థియేటర్లలో రిలీజై రెండేళ్లు దాటిపోయింది కాబట్టి ఏదో టీవీలో వచ్చినప్పుడో, యూట్యూబ్ లో క్లిప్పులు చూసినప్పుడో తప్ప ఆర్ఆర్ఆర్ ని ప్రేక్షకులు అదే పనిగా గుర్తుకు తెచ్చుకోవడం ఇప్పుడైతే లేదు. ఎన్ని రికార్డులు నమోదు చేసినా యాభై రోజుల తర్వాత ఓటిటిలో వచ్చేసిన ఈ ప్యాన్ ఇండియా గ్రాండియర్ ప్రపంచంలో ఒక చోట ఏడాదికి పైగానే ఆడుతోందంటే నమ్మడానికి కష్టంగా ఉన్నా ఇది అక్షరాలా నిజం. ఏదో ఫ్యాన్స్ డబ్బులిచ్చి బలవంతంగా ఆడించే వ్యవహారమని కొట్టి పారేయడానికి ఆడుతోంది ఏపీ, తెలంగాణలోని మారుమూల ఊళ్ళో కాదు. అసలు టాలీవుడ్దంటే ఏంటో తెలియని జపాన్ దేశంలో.
జపాన్ లో 71 సంవత్సరాల చరిత్ర కలిగిన టుసాగుచి సాన్ సాన్ అనే థియేటర్లో ఆర్ఆర్ఆర్ 1 సంవత్సరం 9 నెలలుగా ఆడుతూనే ఉంది. రోజూ ఒకటి రెండు రెగ్యులర్ షోలతో ఏ రోజూ ఆపకుండా స్క్రీనింగ్ చేస్తూనే వచ్చారు. ఇంత సుదీర్ఘమైన రన్ తెచ్చుకున్న మొదటి ఇండియన్ మూవీగా ఆర్ఆర్ఆర్ అక్కడ సరికొత్త రికార్డు నమోదు చేసింది. ఈ సుదీర్ఘమైన పరుగుకు ఇప్పుడు ముగింపు పలకబోతున్నారు. ఇదే చివరి వారంగా యాజమాన్యం ప్రకటించింది. ఇంత ఆడినా రేపు శనివారం వేస్తున్న షోకు సంబంధించిన టికెట్లు అడ్వాన్స్ గా అన్నీ అమ్ముడుపోవడం అసలు ట్విస్టు.
రాజమౌళి గ్రాండియర్ ని జపాన్ ఆడియన్స్ ఎంతగా సొంతం చేసుకున్నారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇండియాలో పట్టుమని వంద రోజులు ఆడటమే కలగా మారిన పరిస్థితిలో ఏకంగా నాన్ ఇంగ్లీష్ కంట్రీలో ఇలాంటి ఫీట్ సాధించడమంటే జక్కన్న మేజిక్ కాక మరేమిటి. ఇప్పుడు సెలవు తీసుకున్నా తిరిగి కొన్ని నెలల గ్యాప్ తర్వాత ఆర్ఆర్ఆర్ రీ రిలీజ్ చేస్తారని అక్కడి మీడియా టాక్. అన్నట్టు మనం ఏనాడో మర్చిపోయిన డివిడి, బ్లూరే డిస్కుల ద్వారా ఈ సినిమా కొన్ని నెలల క్రితం రిలీజ్ కావడం మరో విశేషం. హోమ్ ఎంటర్ టైన్మెంట్ లోనూ ఎక్కువ సేల్స్ జరిగిన చిత్రంగా మైలురాళ్ళు సాధించింది.
This post was last modified on October 18, 2024 11:29 am
ఖేల్ రత్న అవార్డులు: గుకేశ్, మను బాకర్ సహా నలుగురికి గౌరవం భారత ప్రభుత్వం 2024 సంవత్సరానికి గాను మేజర్…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. తన అభిమానులకు అద్భుత సందేశం ఇచ్చారు. తనను అభిమానిం చేవారు... తప్పకుండా పాటించాలని…
ఇండియాస్ హైయెస్ట్ బడ్జెట్, మోస్ట్ హైప్డ్ మూవీకి ఈ రోజే ముహూర్త వేడుక ముగిసింది. సూపర్ స్టార్ మహేష్ బాబు…
ఇప్పుడంతా ఇంటర్ నెట్ ప్రపంచం. కొన్ని నిముషాలు మొబైల్ డేటా లేకపోయినా, ఇంట్లో వైఫై పనిచేయకపోయినా ఏదో భూమి బద్దలైపోయి…
ఈ సోషల్ మీడియా కాలంలో పెద్ద పెద్ద సినిమాలకు సంబంధించి కూడా ఆన్ లొకేషన్ ఫొటోలు, వీడియోలు లీక్ అయిపోతుంటాయి.…