దీపావళి పండగ సందర్భంగా అక్టోబర్ 31 విడుదల కాబోతున్న లక్కీ భాస్కర్ మీద మంచి అంచనాలున్నాయి. మహానటి తర్వాత తెలుగు మార్కెట్ మీద ప్రత్యేక దృష్టి పెట్టిన మలయాళీ హీరో దుల్కర్ సల్మాన్ వేరే ప్రాజెక్టులు కొంత కాలం పక్కనపెట్టి మరీ ఈ సినిమా కోసం కష్టపడ్డాడు. ధనుష్ సార్ తో సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు వెంకీ అట్లూరి ఈసారి కోలీవుడ్ నుంచి మల్లువుడ్ కు వెళ్ళిపోయి అక్కడి కథానాయకుడిని పట్టుకొచ్చాడు. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించగా జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు. ఇవాళ గ్రాండ్ ట్రైలర్ లాంచ్ ద్వారా కథను దాచకుండా చెప్పేశాడు.
ఇదో పీరియాడిక్ కథ. బ్యాంక్ ఉద్యోగిగా సాధారణ జీవితం గడిపే భాస్కర్ కు భార్యతో కలిసి సంతోషంగా ఉంటే చాలనుకుంటాడు. ఒక ప్రమోషన్ కే లైఫ్ మారిపోతుందనుకునే సగటు మధ్య తరగతి మనస్తత్వం తనది. అయితే అప్పులకు అలాంటి విచక్షణ ఉండదు కాబట్టి వెంటపడటం మొదలుపెడతాయి. దీంతో సొమ్ములు ఉంటేనే గౌరవం దక్కుతుందని భావించి వేరే వ్యాపారాలతో పాటు స్కాములు చేయడం ప్రారంభిస్తాడు. బోలెడు లగ్జరీలు వచ్చి పడతాయి. విలాసానికి చిరునామాగా మారిపోతాడు. ఇంతకీ ఆ డబ్బంతా ఎలా వచ్చింది, ఏం చేశాడనే పాయింట్ తో లక్కీ భాస్కర్ ఉండబోతోంది.
కంటెంట్ పరంగా రెగ్యులర్ ట్రెండ్ కి భిన్నంగా దూరంగా ఆలోచించిన వెంకీ అట్లూరి మరోసారి మిడిల్ క్లాస్ బ్యాక్ డ్రాప్ తీసుకున్నాడు. కాకపోతే వర్తమానం కాకుండా వెనక్కు వెళ్ళాడు. విజువల్స్ అప్పటి వాతావరణాన్ని ప్రతిబింబించగా ఆర్టిస్టుల పెర్ఫార్మన్స్ తో పాటు స్టోరీలో డెప్త్ ఆసక్తి కలిగించేలా ఉంది. పండక్కు విపరీతమైన పోటీ ఉన్న నేపథ్యంలో లక్కీ భాస్కర్ ఒక రోజు ముందే స్పెషల్ ప్రీమియర్లకు రెడీ అవుతున్నాడు. దుల్కర్ కు భారీ మార్కెట్ లేకపోయినా సినిమా బాగుంటే తెలుగు ప్రేక్షకులు ఆదరించడంలో వెనుకాడరు కాబట్టి ఈ టాలీవుడ్ స్ట్రెయిట్ మూవీకి ఎలాంటి తీర్పిస్తారో చూడాలి.
This post was last modified on October 21, 2024 8:22 pm
కేంద్ర హోం శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని జీఎస్టీ మండలి సమావేశంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాలక్షేపానికి తినే…
తెలంగాణ అసెంబ్లీలో టాలీవుడ్ కు సంబంధించి ఎప్పుడూ జరగనంత వాడి వేడి చర్చ ఇవాళ కనిపించడం ఇండస్ట్రీ వర్గాలనే కాదు…
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్.. ఇటు బీజేపీకి, అటు హిందూ సంఘాలకు కూడా.. ఐకాన్. ఆయన…
‘అర్జున్ రెడ్డి’ అనే చిన్న సినిమాతో సందీప్ రెడ్డి వంగ రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. ఆ సినిమా…
సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్ర గాయాలతో…
సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మకు ఏపీ ఫైబర్ నెట్ తాజాగా నోటీసులు జారీ చేసింది. కోటీ 15 లక్షల…