విడుదల ముంగిట వచ్చిన ట్రైలర్ మీద మిశ్రమ స్పందనతో ‘దేవర’ సినిమా మీద అనేక అనుమానాలు నెలకొన్నాయి. రిలీజ్ ముందు రోజు అర్ధరాత్రి వేసి స్పెషల్ షోల నుంచి కూడా పూర్తి పాజిటివ్ టాక్ రాలేదు. కొందరేమో ఏకంగా కొరటాల శివ ‘ఆచార్య-2’ తీశాడని అన్నారు. డివైడ్ టాక్ చూస్తే సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏమాత్రం నిలబడుతుందో అన్న సందేహాలు కలిగాయి. కానీ ఆ సందేహాలను పటాపంచలు చేస్తూ ‘దేవర’ సినిమా బాక్సాఫీస్ దగ్గర బలంగానే నిలబడింది.
వీకెండ్లో భారీ వసూళ్లు సాధించింది. తర్వాత కొంచెం వెనుకబడ్డట్లు కనిపించినా.. మళ్లీ దసరా సెలవులు రాగానే పుంజుకుంది. సినిమాకు లాంగ్ రన్ రావడంతో బయ్యర్లందరూ సేఫ్ అయిపోయారు. కొన్ని చోట్ల లాభాలు వచ్చాయి. కొన్ని చోట్ల జస్ట్ బ్రేక్ ఈవెన్ అయింది. ఓవరాల్‌గా సినిమా సక్సెస్ ఫుల్ అనిపించుకుంది.
తాజాగా ‘దేవర’ అరుదైన క్లబ్బులోకి అడుగు పెట్టింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వంద కోట్ల షేర్ రాబట్టిన మూడు చిత్రాల్లో ఒకటిగా మారింది. ఇప్పటిదాకా బాహుబలి-2, ఆర్ఆర్ఆర్ చిత్రాలు మాత్రమే ఈ ఘనత సాధించాయి. ప్రభాస్ సినిమాలు సలార్, కల్కి ఘనవిజయం సాధించినప్పటికీ ఏపీలో ఈ మార్కును అందుకోలేకపోయాయి. కానీ ‘దేవర’ మాత్రం ఈ రేర్ ఫీట్‌ను సాధ్యం చేసింది. ‘ఆర్ఆర్ఆర్’ను కూడా కలిపితే ఏపీలో రెండు వంద కోట్ల షేర్ సినిమాలు ఉన్న ఏకైక హీరో జూనియన్ ఎన్టీఆర్ నిలిచాడు. కొంచెం మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న సినిమాతో ఈ ఫీట్ సాధించడం అంటే చిన్న విషయం కాదు.
‘దేవర’ తర్వాత సరైన సినిమాలు పడకపోవడంతో ఇప్పటికీ ఈ చిత్రం థియేట్రికల్ రన్ కొనసాగుతోంది. తక్కువ స్క్రీన్లలో ఒక మోస్తరు వసూళ్లతో సినిమా నడుస్తోంది. ఓవరాల్‌గా ‘దేవర’ గ్రాస్ వసూళ్లు రూ.500 కోట్ల మార్కును టచ్ చేసినట్లు చిత్ర బృందం ప్రకటించిన సంగతి తెలిసిందే.
This post was last modified on October 23, 2024 10:19 am
హిందీలో దృశ్యం 3 బాగా ఆడుతున్న టైంలో టాలీవుడ్ ప్రేక్షకులకు వస్తున్న సందేహం ఒకటుంది. ఒకవేళ వెంకటేష్ కనక మూడో…
చైనాలో సోషల్ మీడియా ట్రెండ్‌లు, ఫొటోషూట్‌ల సంస్కృతిలో కొత్త మార్పు కనిపిస్తోంది. ప్రస్తుతం కొందరు యువతులు మేల్ మోడల్స్‌తో ప్రత్యేకంగా…
కాక్రోచ్ పార్టీ మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. నీట్ పేపర్ లికేజి వ్యవహారంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర చేపట్టిన…
రాజమౌళి ఫ్యామిలీ మొత్తం ప్రమోషన్లు చేసింది. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా పొడవైన ట్వీట్ రివ్యూలతో సినిమాను మెచ్చుకున్నారు.…
దసరా పండక్కు భారీ పోటీ నెలకొనడం చూస్తున్నాం. సంక్రాంతి రేంజులో మూడు పెద్ద సినిమాలు క్యూ కట్టడం బయ్యర్ వర్గాల్లో…
లెజండరీ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూయడం యావత్ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. 94 వయసులో కూడా సినిమా తీయడానికి…