తమిళంలో టాప్ స్టార్లలో ఒకడు సూర్య. తెలుగులో కూడా ఆయనకు మంచి ఫాలోయింగ్, మార్కెట్ ఉన్నాయి. సూర్య తండ్రి శివకుమార్ కూడా నటుడే అయినా ఆయనది చిన్న స్థాయే. ఇలాంటి బ్యాగ్రౌండ్ నుంచి వచ్చి చాలా పెద్ద రేంజికి వెళ్లాడు సూర్య. అన్న బాటలో నటనలోకి అడుగు పెట్టిన కార్తి సైతం స్టార్‌గా ఎదిగాడు. ఐతే సూర్య సినిమాల్లోకి అడుగు పెట్టే సమయానికి ఆయన కుటుంబానిది సాధారణ జీవనమే. సూర్య వల్లే ఆర్థికంగానే కాక అన్ని రకాలుగా ఆ కుటుంబం స్థాయి పెరిగింది.
ఐతే తాను నటుడిగా స్థిరపడిపోవాలని, హీరోగా ఎదిగిపోవాలని సినిమాల్లోకి రాలేదని అంటున్నాడు సూర్య. తన తల్లి తండ్రికి తెలియకుండా తీసుకున్న బ్యాంక్ లోన్ తీర్చాలన్న లక్ష్యంతోనే తాను సినిమాల్లోకి వచ్చినట్లు సూర్య తాజాగా ఆసక్తికర విషయం వెల్లడించాడు.
“నేను చదువు ముగించిన వెంటనే ఓ గార్మెంట్స్ కంపెనీలో ఉద్యోగంలో చేరాను. మొదట 15 రోజులకు 750 రూపాయలు జీతంగా ఇచ్చారు. మూడేళ్ల తర్వాత నా జీతం 8 వేలకు పెరిగింది. ఒక రోజు నేను సొంతంగా కంపెనీ పెట్టాలని అనుకున్నా. కానీ నాన్న బాటలో ఇండస్ట్రీలోకి రావాలని మాత్రం అనుకోలేదు. ఐతే ఆ సమయంలో నాన్నకు తెలియకుండా అమ్మ 25 వేల రూపాయల బ్యాంక్ లోన్ తీసుకున్నట్లు నాకు చెప్పింది. ఆ లోన్ ఎలా తీర్చాలా అనుకుంటున్నపుడు ఓ సినిమాలో అవకాశం వచ్చింది. నేను ఇండస్ట్రీలోకి రావాలని, నటుడిగా ఎదగాలని కలలో కూడా అనుకోలేదు. మా అమ్మకు ఆ 25 వేలు ఇచ్చి, నీ లోన్ తీరిపోయింది అని చెప్పడానికి అదే మార్గం అనుకున్నాను. అలా నా కెరీర్ మొదలైంది. ఇప్పుడు సూర్యగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాను” అని సూర్య వెల్లడించాడు. సూర్య కొత్త చిత్రం ‘కంగువ’ వచ్చే నెల 14న పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
This post was last modified on October 25, 2024 7:23 pm
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…