ఒక స్టార్ హీరో స్థాయి, స్టామినా నిర్ణయించేది బాక్సాఫీసే. ఎన్ని హిట్లు కొట్టాడనే దానితో పాటు ఎన్ని వందల కోట్లు మంచి నీళ్లు తాగినంత సులభంగా రాబట్టగలిగాడనే దాని మీదే ఎంత పెట్టుబడి పెట్టాలనేది ప్రొడ్యూసర్లు నిర్ణయించుకుంటారు. అలాంటి లెక్కలేమి లేకుండా లెక్కలేనంత ఖర్చు పెట్టినా అంతకంతా వెనక్కు వస్తుందనే ధీమా కలిగిస్తే అతన్ని ప్రభాస్ తప్ప మరో పేరుతో పిలవలేం. 2002. పెదనాన్న కృష్ణంరాజు వారసత్వాన్ని అందిపుచ్చుకుని ‘ఈశ్వర్’తో ఇండస్ట్రీలో అడుగుపెట్టే నాటికి తన మీద అంచనాలైతే ఉన్నాయి కానీ భవిష్యత్తులో తాను టాలీవుడ్ స్థాయిని ఆకాశానికి పైనే కూర్చోబెడతాడని ఎవరూ ఊహించి ఉండరు.
రెండో సినిమా ‘రాఘవేంద్ర’ అంచనాలు అందుకోవడంలో విఫలమైనా కుర్రాడి కసిని గుర్తించిన నిర్మాత ఎంఎస్ రాజు ‘వర్షం’ రూపంలో భారీ బడ్జెట్ పెట్టారు. చిరంజీవి, బాలకృష్ణ లాంటి సీనియర్లతో పోటీ పడుతూ అది సాధించిన రికార్డులు అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు. తర్వాతి వరసలో అగ్ర దర్శకులు బి గోపాల్, కృష్ణవంశీ తీసిన అడవి రాముడు, చక్రం నిరాశపరిచినా తనను అంతర్జాతీయ రేంజుకి తీసుకెళ్లే రాజమౌళి పరిచయమయ్యాక ‘ఛత్రపతి’ లాంటి అద్భుతం ఆవిష్కృతమయ్యింది. అక్కడి నుంచి ప్రభాస్ కు మాస్ లో తిరుగులేని స్టార్ డాం ఏర్పడింది. పౌర్ణమి, యోగి, మున్నా ఆడకపోయినా ఇబ్బంది కలగలేదు.
బుజ్జిగాడుతో సక్సెస్ అందుకుని తిరిగి డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ లతో కుటుంబ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు ప్రభాస్. రెబెల్ డిజాస్టరైనా తన సత్తా ఏంటో ‘మిర్చి’ మళ్ళీ నిరూపించింది. 2015లో కొత్త చరిత్ర లిఖించబడింది. టాలీవుడ్, బాలీవుడ్ మధ్య హద్దులను చెరిపేస్తూ ‘బాహుబలి ది బిగినింగ్’ రాసిన సువర్ణాధ్యాయం తెలుగు సినిమాను కొత్త మలుపు తిప్పింది. మ్యాచో మ్యాన్ అంటే ఏంటో ప్రభాస్ రూపంలో ప్రపంచానికి పరిచయం చేసింది. ‘బాహుబలి ది కంక్లూజన్’ దాన్ని మరో పది మెట్లు పైకి ఎక్కించింది. సాహో, రాధే శ్యామ్, ఆది పురుష్ ఫెయిలైనా నిర్మాతలు మునిగిపోయేంత కాకపోవడం ప్రభాస్ ప్రభావానికి నిదర్శనం.
ఇక సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్, కల్కి 2898 ఏడిలు చేసిన వసూళ్ల అరాచకానికి అందరూ సాక్షులే, స్క్రీన్ మీద చెలరేగిపోయే ప్రభాస్ బయట చూపించే ఆతిధ్యానికి ఉక్కిరిబిక్కిరి కాని వాళ్ళు ఇండస్ట్రీలో లేరంటే అతిశయోక్తి కాదు. ఎంత ఎదిగినా నాలుగు ముక్కలు మాట్లాడేందుకు తెగ మొహమాటపడే ప్రభాస్ వ్యక్తిత్వంలోనూ అందరికీ నచ్చేస్తాడు. వెయ్యి కోట్లు కాదు అంతకన్నా ఎక్కువ టార్గెట్ పెట్టుకున్నా ఈజీగా ఛేదించే ఈ బాక్సాఫీస్ మాన్స్టర్ గురించి మిర్చిలో కొరటాల శివ ఒక డైలాగ్ రాశారు. కటవుట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్. తల పైకెత్తినా అంత సులభంగా చూడలేనంత ఎదిగిన డార్లింగ్ గురించి ఇంతకన్నా ఏం చెప్పగలం.
This post was last modified on October 23, 2024 10:31 am
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…