థియేటర్లు మూతపడ్డ కాలంలో గత ఆరు నెలల్లో కొత్త సినిమాలు చాలానే నేరుగా ఓటీటీల్లో రిలీజయ్యాయి. ముందు థియేటర్లలోనే రిలీజ్ చేస్తాం, ఓటీటీల వైపు వెళ్లం అన్న దిల్ రాజు, కోన వెంకట్ లాంటి నిర్మాతలు సైతం తర్వాత మనసు మార్చుకున్నారు. వి, నిశ్శబ్దం చిత్రాలను ఓటీటీలకు ఇచ్చేశారు. ఈ వరుసలో సోలో బ్రతుకే సో బెటర్, గుడ్ లక్ సఖి, మిస్ ఇండియా లాంటి మరికొన్ని సినిమాలున్నాయి.
ఇప్పుడు థియేటర్లు తెరుచుకోబోతున్నాయని అవేమీ రూటు మార్చే అవకాశాలేమీ కనిపించడం లేదు. ముందు అనుకున్న ప్రకారమే రాబోయే రెండు నెలల్లో ఓటీటీ వేదికల్లోనే ఇవి విడుదల కాబోతున్నాయి. కాగా ఓటీటీల నుంచి ఎంత మంచి ఆఫర్లు వచ్చినా, థియేట్రికల్ రిలీజ్ దిశగా ఆశలే లేకపోయినా.. ఒత్తిడిని తట్టుకుని నిలబడ్డ రెండు చిత్రాలు తెలుగులో ఉన్నాయి. అవే.. ఉప్పెన, రెడ్.
లాక్ డౌన్ మొదలు కావడానికి ముందే ఇవి ఫస్ట్ కాపీలతో రెడీ అయిపోయాయి. ఏప్రిల్ తొలి, రెండో వారాల్లో వరుసగా ఈ చిత్రాలు విడుదల కావాల్సింది. కానీ కొన్ని రోజుల ముందే లాక్ డౌన్ వచ్చి పడింది. వాటికి మోక్షం కలగలేదు. ఇవి ఓటీటీల వైపు వెళ్లకపోవడానికి కారణాలున్నాయి. ‘ఉప్పెన’ మెగా కుర్రాడు వైష్ణవ్ తేజ్ అరంగేట్ర సినిమా. అతడి లాంచింగ్ ఓటీటీల్లో జరిగితే బాగుండదని నష్టం వచ్చినా పర్వాలేదని మైత్రీ మూవీ మేకర్స్ వాళ్లు ఆగారు. ఇక ‘రెడ్’ విషయానికి వస్తే.. దానికి పెట్టుబడి మొత్తం ఇప్పటికే డబ్బింగ్, శాటిలైట్ హక్కుల ద్వారా వచ్చేసింది. కాబట్టి ఆలస్యమైనా పర్వాలేదు, థియేటర్లలో రిలీజ్ చేద్దామని ఆపారు.
వీటి ఓటీటీ రిలీజ్ గురించి వార్తలొచ్చినపుడల్లా ఖండించారు. ఓటీటీ ఆఫర్లు తెచ్చిన వాళ్లకు ఖరాఖండిగా చెప్పేశారు ఇచ్చేది లేదని. ఎట్టకేలకు వీళ్ల నిరీక్షణ ఫలించి థియేటర్లు తెరుచుకోబోతున్నాయి. మరి ధైర్యం చేసి సినిమాలు రిలీజ్ చేస్తారా అన్నది ప్రశ్న. 50 శాతం ఆక్యుపెన్సీతో కొన్ని షరతుల మధ్య రిలీజవుతుండటం, జనాల్లో థియేటర్లకు వెళ్లడంపై భయాలుండటంతో కనీసం నెల రోజుల పాటైతే పరిస్థితులు ఆశాజనకంగా ఉంటాయనిపించలేదు.
ఆ నెల రోజుల్లోపు అయితే ఉప్పెన, రెడ్ చిత్రాల మేకర్స్ సాహసం చేయకపోవచ్చు. అప్పటికి పరిస్థితుల్ని సమీక్షించాక తమ సినిమాలను ఏం చేయాలో నిర్ణయించుకుంటారేమో. సమీప భవిష్యత్తులో పరిస్థితులు మెరుగు పడవనిపిస్తే ఈ రెండూ కూడా ఓటీటీల వైపు అడుగులేసినా వేయొచ్చేమో.
This post was last modified on October 2, 2020 9:23 am
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…