సీనియర్ హీరో కం క్యారెక్టర్ ఆర్టిస్ట్ నరేష్ సినిమాల్లోనే కాదు బయట స్టేజి మీద, ఇంటర్వ్యూలలో మంచి హుషారుగా కనిపిస్తారు. ఎవరి గురించైనా ఎలివేట్ చేయడంలో ఆయన స్టైల్ వేరు. నిన్న జరిగిన విశ్వం సక్సెస్ మీట్ లో 2024లో అతి పెద్ద హిట్ ఇదేననే తరహాలో స్టేట్ మెంట్ ఇవ్వడంతో ఒక్కసారిగా సోషల్ మీడియా ట్రోలర్స్ కు టార్గెట్ గా మారిపోయారు. ఈ సంవత్సరం విజయం సాధించినది అదొక్కటే అయితే మరి కల్కి 2898 ఏడి, దేవర, టిల్లు స్క్వేర్, హనుమాన్ మాటేమిటని అడిగేస్తున్నారు. నిజానికి నరేష్ ఉద్దేశం దసరా పండక్కు సక్సెస్ అయిన మూవీ మాదొకటేనని చెప్పడం కావొచ్చు.
సరే ఆయన ఉద్దేశం ఏదైనా గతంలోనూ నరేష్ ఇలా అత్యుత్సాహంతో ఇచ్చిన స్టేట్ మెంట్లు మిస్ ఫైర్ అయిన సందర్భాలు లేకపోలేదు. ఆ మధ్య ఒక ప్రముఖ్ ఓటిటి నిర్మించిన ఒక మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తమ సినిమాను ఎవరూ పైరసీ చేయలేరని వేదిక మీదే ఛాలెంజ్ విసిరారు. దీని కోసం టీమ్ ప్రత్యేకంగా ఒక టెక్నాలజీ వాడింది కానీ పూర్తిగా డూప్లికేషన్ ని అడ్డుకోలేకపోయింది. దీంతో కొన్ని సైట్లలో కాపీలు ప్రత్యక్షమయ్యాయి. వాస్తవాన్ని అర్థం చేసుకున్న సదరు ఓటిటి తర్వాత ఎక్కడా పైరసీ గురించి సవాలు చేయడం కానీ, మా సినిమాని డౌన్లోడ్ చేయలేరని అనడం కానీ మానేశారు.
నిజానికి విశ్వం కమర్షియల్ సక్సెస్ కాదని వసూళ్లు స్పష్టం చేశాయి. కాకపోతే ఉన్నంతలో వచ్చిన టాక్ కి సంబంధం లేకుండా బిసి సెంటర్స్ లో కొంచెం మెరుగ్గా రాబట్టిన మాట వాస్తవమే కానీ మరీ లాభాలు వచ్చే స్థాయిలో కాదనేది ట్రేడ్ నుంచి వస్తున్న సమాచారం. అయినా గ్రౌండ్ లెవెల్ లో పరిస్థితి ఎలా ఉంటుందనేది బిజీగా ఉండే క్యారెక్టర్ ఆర్టిస్టులకు తెలిసి ఉండకపోవచ్చు కాబట్టే ఇలా అనడాన్ని అపార్థం చేసుకోలేం. కానీ ట్విట్టర్, ఇన్స్ టా బ్యాచ్ కి అంత లోతుగా ఆలోచించే విచక్షణ ఉండవు కాబట్టే వీడియోలను తెగ తిప్పేసి వైరల్ చేసి పాపులారిటీ చేయడం మాములే.
దసరా తర్వాత నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వచ్చిన ది ప్యారడైజ్ సినిమా మిశ్రమ స్పందన…
హెడ్డింగ్ చూడగానే ఏంటీ పొగడ్తనే అనుమానం రావొచ్చు కానీ అసలు విషయం తెలుసుకున్నాక నిజమే అనుకోక మానరు. విషయం ఏమిటంటే…
గత ఎన్నికల్లో ఓటమి పాలైన డీఎంకే అధినేత స్థాలిన్ దాన్నుంచి ఎలాంటి గుణపాఠం నేర్చుకున్నట్లు లేదు. ఆయన, ఆయన కుమారుడు…
మంచి అందగాడు, పెర్ఫామెన్స్ విషయంలోనూ ఢోకా లేదు. అయినా నవదీప్ టాలీవుడ్లో అనుకున్నంత పెద్ద స్థాయికి వెళ్లలేకపోయాడు. తేజ మూవీ…
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మంచి జోష్ లో ఉన్నాడు. చెన్నై లవ్ స్టోరీ థియేట్రికల్ రన్ లో సూపర్…
నిన్న కొత్త సినిమాలు చాలా రిలీజయ్యాయి. మాములుగా అయితే థియేటర్లు కిటకిటలాడిపోవాలి. అయితే ఆక్యుపెన్సీలు కొంచెం నెమ్మదిగా ఉన్న నేపథ్యంలో…