ఇమేజ్ ఉన్న హీరోల సినిమాల జాప్యం వెనుక కారణాలు ఎన్ని ఉన్నా రిలీజ్ ఆలస్యమైతే మాత్రం దాని ప్రభావం బిజినెస్ తో పాటు మార్కెట్ మీద కూడా పడుతుంది. దాని వల్ల బజ్ ప్రభావితం చెందడమో లేదా ఓపెనింగ్స్ తగ్గడమో జరుగుతుంది.
నవంబర్ 8 విడుదల కాబోతున్న ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ పరిస్థితి అచ్చం దీని దిశలోనే ఉంది. కార్తికేయ 2 కన్నా ముందు, కరోనా తర్వాత ఓకే అయిన ప్రాజెక్ట్ ఇది. అప్పటికి నిఖిల్ కు ప్యాన్ ఇండియా ఇమేజ్ లేని మాట వాస్తవమే అయినా లండన్ షెడ్యూల్ పూర్తి చేసుకుని వచ్చాక ఆర్థికపరమైన కారణాల వల్ల అర్ధాంతరంగా బ్రేక్ తీసుకోవాల్సి వచ్చిందట.
ఈలోగా కార్తికేయ 2 బ్లాక్ బస్టర్ కావడం, అప్పుడో ఇప్పుడో ఎప్పుడో దర్శకుడు సుధీర్ వర్మకు శాకినీ డాకిని, రావణాసుర రూపంలో డిజాస్టర్లు పలకరించడం జరిగిపోయాయి. నిజానికి నిఖిల్ కు డైరెక్టర్ మీద మంచి కార్నర్ ఉంది. స్వామి రారా రూపంలో మంచి బ్రేక్ దక్కింది ఈ కాంబోలోనే. కేశవ అంచనాలు అందుకోలేకపోయినా టేకింగ్ పరంగా ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గానూ డీసెంట్ అనిపించుకుంది. ఆ కారణంగానే మూడోసారి కలయికకు నిఖిల్ ఓకే చెప్పాడు. అయితే ముప్పాతిక షూటింగ్ అయ్యాక ఎస్విసిసి సంస్థ నుంచి నిర్మాణ పరంగా ఇబ్బందులు తలెత్తడం వల్ల పెండింగ్ ఉంచినట్టు అంతర్గత సమాచారం.
ఇదంతా ఎలా ఉన్నా అప్పుడో ఇప్పుడో ఎప్పుడో ప్రమోషన్లకు తగినంత సమయం లేదు. ముందునుంచి ఒక ప్రణాళిక ప్రకారం పబ్లిసిటీ చేస్తేనే పెద్ద ప్యాన్ ఇండియా సినిమాలకు హైప్ వస్తోంది. అలాంటిది ఒక మీడియం బడ్జెట్ మూవీకి హఠాత్తుగా నిర్ణయాలు తీసుకోవడం, డేట్లు ప్రకటించేయడం లాంటి పరిణామాలు ఆడియన్స్ లో లేనిపోని అనుమానాలు వచ్చేలా చేస్తాయి. పైగా కంగువ లాంటి పెద్ద రిలీజ్ వారంలో ఉండగా ఇంత టైట్ షెడ్యూల్ తో రిలీజ్ ప్లాన్ చేసుకోవడం ఎంతవరకు రైటనే కోణంలో ఫ్యాన్స్ సందేహం వ్యక్తం చేయడం సబబే. స్పై విషయంలోనూ నిఖిల్ ఈ సమస్యను ఎదురుకున్నాడు.
వచ్చే ఏడాది రానున్న స్వయంభు కోసం నిఖిల్ ఒళ్ళు హూనం చేసుకుని కష్టపడుతున్నాడు. రామ్ చరణ్ సమర్పణలో రూపొందుతున్న ది ఇండియా హౌస్ మీద అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. కాబట్టి ప్రతి విషయంలోనూ విపరీతమైన జాగ్రత్తలు తీసుకోవడం అవసరమే. అప్పుడో ఇప్పుడో ఎప్పుడో జాప్యానికి తెరవెనుక ఏం జరిగినా దానికి మూల్యం చెల్లించేది ముందు నిఖిల్, ఆ తర్వాత నిర్మాత భోగవల్లి ప్రసాద్. హిట్ అయితే ఈ చర్చలన్నీ మటుమాయం అవుతాయి కానీ ఏదైనా తేడా జరిగితేనే లేనిపోని డిస్కషన్లు మొదలవుతాయి. సరే అయిందేదో అయ్యింది కానీ సినిమా గెలిస్తే అదే మహాభాగ్యం.
This post was last modified on October 19, 2024 8:29 pm
మల్లువుడ్ సీనియర్ స్టార్ హీరో మోహన్ లాల్ మనకూ సూపరిచితుడే. స్ట్రెయిట్ సినిమాలు ఎక్కువ చేయనప్పటికీ డబ్బింగ్ ద్వారా రెగ్యులర్…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దూకుడు ప్రదర్శిస్తున్న విషయం తెలిసిందే. మాట తీరు ఆచితూచి ఉన్నా..…
ఏపీలో తాజాగా జపాన్లో టాయామా ప్రిఫెడ్జర్ ప్రావిన్స్ గవర్నర్ సహా 14 మంది ప్రత్యేక అధికారులు.. అక్కడి అధికార పార్టీ…
రెండు అంటే రెండు పిజ్జాల కోసం ఎంత ఖర్చు చేస్తారు? వెయ్యి రూపాయిలు. కాదంటే రెండు వేలు. అదీ కూడా…
సజ్జల రామకృష్ణారెడ్డి చుట్టూ ఇప్పుడు ఉచ్చు బిగిస్తోంది. తాజాగా వైసీపీ అధినేత జగన్ .. సొంత నియోజకవర్గం పులివెందులలో పర్యటిస్తున్నారు.…
మెగాభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న గేమ్ ఛేంజర్ విడుదలకు ఇంకో 15 రోజులు మాత్రమే టైముంది. ప్రమోషన్లు రెగ్యులర్…