గుంటూరు కారం తర్వాత మళ్ళీ ఆ స్థాయి సౌండ్ తమన్ వైపు నుంచి వినిపించలేదు. హనుమాన్, టిల్లు స్క్వేర్, దేవర లాంటి బ్లాక్ బస్టర్స్ అన్నీ వేరే వాళ్ళ ఖాతాలో ఉండిపోవడంతో మళ్ళీ తన మేజిక్ ఎప్పుడు వస్తుందాని మ్యూజిక్ లవర్స్ ఎదురు చూస్తున్నారు. ఇంత గ్యాప్ ఆకలిని ఒకేసారి తీర్చేందుకా అన్నట్టు తమన్ వరస సినిమాలతో ఉక్కిరిబిక్కిరి చేయబోతున్నాడు. అయితే వీటి రిలీజ్ డేట్లన్నీ అతి తక్కువ గ్యాప్ లో వచ్చేస్తుండటంతో బాగా పని ఒత్తిడికి గురవుతున్నట్టు సమాచారం. ముందుగా దీపావళిని టార్గెట్ గా పెట్టుకున్న ‘గేమ్ ఛేంజర్’ టీజర్ కి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సెట్ చేసే వర్క్ జరుగుతోంది.
‘బాలయ్య 109’ టైటిల్ అనౌన్స్ మెంట్, టీజర్ రెండూ అదే రోజు ఇచ్చే ప్లానింగ్ లో ఉన్న సితార సంస్థ, ఒకవేళ దానికే కట్టుబడితే ఇది అదనంగా తోడవుతుంది. ఈ నెలాఖరున రిలీజ్ కాబోతున్న ‘సింగం అగైన్’కు కేవలం పాటలే కంపోజ్ చేసినప్పటికీ వాటికి సంబంధించిన ట్రాక్స్ సరిచేసే బాధ్యత ఇంకోవైపు చూసుకోవాల్సి వస్తోంది. డిసెంబర్ 25 విడుదల కానున్న ‘బేబీ జాన్’ (తేరి రీమేక్) కోసం ముంబైకు తిరగాల్సి వస్తోంది. ప్రస్తుతం తన అసిస్టెంట్ తో అక్కడి వ్యవహారాలు చక్కదిద్దుతున్నట్టు తెలిసింది. సిద్దు జొన్నలగడ్డ ‘తెలుసు కదా’ షూటింగ్ వేగంగా జరుగుతున్న నేపథ్యంలో దానికీ ప్రిపేర్ కావాల్సి ఉంటుంది.
ఇవన్నీ ఒక ఎత్తు అయితే ప్రభాస్ ‘ది రాజా సాబ్’, పవన్ కళ్యాణ్ ‘ఓజి’లు ఇంకోవైపు ప్రెజర్ పెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. వీటికి ఇంకా టైం ఉన్నప్పటికీ ఎప్పుడు ఏ అవసరం ఏ రూపంలో వస్తుందో తెలియదు కానీ సంసిద్ధంగా ఉండాల్సిందే. అఖండ 2 ఇంకా చిత్రీకరణ మొదలుపెట్టలేదు కనక ఒత్తిడేమి లేదు. చూస్తుంటే తమన్ 2025 వేసవి దాకా ఊపిరి ఆడనంత బిజీ కాబోతున్నాడు. దేవర పుణ్యమాని అనిరుధ్ రవిచందర్ పేరే గత నెల రోజులు ఎక్కువ వినిపించింది. ఇకపై తమన్ ఫ్యాన్స్ కు పూర్తి డ్యూటీ రెడీ కాబోతోంది. ఏదో ఒక సినిమాకు సంబంధించిన నాన్ స్టాప్ అప్డేట్స్ ఆగకుండా వస్తూనే ఉంటాయి.
This post was last modified on October 24, 2024 11:40 am
టార్గెట్ కేటీఆర్.. లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న…
ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…
విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…
వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…
ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…
ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…