శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం ఆయన పూర్తి పేరు..చదువుకునే రోజులనుండే పాటలు పాడటం అలవాటైంది..మద్రాస్ లో AMIE పూర్తి చేసి పాటలు పాడే అవకాశాలు ప్రయత్నం లో ఉండగా SP కోదండపాణి మొదటిసారిగా మర్యాదరామన్న సినిమా లో పాడించి నువ్వు ఇంకో 50 ఏళ్ళు పాటలు పాడతావని నాకు నమ్మకం ఉంది అని దీవించాడు..అక్కడి నుండి తిరుగులేదు..
అందరి హీరోలకు ..కొత్తగా వచ్చే హీరోలకు.. కమెడియన్ లకు ఎడాపెడా పాడేసాడు..నేను అసిస్టెంట్ డైరెక్టర్ కాక ముందునుండి ఆయన అభిమానిని.. అసిస్టెంట్ డైరక్టర్ అయ్యాక ఆయన మా సినిమాల పాటలు పాడటానికి వచ్చినప్పుడు ఫెయిర్ చేసిన సాంగ్ కాపీని ఆయనకివ్వడానికి చాలా గర్వంగా అనిపించేది..
నేను ఆయన అభిమానిని అనే విషయం ఆయనకు చెప్పాను…రికార్డింగ్ థియేటర్ లో ఆయన పాడుతున్నప్పుడు నేనొక్కడినే లోపల ఉండిపోయి ఆయన కు తెలియకుండా ఆయనను గమనిస్తూవుండేవాడిని..అదొక ఆనందం..దాదాపు మా సినిమా పాటలన్నీ ఆయనే పాడేవారు.. రికార్డింగ్ థియేటర్ లోకి రాగానే మ్యూజిషన్స్ ని అందరినీ పేరుపేరునా పలకరించేవారు..నేను డైరక్టర్ అయ్యాక నా మనీ సినిమాలో ఆయన మూడు పాటలు పాడారు..
ఆ సినిమా పూర్తి అయ్యాక రిలీజ్ కంటే ముందే నాన్న చనిపోయారు..నేను కర్మ చేసి తలనీలాలు తీయించుకున్నాను..తర్వాత ఒక నెల తర్వాత ఎదో సందర్భంలో బాలుగారు గుండుతో ఉన్న నన్ను చూసి..తిరుపతి మొక్కా అని అడిగారు..లేదండీ నాన్నగారు పోయారు అని చెప్పాను..అంతే.. ఆయన ఎంతగా నొచ్చుకున్నారంటే…ఆయన మాటల్లో…’సారీ ఆండీ ..పొరపాటున అనేసాను..ఒక్క క్షణం ఆలోచించి అనాల్సింది..పిచ్చివాడిని ..వెధవ నోరు..ఏమీ అనుకోవద్దు..ప్లీజ్..ప్లీజ్..మీ నాన్న గారి ఆత్మ శాంతించాలని ఆ పరమేశ్వరుడిని వేడుకుంటున్నాను..’…అని దాదాపు రెండు మూడు నిమిషాలపాటు నాకు చెబుతూనే ఉన్నారు..అది ఆయన సంస్కారం..
— శివ నాగేశ్వర రావు
This post was last modified on October 1, 2020 5:01 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…