పెట్టిన వందల కోట్ల బడ్జెట్ కి, చూపిస్తున్న క్యాస్టింగ్ కి తగ్గ రేంజ్ లో గేమ్ ఛేంజర్ సినిమాకు బజ్ ఇంకా పెరగలేదు. మూడేళ్ళకు పైగా నిర్మాణం, దర్శకుడు శంకర్ మీద ఇండియన్ 2 ఫలితం తాలూకు ప్రభావం, జరగండి పాట మీద వచ్చిన నెగటివిటీ ఇవన్నీ అంచనాల పరంగా ప్లస్ కంటే ఎక్కువ మైనస్ గా పని చేశాయి. వాటిని సరిచేసే పనిలో భాగంగా ఎస్విసి టీమ్ గేర్ మార్చేందుకు సిద్ధమవుతోంది. దీపావళికి రిలీజ్ చేసే టార్గెట్ తో ప్రస్తుతం టీజర్ ఎడిటింగ్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. బిజినెస్ అగ్రిమెంట్లు మొదలుపెట్టే టైం కాబట్టి ట్రేడ్ లో జోష్ రెట్టింపు కావాలంటే దీని పాత్ర చాలా కీలకం.
రెండు తెలుగు రాష్ట్రాల నుంచే సుమారు 150 కోట్ల దాకా థియేట్రికల్ బిజినెస్ ఆశిస్తున్నారు దిల్ రాజు. అంత రికవరీ కావాలంటే ఎంత సంక్రాంతి అయినా సరే వీలైనంత పోటీ తక్కువగా ఉండాలి. బాలకృష్ణ, వెంకటేష్, అజిత్, సందీప్ కిషన్ ఇలా కాంపిటీషన్ అయితే భారీగా ఉంది కానీ ఎవరు తప్పుకుంటారు ఎవరు ఉంటారనేది తేలడానికి కొంచెం టైం పట్టేలా ఉంది. రామ్ చరణ్ కొచ్చిన గ్లోబల్ ఇమేజ్ ఓవర్సీస్ మార్కెట్ లో వాడుకోవచ్చు కానీ సగటు మాస్ ఆడియన్స్ ని గేమ్ ఛేంజర్ చేరుకోవాలంటే మాత్రం మాస్ కంటెంట్ ని పబ్లిసిటీలో చూపించాల్సిందే. దానికి బలమైన పునాది టీజర్ తోనే జరగాలి.
ఇది లాంచ్ అయ్యాక ఒక్కసారిగా ప్రమోషన్ల స్పీడ్ పెంచాల్సి ఉంటుంది. ఒకవైపు పుష్ప 2 ది రూల్ ఎలాంటి హడావిడి చేయకపోయినా విపరీతమైన బజ్ తెచ్చేసుకుంది. వెయ్యి కోట్లకు పైగా ప్రీ రిలీజ్ జరిగిందన్న వార్త దావానలంలా అన్నిచోట్లా కమ్మేసింది. ట్రైలర్ లేకుండానే ఈ స్థాయి రచ్చ చేయడం చూస్తే పుష్ప బ్రాండ్ దేశవ్యాప్తంగా ఏ స్థాయిలో పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఇలా గేమ్ ఛేంజర్ కూ జరగాలని మెగా ఫ్యాన్స్ కోరిక. జనవరి 10 విడుదలకు ఇంకో 75 రోజులు మాత్రమే సమయముంది. ప్రస్తుతం ఫస్ట్ గేర్ లోనే ఉన్న రామ్ చరణ్ బండి వీలైనంత త్వరగా థర్డ్ గేరుకి వెళ్ళిపోయి స్పీడ్ పెంచాలి.
This post was last modified on October 24, 2024 2:01 pm
బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి స్టార్ హీరోగా ఎదగడం అంత తేలికైన విషయం కాదు. ఎంతో ప్రతిభ ఉండాలి.…
ఒక టైంలో నిలకడగా హిట్లు కొడుతూ మంచి ఊపులో కనిపించాడు యువ కథానాయకుడు విశ్వక్సేన్. కానీ కొన్నేళ్లుగా అతడికి విజయాలు…
రాజధాని అమరావతి పనుల పునః ప్రారంభ ఘట్టానికి వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ నోటి నుంచి అనూహ్యంగా తెలుగు వారి…
నోట్ల రద్దు తర్వాత సడన్ గా వచ్చిన రూ.2000 నోట్లను తిరిగి వెనక్కి తీసుకునే ప్రక్రియను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్…
జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల దేశంలో ఉన్న పాకిస్థాన్ పౌరులకు గడువు…
నిన్న సూర్య రెట్రోతో పాటు తమిళంలో టూరిస్ట్ ఫ్యామిలీ విడుదలయ్యింది. తెలుగు డబ్బింగ్ చేయలేదు కానీ కోలీవుడ్ లో దీని…