సుకుమార్ సినిమా అంటే కథ ఎలాంటిదైనా అందులో ఐటెం సాంగ్ ఉండాల్సిందే. ‘రంగస్థలం’ లాంటి సీరియస్ మూవీలో కూడా పూజా హెగ్డేతో ఐటెం సాంగ్ పెట్టించాడు సుకుమార్. తర్వాతి చిత్రం ‘పుష్ప: ది రైజ్’లో సమంతతో ఐటెం సాంగ్ చేయించాడు. ‘ఊ అంటావా మావా..’ అంటూ సాగే ఆ పాట ఎంత పాపులర్ అయిదో.. జనాలను ఎలా ఊపేసిందో తెలిసిందే. ఇప్పుడు ‘పుష్ప-2’లోనూ ఐటెం సాంగ్ ఉంటుందనడంలో ఎవరికీ సందేహాలు లేవు.
ఐతే రిలీజ్‌కు సమయం నెలన్నరే ఉండగా.. ఇంకా ఆ పాట చిత్రీకరించలేదు. ఇంతకీ ఆ పాటలో ఎవరు కనిపిస్తారనే సస్పెన్స్ కూడా కొనసాగుతోంది. ఇంతకుముందు రకరకాల పేర్లు వినిపించాయి. చివరగా తెరపైకి వచ్చిన పేరు.. బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్‌దే. తాజా సమాచారం ప్రకారం పుష్ప-2 ఐటెం సాంగ్‌కు ఆమెనే ఖరారైపోయింది.
రెండు రోజుల కిందటే ‘పుష్ప-2’ నిర్మాతలు శ్రద్ధా కపూర్‌కు అడ్వాన్స్ ఇచ్చేశారు. ఇంకొన్ని రోజుల్లోనే ఆ పాట చిత్రీకరణ ఉంటుంది. ఇటీవలే ‘స్త్రీ-2’ రికార్డ్ బ్రేకింగ్ హిట్ అయిన నేపథ్యంలో శ్రద్ధా డిమాండ్ మామూలుగా లేదు. ఆమె భారీ పారితోషకం అడిగినా.. హిందీలో తనకున్న మార్కెట్ దృష్ట్యా నిర్మాతలు వెనుకంజ వేయలేదు. ‘పుష్ప-2’కు హిందీలో కూడా బంపర్ క్రేజ్ ఉంది. ఇక శ్రద్ధా ఐటెం సాంగ్ చేస్తే అక్కడి జనం మరింత ఊగిపోతారనడంలో సందేహం లేదు.
ఈ పాట కూడా ‘ఊ అంటావా..’ స్థాయిలో ఉంటే దాని రీచ్ మామూలుగా ఉండదు. ఈ పాటకు గణేష్ ఆచార్య నృత్య రీతులు సమకూరుస్తారని.. దేవిశ్రీ ప్రసాద్ మంచి ఊపున్న పాటనే కంపోజ్ చేశాడని సమాచారం. నవంబరు తొలి వారంలో ఈ పాట చిత్రీకరణ ఉండొచ్చని అంటున్నారు. త్వరలోనే టాకీ పార్ట్ పూర్తి కానుంది. తర్వాత ఐటెం సాంగ్‌తో పాటు మరో పాట కూడా షూట్ చేయాల్సి ఉంది. ‘పుష్ప-2’ డిసెంబరు 6న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
This post was last modified on October 19, 2024 5:47 pm
నిజమే… నిన్నటిదాకా ఏపీలో ఎవరిపై ఎవరైనా నోరు పారేసుకున్నారు. అసలు అవతలి వ్యక్తులు తమకు సంబంధించిన వారా? లేదా? అన్న…
వైసీపీ నేత, హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ అరెస్టు అయ్యారు. ఈ మేరకు గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో…
2008 నవంబర్ 26న జరిగిన ముంబై ఉగ్రదాడి భారత దేశ చరిత్రలో మరిచిపోలేని దారుణం. ఆ దాడిలో 170 మందికిపైగా…
అమెరికాలో భారత సంతతికి చెందిన ప్రముఖ సీఈఓ అనురాగ్ బాజ్పాయ్ అరెస్టయ్యారు. బోస్టన్ సమీపంలో ఉన్న వ్యభిచార గృహాల వ్యవహారంలో…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండు రోజుల క్రితం శ్రీసత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో జరిపిన పర్యటన…
ఒకపక్క విడుదల తేదీ మే 9 ముంచుకొస్తోంది. రిలీజ్ కౌంట్ డౌన్ నెల నుంచి 29 రోజులకు తగ్గిపోయింది. ఇంకోవైపు…