కొందరు దర్శకులు కమర్షియల్ ప్రపంచానికి దూరంగా తమదైన శైలిలో కొత్త జానర్లు టచ్ చేస్తూ, ఎప్పుడూ చూడని కథలను పరిచయం చేసే ప్రయత్నం చేస్తారు. ఇదే వీళ్ళను ఇతరుల కంటే భిన్నంగా గుర్తింపు తెచ్చుకునేలా చేస్తుంది. అలాంటి వాళ్లలో వెట్రిమారన్ పేరు ప్రముఖంగా చెప్పుకోవచ్చు. జూనియర్ ఎన్టీఆర్ అంతటివాడే స్వయంగా తనకు ఆయనతో సినిమా చేయాలని ఉందని, డేట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పడం ఎంతగా హైలైట్ అయ్యిందో చూశాం. అదే కోవలోకి వస్తాడు టీజె జ్ఞానవేల్. సూర్యతో జై భీం తీసినప్పుడు ఎన్ని గొప్ప ప్రశంసలు వచ్చాయో, జనంలో ఎంతగా ముద్రించుకుపోయిందో చూశాం.
కట్ చేస్తే వేట్టయన్ పుణ్యమాని టీజె జ్ఞానవేల్ ఒక మాములు రెగ్యులర్ డైరెక్టర్ గా కనిపించేశాడు. రజనీకాంత్ సూపర్ స్టార్ ఇమేజ్ ని మ్యాచ్ చేసే ఉద్దేశంతో సీరియస్ కథలో జొప్పించి మాస్ అంశాలు ఎవరినీ మెప్పించలేక మూవీని ఫ్లాప్ దిశగా నడిపించాయి. నిర్మాతలు పదే పదే రెండు వందల కోట్లు దాటిందని పోస్టర్లు వేస్తున్నారు కానీ వాస్తవ పరిస్థితి దానికి భిన్నంగా ఉందనేది ఎవరూ కాదనలేరు. ఫేక్ ఎన్కౌంటర్ చుట్టూ స్క్రీన్ ప్లేని ఆధారంగా చేసుకుని అద్భుతమైన డ్రామా పండించవచ్చు. కానీ అవసరం లేని ఎలివేషన్ ఫైట్లు, రొటీన్ అనిపించే రానా విలనిజం లాంటివి వేట్టయన్ కు నెగటివ్ గా మారాయి.
గతంలో కార్తీక్ సుబ్బరాజ్ కూడా ఇదే సమస్యను ఎదుర్కొన్నాడు. పేట తమిళంలో బాగానే ఆడింది కానీ ఇతర భాషల్లో యావరేజ్ కంటే కిందే నిలిచిపోయింది. అతను కూడా రజని స్వాగ్ ని చూపించే ప్రయత్నంలో పాత కథనే చెప్పాడు. ఇప్పుడు టీజె జ్ఞానవేల్ పరిస్థితి కూడా అదే అయ్యింది. ఒక్క నెల్సన్ దిలీప్ కుమార్ మాత్రమే జైలర్ రూపంలో బ్లాక్ బస్టర్ సాధించాడు కానీ యునానిమస్ గా అందరు ఫ్యాన్స్ మెప్పించేలా ఏ దర్శకుడు రజనిని చూపించలేకపోయాడు. రోబో, చంద్రముఖి, నరసింహ, బాషా నాటి రజనిని బయటికి తీయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అదే డైరెక్టర్ల పాలిట ఉచ్చుగా మిగిలిపోయింది.
This post was last modified on October 18, 2024 12:57 pm
సోమవారం వసంత పంచమి. చాలా మంచి రోజు. ఈ శుభ సందర్భాన్ని కొత్త సినిమాల ఓపెనింగ్ కోసం టాలీవుడ్ బాగానే…
విక్టరీ వెంకటేష్ మొట్టమొదటి వెబ్ సిరీస్ గా 2023 మార్చిలో విడుదలైన రానా నాయుడు భారీ స్థాయిలో మిలియన్ల కొద్దీ…
ఊరిపేరు భైరవకోనతో ట్రాక్ లో పడ్డ యూత్ హీరో సందీప్ కిషన్ ఈ నెలలో మజాకాతో పలకరించబోతున్నాడు. త్రినాధరావు నక్కిన…
లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం ప్రధాన పాత్ర పోషించిన బ్రహ్మ ఆనందం ఫిబ్రవరి 14 విడుదల కానుంది. మాములుగా అయితే విశ్వక్…
బాలీవుడ్ లో బేబీ జాన్ తో అడుగు పెట్టిన కీర్తి సురేష్ కి తొలి సినిమానే డిజాస్టర్ కావడం నిరాశపరిచేదే…
అనుకున్నంతా అయ్యింది. అధికార పార్టీ టీడీపీ వ్యూహాల ముందు విపక్ష వైసీపీ వ్యూహాలు ఫలించలేదు. రాజకీయాలకు కొత్తే అయినా గుంటూరు…