was last modified on October 27, 2024 4:05 pm
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…
ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…
ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…
దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…
దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…