వెంకటేష్ 76ని వేగంగా తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్న దర్శకుడు అనిల్ రావిపూడికి సంకట పరిస్థితి వచ్చి పడిందని ఇన్ సైడ్ టాక్. ముందు అనుకున్న ప్లానింగ్ ప్రకారం ఈ సినిమా ఖచ్చితంగా సంక్రాంతికి విడుదల కావాలి. ఆ మేరకు షూటింగ్ ప్రారంభం కాక ముందే ప్రీ లుక్ పోస్టర్ లో ఆ విషయాన్ని హైలైట్ చేశారు. కానీ తర్వాత జరిగిన అనుకోని పరిణామాల వల్ల లెక్కలు మారిపోయి రేసులోకి గేమ్ ఛేంజర్ వచ్చింది. రెండింటి నిర్మాత దిల్ రాజే కాబట్టి వెంకీ మూవీని వాయిదా వేస్తే బాగుంటుందనే అభిప్రాయం బయ్యర్ వర్గాల్లో ఉంది. దానికి సానుకూలంగానే నిర్ణయం జరగొచ్చని అంటున్నారు.
కానీ వెంకటేష్ కేమో పండగ డేట్ ని వదులుకోవడం ఇష్టం లేదు. కలిసుందాం రా, ఎఫ్ 2 లాంటి ఎన్నో బ్లాక్ బస్టర్లు ఇచ్చిన సీజన్ గా మరోసారి సెంటిమెంట్ రిపీట్ చేయాలని చూస్తున్నారు. అనిల్ రావిపూడికి సైతం ఇదే ఉంది. సరిలేరు నీకెవ్వరు, ఎఫ్2 హిట్లు కొట్టింది సంక్రాంతికే. కానీ రాజుగారు మాత్రం హీరోని కన్విన్స్ చేసే బాధ్యతని అనిల్ మీదే పెట్టినట్టు వినికిడి. అంత సులభంగా ఆ మాటను కాదనలేరు. ఎందుకంటే డెబ్యూ మూవీ రాజా ది గ్రేట్ అవకాశం ఇచ్చిన దిల్ రాజు స్వయంగా అడిగితే వెంటనే నో చెప్పడానికి అనిల్ కు ఎలా మనస్కరిస్తుంది. కానీ వెంకటేష్ తోనూ అంతే చనువుంది.
సో ఫైనల్ గా ఏమవుతుందో కానీ వెంకీ ఫ్యాన్స్ మాత్రం గుర్రుగా ఉన్నారు. పక్కకు తప్పించి మాకు అన్యాయం చేయొద్దంటూ సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు. నిజానికి ఒకే సంస్థ రెండు సినిమాలు సంక్రాంతికి రావొచ్చని గతంలో మైత్రి చేసి చూపించింది. కానీ దిల్ రాజుకు గేమ్ ఛేంజర్ తో పాటు బాలయ్య 109 డిస్ట్రిబ్యూషన్ బాధ్యత ఉంటుంది. సో థియేటర్ల సర్దుబాటు పెద్ద సమస్య కావొచ్చు. మంచి ఎంటర్ టైనర్ అయిన వెంకటేష్ సినిమాని ఎప్పుడు తీసుకొచ్చినా ఆడుతుందనే నమ్మకం ఆయనలో ఉందట. చివరికి ఈ కథ ఎటెటు తిరిగి ఏ కంక్లూజన్ కు వస్తుందో ఇంకొద్ది రోజులు ఆగి చూడాలి.
This post was last modified on October 19, 2024 12:06 pm
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…
సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…
అసెంబ్లీ వేదికగా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏలకు, పార్టీల కార్యకర్తలకు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నేటి నుంచి మహారాష్ట్రలో రెండు పాటు పర్యటించనున్నారు. ఆయనతోపాటు డిప్యూటీ సీఎం పవన్…