టాలీవుడ్ నిర్మాతల సినిమాల రిలీజ్ ప్లానింగ్ చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. కొంచెం క్రేజున్న సీజన్ వచ్చిందంటే చాలు వేలం వెర్రిగా సినిమాలు రిలీజ్ చేస్తారు. దీని వల్ల థియేటర్ల సమస్య తప్పదు. ఎక్కువ ఆప్షన్లు ఉండడం వల్ల ప్రేక్షకులు ఏ సినిమాకు వెళ్లాలో తెలియని అయోమయంలో పడుతుంటారు. కానీ ప్రేక్షకులు ఏదైనా సినిమా చూద్దాం అని ఎదురు చూస్తున్న సమయంలో థియేటర్లలో అసలు చెప్పుకోదగ్గ చిత్రాలే ఉండవు. అయితే అతివృష్టి లేదంటే అనావృష్టి అన్నట్లు పరిస్థితి తయారవుతోంది.
ఈ నెల రెండో వారంలో దసరా వీకెండ్‌ను పురస్కరించుకుని ఒకేసారి నాలుగు సినిమాలు రిలీజయ్యాయి. కానీ తర్వాత చూస్తే బాక్సాఫీస్ ఖాళీ అయిపోయింది. గత వారం ‘లవ్ రెడ్డి’ అనే చిన్న సినిమా ఒక్కటి కాస్త చెప్పుకోదగ్గది. అది కూడా ప్రేక్షకుల దృష్టిలో పడలేకపోయింది. మిగతా సినిమాల గురించి మాట్లాడుకునే పరిస్థితి కూడా లేదు.
ఇక ఈ వారమేమో ‘పొట్టేల్’ అనే చిన్న సినిమా మీద కొంచెం చర్చ జరుగుతోంది. ఇది కాక ఏవో చిన్నా చితకా చిత్రాలు కొన్ని రిలీజవుతున్నాయి. అవి అస్సలు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించట్లేదు. ఇలా రెండు వారాలను ఖాళీగా వదిలేసిన టాలీవుడ్ నిర్మాతలు నెలాఖర్లో దీపావళి వీకెండ్ కోసం కొట్టేసుకుంటున్నారు. ఆ వారం లక్కీ భాస్కర్, క, జీబ్రాలతో పాటు అమరన్, భగీరా అనే అనువాద చిత్రాలు కూడా పోటీకి సై అంటున్నాయి.
ఒకే రోజు ఐదు కొత్త సినిమాల రిలీజ్ అంటే మ్యాడ్ రష్ అన్నట్లే. ఇంత పోటీ వల్ల ప్రయోజనం ఉండదు. దీని బదులు ఒకట్రెండు సినిమాలను ముందు రెండు వారాల్లో రిలీజ్ చేసి ఉంటే మేలు జరిగేదే. థియేటర్లకూ ఫీడ్ ఇచ్చినట్లుండేది. ప్రేక్షకుల దృష్టిలో పడడానికి కూడా అవకాముండేది. ముందు దీపావళికి అనుకున్న మెకానిక్ రాకీ, అప్పుడో ఇప్పుడో ఎప్పుడో సినిమాలను తర్వాతి వారాలకు వాయిదా వేశారు. అవి సోలోగా రిలీజ్ కాబోతున్నాయి. అందువల్ల వాటికి అడ్వాంటేజ్ ఉంటుంది. దీపావళి సినిమాల విషయంలో ఇప్పటికైనా ఆలోచించి ఒకట్రెండు చిత్రాలను రేసు నుంచి తప్పిస్తే మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
This post was last modified on October 21, 2024 3:59 pm
యంగ్ హీరో నాగచైతన్య ప్రస్తుతం తన కెరీర్లోనే అత్యంత భారీ ప్రాజెక్టుల మీద దృష్టి సారిస్తున్నాడు. ప్రస్తుతం చందూ మొండేటి…
ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో చావు దెబ్బతిన్న వైసీపీ..ఇంకా పాఠాలు నేర్చుకున్న ట్టు కనిపించడం లేదు. ముఖ్యంగా…
ఇటీవలే నెట్ ఫ్లిక్స్ లో వచ్చాక దేవర 2 ఉంటుందా లేదా అనే దాని గురించి డిస్కషన్లు ఎక్కువయ్యాయి. డిజిటల్…
ఏపీ సీఎం చంద్రబాబు తన మంత్రులను డిజప్పాయింట్ చేసేశారు. అదేంటి అనుకుంటున్నారా? ఇక్కడే ఉంది వ్యూహం. తాజాగా అసెంబ్లీలో ప్రవేశ…
ఒకప్పుడు థియేటర్లో సినిమా చూస్తూ దోమలు కుడుతున్నా, తెరమీద బొమ్మ మసకమసకగా కనిపించినా ప్రేక్షకులు సర్దుకుపోయేవాళ్లు. ఇష్టమైన యాక్టర్ల నటన…
టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ తో వైఎస్ షర్మిల సంబంధం ఉందని సోషల్ మీడియాలో చాలాకాలంగా దుష్ప్రచారం జరుగుతోన్న సంగతి…