ఊహించినట్టే పుష్ప 2 ది రూల్ విడుదల తేదీ ముందు ప్రకటించిన దానికన్నా ఒక రోజు ముందుకు జరిగి డిసెంబర్ 5 ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో అడుగు పెట్టనుంది. ఈ వార్త రెండు వారాల క్రితమే మా సైట్ ఎక్స్ క్లూజివ్ గా అందించిన సంగతి తెలిసిందే. ఇవాళ దాన్నే హైదరాబాద్ లో జరిగిన ప్రెస్ మీట్ ద్వారా కొత్త పోస్టర్ తో పాటు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. చేతిలో సిగార్ పైప్ తో సైడ్ లుక్ తో అల్లు అర్జున్ ఇచ్చిన స్టిల్ ఫ్యాన్స్ కి మాంచి కిక్ ఇచ్చేలా ఉంది. దేశవ్యాప్తంగా పుష్ప 2ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్న పంపిణీదారులతో కలిసి ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం విశేషం.
రిలీజ్ డేట్ విషయంలో డిసెంబర్ 5ని ఫిక్స్ చేయడం ద్వారా మైత్రి మూవీ మేకర్స్ వేసిన ఎత్తుగడ ఓపెనింగ్స్ పరంగా అద్భుత ఫలితాన్ని ఇవ్వడం ఖాయం. గురువారం రిలీజులు పాజిటివ్ టాక్ వచ్చిన ప్యాన్ ఇండియా మూవీస్ కి ఎంత పెద్దగా ఉపయోగపడుతుందో సరిపోదా శనివారం, దేవర లాంటివి నిరూపించిన నేపథ్యంలో పుష్ప 2 వాటిని మించిన ప్రయోజనం అందుకోవడం ఖాయం. బాలీవుడ్ నుంచి ఆరో తేదీ విక్కీ కౌశల్ చావా ఉన్న నేపథ్యంలో బన్నీ ఒక రోజు ముందే బరిలో దిగడం ద్వారా టాక్ నుంచి వచ్చే పూర్తి ప్రయోజనం అందుకునే అవకాశం ఉంటుంది. లాంగ్ వీకెండ్ కలిసి వచ్చే పెద్ద అంశం.
ఇంకో 40 రోజుల్లోనే పుష్ప 2 ఆగమనం ఫిక్స్ అయిపోవడంతో అభిమానుల ఎగ్జైట్ మెంట్, కౌంట్ డౌన్ మొదలైపోయాయి. ఆగస్ట్ లోనే రావాల్సిన ఈ బ్లాక్ బస్టర్ సీక్వెల్ పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చిన ఫైనల్ గా డిసెంబర్ ను లాక్ చేసుకుంది. క్రిస్మస్ సెలవులకు ఇతర రిలీజులు ఎక్కువగా ఉండటంతో ఆలోగా దొరికే పదిహేను రోజుల అడ్వాంటేజ్ ని వాడుకోవడానికి పుష్పకు అవకాశం దొరికింది. దేవిశ్రీప్రసాద్ ప్రధాన ఆకర్షణగా నిలవబోతున్న పుష్ప 2లో మొదటి భాగంలో నటించిన రష్మిక మందన్న, ఫహద్ ఫాసిల్, సునీల్, అనసూయ, ధనుంజయలతో జగపతిబాబు కూడా తోడవుతున్నారు.
This post was last modified on October 24, 2024 3:19 pm
మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సూపర్ హిట్ తర్వాత నవీన్ పోలిశెట్టి నుంచి మళ్ళీ ఇంకో సినిమా రాలేదు. గ్యాప్…
తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, నిర్మాత దిల్ రాజు ఆధ్వర్యంలో ఈ రోజు టాలీవుడ్ ప్రముఖులు ముఖ్యమంత్రి రేవంత్…
జవాన్ దర్శకుడు అట్లీ బ్రాండ్ ని నిర్మాతగా వాడుకున్నారు. వరుణ్ ధావన్ అక్కడా ఇక్కడా అని లేకుండా అన్ని చోట్లా…
కేంద్రంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న టీడీపీ.. ఏపీ ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీల మధ్య కొన్ని…
వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా ఎదగడానికి, ముఖ్యమంత్రి కావడానికి సింపతీ బాగా ఉపయోగపడిందనడంలో సందేహం లేదు. తన తండ్రి వైఎస్…
సీఎం చంద్రబాబు .. రాజధాని అమరావతికి బ్రాండ్ అని అందరూ అనుకుంటారు. కానీ, ఆయన అనుకుంటే.. దేనికైనా బ్రాండ్ కాగలరని…