Movie News

ఆ క‌థ నాని నుంచి నితిన్‌కు?

ఎల్ల‌మ్మ‌.. టాలీవుడ్లో చాలా రోజుల నుంచి చ‌ర్చ‌ల్లో ఉన్న సినిమా. బ‌ల‌గం మూవీతో అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచిన క‌మెడియ‌న్ ట‌ర్న్డ్ డైరెక్ట‌ర్ వేణు యెల్దండి త‌న రెండో చిత్రంగా దీన్నే తెర‌కెక్కించాల‌నుకున్నాడు. నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా ఈ సినిమా తీయ‌డానికి స‌న్నాహాలు చేసుకున్నాడు. బ‌ల‌గం తీసిన దిల్ రాజు బేన‌ర్లోనే ఈ సినిమా చేయ‌డానికి ఒక ద‌శ‌లో అంగీకారం కుదిరింది.

దిల్ రాజు స్వ‌యంగా ఈ ప్రాజెక్టు గురించి గ‌త ఏడాది క‌న్ఫ‌మ్ చేశారు. కానీ మ‌ధ్య‌లో ఏమైందో ఏమో ఈ ప్రాజెక్టు నుంచి నాని త‌ప్పుకున్నాడు. దీంతో ఎల్ల‌మ్మ అట‌కెక్కేసింద‌నే అంతా అనుకున్నారు. వేణుతో వీలును బ‌ట్టి సినిమా చేస్తాన‌ని నాని చెప్పాడు. కానీ నేచుర‌ల్ స్టార్ వేరే ప్రాజెక్టుల‌తో బిజీ అయిపోయిన నేప‌థ్యంలో స‌మీప భ‌విష్య‌త్తులో వీరి క‌ల‌యిక‌లో సినిమా వ‌చ్చే సంకేఆలు క‌నిపించ‌డం లేదు. మ‌రి వేణు త‌ర్వాతి ప్రాజెక్టు ఏదై ఉంటుంది.. ఎవ‌రిత చేస్తాడు అనే ఆస‌క్తి అంద‌రిలోనూ ఉంది.

ఎల్ల‌మ్మ క‌థ‌ను వేణు ప‌క్క‌న పెట్ట‌లేద‌ని తాజా స‌మాచారం. ఈ క‌థ‌నే వేరే హీరోతో చేయడానికి ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు. ప్ర‌స్తుతానికి ఈ ప్రాజెక్టుకు గ‌ట్టిగా వినిపిస్తున్న పేరు.. యూత్ స్టార్ నితిన్‌దే. దిల్ రాజుతో నితిన్‌కు మంచి అనుబంధం ఉంది. రాజు కెరీర్‌ను మ‌లుపు తిప్పిన దిల్ మూవీని నితిన్‌తోనే చేశాడు. ఆ త‌ర్వాత వీరి క‌ల‌యిక‌లో శ్రీనివాస క‌ళ్యాణం వ‌చ్చింది కానీ ఆడ‌లేదు. ప్ర‌స్తుతం రాజు బేన‌ర్లో త‌మ్ముడు మూవీ చేస్తున్నాడు నితిన్.

ఇటీవ‌లే ఎల్ల‌మ్మ క‌థ‌ను నితిన్‌కు వేణు న‌రేట్ చేయ‌గా.. అత‌ను సూత్ర‌ప్రాయంగా అంగీకారం తెలిపినట్లు స‌మాచారం. రూర‌ల్ బ్యాక్ డ్రాప్‌లో సాగే ఈ క‌థ త‌న‌కు డిఫ‌రెంటుగా ఉంటుంద‌ని నితిన్ ఫీల‌య్యాడ‌ని.. కాబ‌ట్టి అత‌నే ఈ చిత్రంలో హీరోగా న‌టిస్తాడ‌ని తెలుస్తోంది. మ‌ధ్య‌లో తేజ స‌జ్జకు కూడా ఈ క‌థను చెప్పిన‌ట్లు స‌మాచారం. మ‌రి అత‌నేమ‌న్నాడ‌న్న‌ది తెలియ‌దు. నితిన్‌తో ఎల్ల‌మ్మ ప్రాజెక్టు సెట్ కావ‌డం ఖాయ‌మ‌ని.. త్వ‌ర‌లోనే దీని గురించి ప్ర‌క‌ట‌న రావ‌చ్చ‌ని అంటున్నారు.

This post was last modified on October 16, 2024 12:38 pm

Share

Recent Posts

ఉత్త‌రాంధ్ర‌లో `నాలుగు` స్తంభాలాట‌.. !

ఉత్త‌రాంధ్ర‌లోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయ‌కుల మ‌ధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…

13 minutes ago

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

6 hours ago

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

7 hours ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

9 hours ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

9 hours ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

9 hours ago