హీరోలు డైరెక్షన్ చేయడం కొత్తేమీ కాదు. ఎన్టీ రామారావు నుంచి విశ్వక్సేన్ వరకు తెలుగులో మెగా ఫోన్ పట్టిన హీరోలు చాలామందిని చూశాం. తమిళంలో కూడా ఇలాంటి హీరో టర్న్డ్ డైరెక్టర్లు చాలామంది ఉన్నారు. ఐతే ఇప్పుడు ఓ హీరో డైరెక్షన్ చేయబోతుండడమే ఆశ్చర్యం అంటే.. అతను ఎంచుకున్న హీరో మరింత ఆశ్చర్యం కలిగిస్తున్నాడు. మెగా ఫోన్ పట్టబోతున్న ఆ హీరో జయం రవి కాగా.. దర్శకుడిగా తన తొలి చిత్రంలో లీడ్ రోల్ చేయబోయేది కమెడియన్ యోగి బాబు అట. ఈ విషయాన్ని యోగిబాబునే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించడం విశేషం.
యోగిబాబు కమెడియన్‌గా చాలా పెద్ద స్థాయికి ఎదిగాడు తమిళంలో. అతణ్ని ప్రధాన పాత్రలో పెట్టి సినిమాలు కూడా తీశారు. అందులో ‘మండేలా’ కల్ట్ మూవీగా నిలిచింది. అది కమర్షియల్‌గా కూడా పెద్ద సక్సెస్ అయింది. దీంతో యోగిబాబును హీరోగా పెట్టి మరి కొన్ని సినిమాలు తీశారు. ఐతే వర్ధమాన దర్శకులు యోగిబాబుతో సినిమాలు తీయాలనుకోవడంలో ఆశ్చర్యం లేదు కానీ.. జయం రవి అతణ్ని పెట్టి సినిమా డైరెక్ట్ చేయాలనుకోవడం మాత్రం ఆశ్చర్యం కలిగించే విషయమే.
యోగిబాబుతో జయం రవికి మంచి స్నేహం ఉంది. తన సినిమాలు చాలా వాటిలో యోగి కమెడియన్‌గా చేశాడు. ఒకప్పటి నిర్మాత ఎడిటర్ మోహన్ తనయుడైన జయం రవి.. తన అన్న మోహన్ రాజా లాగే ముందు దర్శకుడు కావాలనే అనుకున్నాడు. కమల్ హాసన్ మూవీ ‘ఆలవందాన్’ (అభయ్)కి సురేష్ కృష్ణ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాడు. కానీ మంచి లుక్స్ ఉన్న అతణ్ని ఎడిటర్ మోహన్ హీరోగా పరిచయం చేశాడు. ‘జయం’కు రీమేక్‌గా తెరకెక్కిన తన తొలి చిత్రం రవికే కాక దర్శకుడిగా మోహన్ రాజాకు కూడా మంచి బ్రేక్ ఇచ్చింది. దీంతో ఇద్దరూ ఇండస్ట్రీలో స్థిరపడిపోయారు.
This post was last modified on October 21, 2024 10:28 am
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…
టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…
గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…
ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…
రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…