Movie News

అకీరాకు ఏం మిగలవంటున్న పవన్ ఫ్యాన్స్

స్టార్ లెగసి సృష్టించి పెట్టిన తండ్రి వారసత్వాన్ని మోస్తున్న హీరోలకు దాన్ని కాపాడుకోవడం అంత సులభం కాదు. బాలకృష్ణ, నాగార్జున నుంచి రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ దాకా వీళ్లంతా సక్సెసయ్యారంటే దాని వెనుక ఎంతో కఠిన శ్రమ ఉంటుంది. అంచనాల బరువు మోయడం అంత సులభంగా ఉండదు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అకీరానందన్ తెరంగేట్రం కోసం ఎంతగా ఎదురు చూస్తున్నారో తెలిసిందే. రేణు దేశాయ్ నుంచి ఎలాంటి అభ్యంతరం వచ్చే సూచనలు లేకపోవడంతో ఇంకో రెండు మూడేళ్ళలో జూనియర్ పవన్ ని స్క్రీన్ మీద చూడొచ్చని మెగాభిమానులు గంపెడాశతో ఎదురు చూస్తున్నారు.

ఇక అసలు విషయానికి వద్దాం. పవన్ కళ్యాణ్ పట్టుమని ముప్పై సినిమాలు చేయలేదు. చేసిన వాటిలో బ్లాక్ బస్టర్ టైటిల్స్ ని ఇతరులు ఒక్కొక్కరుగా వాడేసుకోవడం ఫ్యాన్స్ కి ఎంత మాత్రం నచ్చడం లేదు. వరుణ్ తేజ్ తొలిప్రేమ, విజయ్ దేవరకొండ ఖుషి, నితిన్ తమ్ముడులను తీసుకున్నాక తాజాగా యాంకర్ ప్రదీప్ కోసం పవర్ స్టార్ డెబ్యూ మూవీ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయిని పెట్టేసుకున్నారు. ఫస్ట్ లుక్ కూడా వచ్చేసింది. ఇక పవన్ హిట్లలో మిగిలిన పేర్లు సుస్వాగతం, జల్సా, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది మాత్రమే. మొదటి రెండు ఆల్రెడీ వేరే నిర్మాతలు రిజిస్టర్ చేసి పెట్టుకున్నారట.

ఇలా అయితే అకీరాకు ఇంకేం మిగలవంటూ అభిమానులు వాపోతున్నారు. చిరంజీవికీ ఈ సమస్య వచ్చింది. గ్యాంగ్ లీడర్, విజేత, దొంగ, ఖైదీ, హిట్లర్, మాస్టర్, రాక్షసుడు, ఛాలెంజ్, అభిలాష, పున్నమి నాగు ఇలా ఒకటి రెండు కాదు లెక్కలేనన్ని టైటిల్స్ ఇతర హీరోలు తీసేసుకున్నారు. చరణ్ కొన్ని ఉంచుకోవాల్సిందన్న అభ్యర్థనను మెగా కాంపౌండ్ పట్టించుకోలేదు. అయినా కథకు తగ్గట్టు టైటిల్ పెట్టుకోవాలి తప్పించి ఊరికే రిజిస్టర్ చేసి పెట్టుకుని డబ్బులు ఖర్చు చేయలేంగా అనేది వాళ్ళ వెర్షన్. పాటలు వాడుకోకుండా ఆపగలరు కానీ టైటిల్స్ మాత్రం ఎవరి నియంత్రణలో ఉండవు.

This post was last modified on October 17, 2024 3:55 pm

Share

Recent Posts

సెటైర్లు సీరియస్‌గా తీసుకోనవసరం లేదు

నిన్న విడుదలైన కామ్రేడ్ కళ్యాణ్ ఓపెనింగ్స్ డీసెంట్ గా మొదలయ్యాయి. ఉదయం కొంచెం నెమ్మదిగా ఉన్నప్పటికీ సాయంత్రానికి పరిస్థితిలో మార్పొచ్చింది.…

1 hour ago

డబ్బింగ్ సినిమాల రేట్ల పెంపు సబబేనా

అక్టోబర్ 15 విడుదల కాబోతున్న జైలర్ 2 మొదటి రోజు చెన్నై టికెట్ ధర కంటే ఆంధ్రప్రదేశ్ లోని ఒక…

1 hour ago

మార్చాల్సింది జ్ఞానేష్‌నా.. వ్య‌వ‌స్థ‌నా?!

ఒక ఇంట్లో దొంగ ప‌డ్డాడు. న‌గ‌లు, నట్రా దోచుకున్నాడు. య‌జ‌మాని ... ఆ దొంగ‌ను గుర్తించాడు. పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు.…

3 hours ago

బుమ్రా, పాండ్యా లేకుంటే అంతేనా…

టీ20ల్లో 249 పరుగులు చేసినా గెలవలేకపోతే బౌలింగ్ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమ్ఇండియాకు అదే…

4 hours ago

గ్రీన్‌కార్డ్ షాక్… ఐటీ కంపెనీలు ఏమంటున్నాయి?

అమెరికా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో భారత ఐటీ కంపెనీలకు కొత్త సమస్య వచ్చిపడింది. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో సహా ఎనిమిది…

4 hours ago

తిరుమ‌ల కేంద్రంగా సాయిరెడ్డి విన్యాసాలు స‌క్సెస్ అయ్యేనా?

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం కేంద్రంగా వైసీపీ మాజీ నాయ‌కుడు, రాజ్య‌స‌భ మాజీ స‌భ్యుడు వి. విజ‌యసాయిరెడ్డి చేస్తున్న రాజ‌కీయాల‌పై ఆస‌క్తికర…

9 hours ago