గేమ్ ఛేంజర్ భారీ హంగులతో గ్రాండ్ గానే తెరకెక్కుతోందని మేకర్స్ అప్డేట్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. కానీ ఆడియెన్స్ కు మాత్రం పెద్దగా కనెక్ట్ కావడం లేదనే కామెంట్స్ కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి. మరోవైపు శంకర్ ఇండియన్ 2తో ఇచ్చిన స్ట్రోక్ వలన మెగా ఫ్యాన్స్ లో ఉన్న కాస్త ఆసక్తి కూడా పాతాళానికి పడిపోయింది. మళ్ళీ వారి నమ్మకానికి బూస్ట్ రావాలి అంటే టీజర్ ట్రైలర్ తోనే కిక్కివ్వాల్సిన అవసరం ఉంది.
అయితే ఈ సినిమా రిజల్ట్ రామ్ చరణ్ మార్కెట్ పై ఏ మేరకు ప్రభావం చూపుతుందనేది అసలు ప్రశ్న. ఫ్యాన్స్ అయితే ఈ గండం గడిస్తే చాలనుకుంటున్నారు. ఎదో ఒకలా మినిమమ్ హిట్టవ్వాలి అనే ఆశతో కూడా ఉన్నారు. ఎందుకంటే RRRతో ఆస్కార్ వరకు వెళ్లిన క్రేజ్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకు వెళ్లాలి అంటే వీలైనంత తొందరగా మరో హిట్టు కొట్టాలి.
అయితే గేమ్ ఛేంజర్ విషయంలో ఏదైనా మ్యాజిక్ జరిగితే తప్ప బాక్సాఫీస్ వద్ద ప్రభావం చూపే అవకాశం లేదనిపిస్తోంది. గేమ్ ఛేంజర్ రిజల్ట్ ఎలా ఉన్నా కూడా చరణ్ తరువాత చేయబోయే ప్రాజెక్టులు మాత్రం పాన్ ఇండియా రేంజ్ లో మంచి హైప్ తో రావడం పక్కా. RC16 కోసం బుచ్చిబాబు అసలే రెండేళ్ళు టైమ్ తీసుకొని స్క్రిప్ట్ రెడీ చేశాడు. అతని రైటింగ్ పై నమ్మకం ఉంచవచ్చు.
ఇక మరోవైపు సుకుమార్ కూడా లైన్ లో ఉన్నాడు. పుష్ప 2తో ప్రభావం చూపగలిగితే చరణ్ సినిమాకు కావాల్సినంత హైప్ దక్కుతుంది. 600 కోట్లకు పైగా పెట్టుబడులతో వచ్చే ఈ రెండు కాంబినేషన్స్ పై ఒక నమ్మకం అయితే ఉంది. కానీ గేమ్ ఛేంజర్ రిజల్ట్ సంగతి పక్కన పెడితే.. శంకర్ మేకింగ్ వల్ల ట్రోలర్స్ కు ఎక్కడ ఛాన్స్ దొరుకుతుందేమో అనే భయం కూడా ఫ్యాన్స్ లో ఉంది. అసలే ఇండియన్ 2 సీన్స్ పై ఒక రేంజ్ లో ఆడుకున్నారు. కాబట్టి చరణ్ కు ఉన్న క్రేజ్ ను, మార్కెట్ ను డ్యామేజ్ చేయకుండా ఉంటే చాలు. అంతా సాఫీగా సాగితే తరువాత సినిమాలకు కాస్త బూస్ట్ ఇచ్చినట్లే.