కరోనా టైంలో ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ ఎలా రైజ్ అయ్యాయో తెలిసిందే. జనాలు థియేటర్లకు వెళ్లలేని అప్పటి పరిస్థితులను ఉపయోగించుకోవడానికి ఓటీటీలో భారీ పెట్టుబడులు పెట్టాయి. నిర్మాతలు ఊహించని రేట్లు ఇచ్చి కొత్త సినిమాలను కొన్నాయి. నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేస్తే పెట్టుబడి మీద మంచి లాభాలు వస్తుండడంతో చాలామంది నిర్మాతలు అలాగే తమ చిత్రాలను రిలీజ్ చేసుకున్నారు. అంతే కాక థియేట్రికల్ రిలీజ్ తర్వాత ఎంత త్వరగా ఓటీటీలోకి తీసుకొస్తే అంత మంచి రేట ఇవ్వడం మొదలుపెట్టడంతో నిర్మాతలు టెంప్ట్ అవడం మొదలుపెట్టారు.
కానీ నెమ్మదిగా పరిస్థితులు మారిపోయాయి. డిజిటల్ హక్కుల రేట్లు పడిపోయాయి. ఓటీటీలు అన్ని సినిమాలనూ కొనట్లేదు. కొనే వాటికి కూడా ఆశించిన రేట్లు ఇవ్వట్లేదు. పైగా ఎన్నో షరతులు కూడా తప్పట్లేదు. డిజిటల్ ఆదాయం చూసుకుని బడ్జెట్లు, పారితోషకాలు పెంచుకున్న నిర్మాతలు ఇప్పుడు పడిపోయిన రేట్లతో సతమతం అవుతున్నారు.
ఇప్పుడు పరిస్థితి ఎలా తయారైందంటే.. ఓటీటీలు రిలీజ్ డేట్లను కూడా శాసించే పరిస్థితులు నెలకొన్నాయి. తాము చెప్పినపుడు సినిమాను రిలీజ్ చేస్తేనే ఈ రేటు.. కాదంటే తక్కువ ధర అని షరతులు పెడుతున్నాయి. సంక్రాంతి సినిమాల విషయంలో రిలీజ్ డేట్ల మార్పులు చేర్పులతో ఆయా చిత్రాల డిజిటల్ రేట్లు కూడా మారిపోయినట్లు తెలుస్తోంది. క్రిస్మస్‌కు అనుకున్న గేమ్ చేంజర్, తండేల్ చిత్రాలు సంక్రాంతికి వాయిదా పడడంతో వాటి రేట్లు తగ్గుతున్నట్లు సమాచారం.
సంక్రాంతికి ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లడానికి బాగా ఉత్సాహం చూపిస్తారు. మామూలు సమయాల్లో కంటే సినిమాలు చూసే వారి సంఖ్య పెరుగుతుంది. అందువల్ల సంక్రాంతి సినిమాలు ఓటీటీలోకి వస్తే వ్యూయర్ షిప్ తక్కువ ఉంటోందన్నది ఒక పరిశీలన. దీంతో ఓటీటీలు సంక్రాంతి చిత్రాలకు రేట్లు తగ్గిస్తున్నాయట. ఐతే ఇక్కడ పడే లోటును థియేట్రికల్ ఆదాయంతో పూడ్చుకోవచ్చనే ఉద్దేశంతో సంక్రాంతి రిలీజ్‌కు సై అంటున్నారు నిర్మాతలు.
This post was last modified on October 19, 2024 5:59 pm
ఏపీ సీఎం చంద్రబాబు తన మంత్రులను డిజప్పాయింట్ చేసేశారు. అదేంటి అనుకుంటున్నారా? ఇక్కడే ఉంది వ్యూహం. తాజాగా అసెంబ్లీలో ప్రవేశ…
ఒకప్పుడు థియేటర్లో సినిమా చూస్తూ దోమలు కుడుతున్నా, తెరమీద బొమ్మ మసకమసకగా కనిపించినా ప్రేక్షకులు సర్దుకుపోయేవాళ్లు. ఇష్టమైన యాక్టర్ల నటన…
టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ తో వైఎస్ షర్మిల సంబంధం ఉందని సోషల్ మీడియాలో చాలాకాలంగా దుష్ప్రచారం జరుగుతోన్న సంగతి…
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసన మండలిలో వైసీపీ, కూటమి పార్టీల సభ్యుల మధ్య వాడీ వేడీ వాదనలు జరుగుతున్న…
టాలీవుడ్ లో నాగ చైతన్య, శోభితా ధూళిపాళ్లల పెళ్లి విషయం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. సమంతతో…
బిలియనీర్.. ప్రపంచ కుబేరుల్లో ఒకరైన అదానీ అధినేత గౌతమ్ అదానీపై అమెరికాలో నమోదైన కేసు క్రియేట్ చేసిన కార్పొరేట్ సంచలనం…