వారసులు రాజ్యమేలే ఫిలిం ఇండస్ట్రీలో సొంతంగా హీరోగా ఎదిగి ఒక స్థాయిని అందుకోవడం అంత తేలికైన విషయం కాదు. బాలీవుడ్లో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనే కుర్రాడు ఇలాగే ఎంతో కష్టపడి మంచి స్థాయికి చేరుకున్నాడు. ‘ఎం.ఎస్.ధోని’ సహా పలు చిత్రాలతో గుర్తింపు సంపాదించిన అతను.. ఇంకా పెద్ద రేంజికి వెళ్తాడనుకుంటే.. నాలుగేళ్ల కిందట ఆత్మహత్య చేసుకుని చనిపోవడం తన అభిమానులకు పెద్ద షాక్.
తన కథ ఇలా ముగియడం కోట్ల మందిని కదిలించేసింది. ముందు సుశాంత్ మరణం విషయంలో అనుమానాలు వ్యక్తమైనా.. తర్వాత తనది ఆత్మహత్యే అని పోలీసులు తేల్చారు. ఐతే సుశాంత్ ఎంతో ఇష్టపడి కొనుక్కున్న ఇంటిని ఇటీవల హీరోయిన్ ఆదాశర్మ కొన్న సంగతి తెలిసిందే. ఐతే పబ్లిసిటీ కోసమే ఆదా ఇలా చేసిందని నెటిజన్లు ఆమెను కామెంట్ చేశారు. దీనిపై ఆదా స్పందించింది.
తన గురించి ఎవరేం కామెంట్ చేసినా పట్టించుకోలేదని.. సుశాంత్ ఇల్లు తనకెంతో నచ్చిందని.. దాన్ని పూర్తిగా రీమోడలింగ్ చేయించానని ఆమె వెల్లడించింది. సుశాంత్ ఇంట్లో ఏదో తెలియని శక్తి ఉందని ఆమె వ్యాఖ్యానించింది.
“మనం జీవితంలో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. మన దేశంలో ఎవరు ఏ అభిప్రాయం అయినా వ్యక్తం చేయొచ్చు. నేను ఈ ఇంటిని కొనడంపైనా చాలామంది కామెంట్లు చేశారు. నేను మంచి వ్యక్తిని అని రుజువు చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు. నాకు చేయాలనిపించింది చేశా. నాకు సుశాంత్ ఇల్లు ఎంతో నచ్చింది. మా అమ్మ, అమ్మమ్మతో కలిసి ఈ ఇంట్లో ఉంటున్నా. ఇల్లు మొత్తాన్ని రీ మోడల్ చేయించా. మొదటి అంతస్థును గుడిలా మార్చా. ఓ గదిని డ్యాన్స్ స్టూడియోగా మార్చా. టెర్రస్ మొత్తాన్ని గార్డెన్‌గా చేశా. నాకు ఈ ఇంట్లో పాజిటివ్ వైబ్స్ కనిపిస్తాయి. ఇక్కడ ఏదో తెలియని శక్తి ఉందనిపిస్తుంది” అని ఆదా పేర్కొంది.
This post was last modified on October 16, 2024 11:24 am
వేటూరి, సిరివెన్నెల లాంటి దిగ్గజ గేయ రచయితలు వెళ్ళిపోయాక తెలుగు సినీ పాటల స్థాయి తగ్గిపోయిందని సాహితీ అభిమానులు బాధ…
నెలలో ఒక్కరోజు గ్రామీణ ప్రాంతాలకు రావాలని.. ఇక్కడి వారికి వైద్య సేవలు అందించాలని డాక్టర్లకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్…
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…