ప్రస్తుతం అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య దృష్టంతా తండేల్ మీదే ఉంది. గత కొన్నేళ్లలో వరుసగా డిజాస్టర్లు ఎదుర్కొన్న చైతూ.. తండేల్ మూవీతో బలంగా బౌన్స్ బ్యాక్ అవుతాడని అక్కినేని అభిమానులు ఆశిస్తున్నారు. మొదలైన దగ్గర్నుంచి చాలా ప్రామిసింగ్‌గా కనిపిస్తున్న ఈ చిత్రాన్ని ముందు క్రిస్మస్‌కు రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆలోచన మారింది. సంక్రాంతి రిలీజ్ గురించి గట్టిగానే ఆలోచిస్తున్నారు. త్వరలోనే ప్రకటన రాబోతోంది. ఆ సంగతి తేలేలోపు పెళ్లి పనుల్లో బిజీ అవుతున్నాడు చైతూ.
ఇదిలా ఉంటే చైతూ కొత్త సినిమా తాజాగా ఖరారైనట్లు తెలుస్తోంది. తండేల్ ఒక కొలిక్కి వచ్చేవరకు చైతూ వేరే సినిమా గురించి ఆలోచించలేదు. మొత్తం ఫోకస్ అంతా ఈ మూవీ మీదే పెట్టాడు. వేరే కథలు కూడా వినలేదు. కానీ కొత్తగా కిషోర్ అనే దర్శకుడు చెప్పిన కథకు ఓకే చెప్పినట్లు సమాచారం.
నిజానికి ఈ కిషోర్ అనే దర్శకుడు రానా దగ్గుబాటికి కథ చెప్పాడట. కానీ ఆ కథకు తనకంటే చైతూ అయితేనే కరెక్ట్ అని తన వద్దకు పంపించాడట రానా. చైతూ కూడా ఈ కథ తనకు సూటవుతుందని భావించాడట. ఇదొక యాక్షన్ ఎంటర్టైనర్ అని సమాచారం. రానాకు ఈ కథ నచ్చి ఈ ప్రాజెక్టు కోసం నిర్మాతను కూడా సెట్ చేశాడని.. తాను కూడా ఇందులో భాగస్వామిగా ఉండడానికి ముందుకు వచ్చాడని టాక్. త్వరలోనే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం.
తండేల్ తర్వాత చైతూ చేయబోయే సినిమా ఇదేనని తెలుస్తోంది. సమంత నుంచి విడిపోయాక కొంత కాలం సింగిల్‌గా ఉన్న చైతూ.. ఆపై శోభిత ధూళిపాళ్లతో డేటింగ్ మొదలుపెట్టాడు. ఇటీవలే ఈ జోడీ నిశ్చితార్థం చేసుకుంది. ప్రస్తుతం పెళ్లి పనులు జరుగుతున్నాయి. కొన్ని రోజుల విరామం తర్వాత చైతూ తిరిగి తండేల్ షూట్‌కు హాజరవుతాడు. టాకీ పార్ట్ అంతా పూర్తి చేసి డబ్బింగ్ మొదలుపెడతాడు. తండేల్ రిలీజ్ తర్వాతే తన కొత్త చిత్రం సెట్స్ మీదికి వెళ్లనుంది.
This post was last modified on October 21, 2024 11:22 pm
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…